Sunday, September 16, 2007

నేనూ ఒక ఇంటివాడినయ్యాను

నిజం చెప్పాలంటే నా బ్లాగు ఒక ఇంటిదయ్యింది, నేను కాదు :) ఈ మధ్యనే నేను ఒక 10 డాలర్లు పెట్టి ఒక URL కొనుకున్నాను, ప్రతీ సంవత్సరం ఇలా 10 డాలర్లు కడుతూ ఉండాలంట!. గూగుల్ ద్వారా గోడాడీలో కొనుక్కున్నాను. అంటే గూగులే ఇప్పుడు నా సైటుకు కావలిసిన స్టోరేజీ, బ్యాండ్‍విడ్తూ ఇచ్చి వాటి నిర్వహణా బాద్యతలను కూడా ఉచితంగా చేపడుతుంది. కాకపోతే మనకు ఇక్కడ వెబ్ సర్వర్, డేటాబేసు సర్వర్ ఉండవు.

URL కొనుక్కున్న తరువాత నేను చేసిన కొన్ని ప్రయోగాల వలన, తేనెగూడులో నా పాత టపా మూడు సార్లు వచ్చింది, ఆ తరువాత నేను తేనెగూడులో ఉన్న click analysisతో చేసిన ప్రయోగాల వలన, అక్కడ ఉండే "ఎక్కువగా చూచిన టపాలు" అనే శీర్షికలో మొదటి మూడు టపాలూ నావే వచ్చేసాయి :)

5 comments:

  1. నువ్వూ మార్గదర్శిలో చేరావన్నమాట... :)వెరీ గుడ్.

    సొంత బ్లాగే హోస్ట్ చెయ్యాల్సింది బ్లాగర్ బదులు.

    ReplyDelete
  2. నేను ఆ 10 డాలర్ల ఖర్చు కూడా దండగని అనుకుంటుంటే, మీరేంటండీ హోస్టింగూ దాకా వెళ్ళిపోయారు...

    ReplyDelete
  3. ఈమధ్య నేనూ మీలాగే "డాడీ" దగ్గరికెళ్ళాను. http://kalagooragampa.blogspot.com అనే కొండవీటి చాంతాడంత URL ని సులభంగా సరళంగా http://www.tadepally.com అని మార్చేసుకున్నాను. పునర్జన్మెత్తినంత తాజాగా ఉంది. అయినా పాత URL తో కూడా నా బ్లాగు పలుకుతుంది.

    "డాడీకి" కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. ధన్యవాదాలు నాగరాజాగారు, URLని వచ్చే సంవత్సరం మళ్ళీ renewal చేసుకుంటానో లేదో కూడా తెలీదు :) అసలు నేను hostingతో (webserver, database) ఏదయినా చేసుకోవటానికి ఇంకా ఏ ప్రణాలికలు తయారు చేసుకోలేదు...

    ReplyDelete