అలగర్‌కోవిల్ తమిళనాడులో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి, ఇది అలగర్ అనే కొండపైన ఉంటుంది. కొండ కింద ఒక గుడి, పైన రెండు గుళ్లు ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 అయిపోయింది. కింద ఉన్న గుడికి మరమత్తులు చేస్తున్నారు. కొండమీద ఉండే గుడికి రోడుమార్గం ఉంటుంది. మేము మాత్రం ఆ రోడ్డుకు ఆనుకుని ఉండే అడవిమార్గంలో నడుచుకుంటూ కొండ మీదకి వెళ్లటానికి నిశ్చయించుకున్నాము. (అసలు అలా trekking చేయొచ్చన్నే అక్కడకు వెల్లాము)
ఈ బావి అడవిదారి మొదట్లోనే కనపడుతుంది. ఇక్కడిదాకా రావాలంటే కొండ కింద ఉన్న గుడి లోపలకు వెళ్లి, కొండకు గుడికి అడ్డంగా కట్టిన పెద్ద గోడలో ఉన్న ఒక చిన్న ద్వారం గుండా వెళ్లాలి.
వర్షాకాలం అవ్వటం వళ్లనేమో అడవి చాలా దట్టంగా ఉంది, మేము బస్సులో కొండను చేరుకునే వరకూ వర్షం పడుతూనే ఉండటం వలన నేలంతా తడి తడిగా ఉంది.
అలా అడవిమార్గంలో కొంత దూరం నడిచిన తరువాత రోడ్డు ఇలా రోడ్డు కనపడింది. అడవిలోనే వెళ్లటానికి మాకు ఇంక దారి కనపడలేదు. సరే అని ఇంక రోడుమార్గంలోనే మిగతా కొండ ఎక్కడం మొదలు పెట్టాము.
అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ ...
సుమారు గంటన్నర నడక తరువాత ఇలా కొండపైన ఉన్న గుడి ఆనవాలు కనపడింది. ఇక్కడ కొండపైన ఉండే మొదటి గుడి ఉంటుంది. ఇక్కడి నుండి ఇంకో 10-15 నిమిషాలు నడిస్తే రోడ్డు అంతమయ్యి ఇంకో గుడి ఉంటుంది. ఈ రెండో గుడిని చత్తాచెదారాన్ని పేర్చడానికి వాడుతున్నారా అని అనిపిస్తుంది.
అలా కొండపైవరకూ వచ్చిన తరువాత అక్కడ ఏంచేయాలో తోచక మళ్లీ కిందకు దిగటం మొదలుపెట్టాము. ఈ కొండ నిండా బోలెడన్ని కోతులు ఉంటాయి, అవి మన దగ్గర ఉన్న సంచీలలో ఏవయినా తినుబండారాలు ఉన్నాయేమోనని వాటిని లాక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, కాబట్టి మీరు ఎప్పుడయినా ఇక్కడికి వెళ్ళినప్పుడు వాటితో జాగ్రత్తగా ఉండండి.
కొండమీద నుండీ దిగుతున్నప్పుడు ఇలా ఒక జంట కనపడితే కెమెరాతో ఒక క్లిక్కు క్లిక్కాను. జంట ఎక్కడా కనపడటంలేదంటారా :) అయితే ఫొటో అసలు సైజులో వెతకండి కనపడుతుందేమో.
కొండదిగుతున్నపుడు కనిపించిన ప్రకృతి దృశ్యాలు.
తరువాతి రోజు పెళ్లిలో సాంబారులో అన్నం కలుపుకు తినేసి, మధురైలోనే ఉండే నాయక్ మహల్ చూడటానికి వెల్లాము. 17వ శతాబ్ధంలోనే అంత పెద్ద భవనాన్ని కట్టడం ఒక ఎత్తయితే పైకప్పుతో సహా భవనం మొత్తాన్ని ఇటుకలూ సున్నంతోనే కట్టేసారు, అయినా ఇంకా చెక్కుచెదరలేదు.
