అసలు మొదటిగా ఏం జరిగిందో తెలుసుకుందాము. ఆ తరువాత ఎలా జరిగింది అని అలోచిద్దాము. నా బ్లాగు మొదలు పెట్టిన కొత్తలో ఎప్పుడొ online photo hosting sites కోసం వెతుకుతున్నప్పుడు నాకు flickr గురించి తెలిసింది. ఇంకొన్ని వేరే సైట్లు ఉన్నా కూడా flickr నచ్చినంతగా అవి నచ్చలేదు. అప్పుడప్పుడూ అలా flickrలో తిరుగుతున్నప్పుడు కొంత మంది పేర్ల పక్కన pro అని కనపడుతూ ఉండేది. మొదట్లో మంచి మంచి ఫొటోలు తీసేవాళ్ల పక్కన అలా pro అని వస్తుందేమో అని అనుకున్నాను, తరువాత తెలిసింది లెండి, ప్రతీ నెలా రెందు డాలర్లు కడితే మన పేరు పక్కన కూడా pro అని వచ్చేస్తుందని తెలిసింది. నాకంతెందుకులే అని, ఉచిత సేవలతోనే సరిపెట్టుకున్నాను.
అయితే మొన్న 21న జరిగిందది. flickrలో నా పేరు పక్కన కూడా pro అని కనిపించటం మొదలయింది, అలా అని నేను డబ్బులేమయినా కట్టానా అంటే, ఒక్క రూపాయి కూడా కట్టలేదు. మరింకెందుకు అలా కనిపించటం మొదలయ్యింది. ఇంకా వివరాలలోకి వెళితే నేను ఇంకో నెలపాటు(వచ్చే నెల 21 వరకు) అలా నా పేరు పక్కన proని చూసుకుంటూ మురిసిపోవచ్చని తెలిసింది.
ఇప్పుడు అసలు ప్రశ్న flickrలో నేను డబ్బులు కట్టకపోయినా, నా ఎకౌంటు proగా ఎలా మారిపోయింది? ఇలా జరగటానికి నాకు రెండు కారణాలు కనపడుతున్నాయి. ఈ రెండిటిలో ఏదయినా కవొచ్చు. ఎవరయినా నాకు బహుమతిగా పంపించుండొచ్చు... కానీ అలా నాకు ఒక pro ఎకౌంటు కొంటునట్లు ఎటువంటి మెయిల్లు రాలేదు... ఇంక రెండోది flickrలో ఇదొక feature లాంటి bug అనుకుంటా :)
మీకీ సంగతి తెలుసా; flickrలోకి మీరు ఎక్కించిన ఫొటోలు, ఇతరులకు నచ్చుతాయా నచ్చవా అనే అంశం పరిశీలించి వాటిని ఆ రకంగా వర్గీకరిస్తుంది. ఇది కూడా మనుషులు కాకుండా ప్రోగ్రాములే చేస్తాయని నా వుద్దేశం...
Sunday, September 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
కారణం ఇక్కడ !
ReplyDeleteఅదన్నమాట సంగతి. ఒక వారం రోజులు ముందుగా యాహూలో ఫోటోలను transfer చేయమని చెప్పాను.
ReplyDelete:)
ReplyDeleteఅందుకే ఆల్రడీ నేను ఓ ఏడెనిమిది సెట్లు సృష్టించేసుకున్నా ముందు ముందు ఉపయోగపడతాయని.
అవును "interestingness" అనేది flickr/Yahoo! వారి పేటెంట్ చెయ్యబడిన ఆల్గారిథం. దానిని క్లిక్కులు, వ్యూస్, కామెంట్స్, టాగ్స్ మొదలయినవాటి మీద ఆధారం చేసి నిర్ణయిస్తారు.
makineni pradeep గారు, makineni "PRO"deep గారు అయిపోయారన్నమాట..!! :-)
ReplyDelete@ప్రవీణ్,
ReplyDeleteనేను కూడా సెట్లను సృస్టించుకున్నాను, కానీ మళ్లీ మామూలు ఎకౌంటుగా మారిన తరువాత అవన్నీ కనపడకుండా పోతాయేమో...
@రాజారావుగారు,
హిహిహి!
సెప్టెంబరు నెల మొదట్లో రాకేశ్వరుడి బ్లాగులో వ్యాఖ్య రాస్తూ "అమెరికా తెలుగు కథ" చదువుతున్నానని సెలవిచ్చారు. చదవటం పూర్తయిందా? నాకు కొంచెం కుతూహలంగా ఉంది - వీలుచూసుకుని నా ఈ ప్రశ్నలకు జవాబులివ్వగలరు:
ReplyDelete1. మీకు ఈ పుస్తకం ఎలా వచ్చింది? ఎవరైనా ఇచ్చారా?
2. ఒకవేళ మీరే షాపులో కొన్నట్టైతే ఇది కొనాలని మీకెందుకు అనిపించింది?
3. తుపాకి అనే కథ చదివారా? ఎలా ఉంది?
4. మీకు బాగా నచ్చిన కొన్ని క్థల గురించి చెప్పండి. అస్సలు నచ్చని వాటిని గురించి కూడా చెప్పండి.
సమాధానాలు ఒక టపాగా రాస్తే మరీ మంచిది. లేకపోతే ఇక్కడ కానీ, నా బ్లాగులో గానీ వ్యాఖ్యగా ఐనా సరే. ముందుగానే ధన్యవాదాలు.