Tuesday, February 10, 2009

చెన్నైలో వరదలు

అప్పుడెప్పుడో చెన్నైలో వరదలు (తుఫాను వలన వచ్చిన వరదలు) వచ్చినప్పుడు, ఈ పోస్టుని తయారు చేసి పెట్టుకున్నా. ఆఫీసులో పని వత్తిడి వలన దీన్ని పోస్టు చేయడం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది కాబట్టి పోస్టు చేస్తున్నా!

మొన్న నవంబరులో నిషా అనబడే తుఫాను ఒకటి వచ్చింది. అప్పుడు తీసిన ఫొటోలే ఇవి. చెన్నైలో మురుగునీరు అంతటినీ సముద్రంలో కలిపేస్తూ ఉంటారు. తుఫాను వలన నీరు సముద్రంలోకి వెళ్లే బదులు అక్కడి నుండి వెనక్కు రావడం మొదలయ్యింది. ఇలా మురుగు కాలవలలోని నీరు సముద్రంలో కలవక పోవడం వలన, భారీగా వర్షాలు పడటం వలన చెన్నైలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు మోకాలులోతు వరకు నీళ్లు పేరుకుపోయాయి. నా దురదృష్టం కోద్దీ అలా నీళ్లలో మునిగిపోయిన కొన్ని 'ప్రాంతాలలో', నేను ఉంటున్న ప్రాంతం కూడా ఒకటి.

ఇది మేముంటున్న ఇంటి వెనుక ఉన్న బావి, నీటిలో మునిగిపోయింది!

ఎక్కడి నుండి వచ్చిందో మరి, మాతోపాటే వాన తగ్గుతుందేమో అని ఎదురుచూసి చాలా సేపటి తర్వాత ఆ నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్లిపోయింది.

ఆరోజు మాకు కనపడ్డ పాములలో ఇదీ ఒక్కటి

వర్షం ఆగిపోయింది కానీ ఆకాశం అంతా చాలా సేపు ఇలా దట్టమైన మేఘాలతో నిండిపోయింది

మొత్తం అంతా ఇలా నీళ్లతో నిండిపోయింది, రెండురోజులు పట్టింది ఈ నీళ్లన్నీ పోడానికి...