ప్రస్తుతం మహలులో ఒక దర్బారు, ఆసనం, దర్బారు చుట్టూ ఒక వరండా కొన్ని చిన్న చిన్న గదులూ మిగిలి ఉన్నాయి. మిగతా చాలాభాగం ద్వంసం చేసేసారంట. ఒక గదిలో మహలు చుట్టుపక్కల లభ్యమైన రాతిశిల్పాలు, టెర్రకోట బొమ్మలను ప్రదర్శనకై ఉంచారు.
ఇంకొన్ని విశేషాలు:
- బెంగుళూరులోనూ, హైదరాబాదులోనూ ఫుట్‌పాతులపై అమ్మే దొంగ CDలను అమ్మటానికి ఇక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అమ్ముతున్నారు. కొనే ముందు CDలో ఉన్న సినిమా ఎంత క్వాలిటీ ఉందో చూసుకోవటానికి డీవీడీ ప్లేయర్లను కూడా ఏర్పాటు చేసారు!!!
- మధురైలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం "జిగర్ తండా".
- మధురైలో నుండీ 100-150కీమీల దూరంలో మంచి మంచి జలపాతాలు కూడా ఉన్నాయి, కానీ మేము వాటిని చూడలేకపోయాము.
జంట అంటే ఎవరో అనుకున్నా కోతులా.
ReplyDeletethinking of planning a trip to maduari, after reading ur blog... and one more ... photos are too good.
ReplyDeleteHey Pra ne trip chala bagunatlundi
ReplyDeleteఫోటోలు బాగున్నాయి. వికీ కోసం పనికొస్తాయనుకుంటా.:) మీనాక్షి గుడి ఫోటోలు లేనట్టేనా?
ReplyDelete@విహారి(kbl) - ఆ కొతులే మరి.
ReplyDelete@rajus - మధురైలో గుడులే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పటానికే ఈ ఫొటోలు :)
@srinivas - ఆ చాలా బాగా జరిగింది trip.
@చదువరి - గుడి ఫొటోలు ఆంగ్లవికీలోనే ఉన్నాయి. లోపట ఉన్న 1000 స్థంభాల హాలులో ఉన్న విగ్రహాల ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. అవి పనికి వస్తాయేమో వికీకి.
సంతోషం. వైశాల్యంలోనూ వ్యాపారప్రాముఖ్యతలోనూ ముఖ్యమైన నగరమైనా, మదురైలో ఆ హడావుడి కనబడదు. మీనాక్షి దేవాలయం, దానికి దగ్గర్లోనే ఉన్న కూడలళగర్ ఆలయం సంపూర్ణంగా చూడాలంటే ఒక రోజు పడుతుంది. మీకు అళగర్ ఆలయం గురించి తెలియటమే వింతగా అనిపిస్తోంది నాకు. అక్కడ చెప్పే కథల ప్రకారం ఆయన దొంగల నాయకుడు. ఇంకెక్కడి విష్ణ్వాలయాలలో లేని విధంగా ఈ మూర్తి పొడుగాటి ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. చాలా మంది యాత్రికులు ఇక్కణ్ణించి రోడ్డుమీద కేరళ సరిహద్దులో ఉన్న తేకడి వన్యాశ్రమ రక్షిత ప్రాంతం చూడ్డానికి వెళతారు. కొడైకెనాల్ కొండలు కూడా ఇక్కడికి దగ్గరే.
ReplyDeleteనాయక్ మహల్ లో సాయంత్రం sound and Light show ప్రదర్శన చూడతగ్గది. అక్కడి రాజుల గురించి, పట్టణ చరిత్ర గురించి వివరిస్తారు. మణిరత్నం ' ఇద్దరు ' వగైరా చిత్రాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. ఊరు చివర కోనేరులో అమ్మవారి కోనేటి ఉత్సవం చూడటానికి దేశ, విదేశి యాత్రికులు వస్తుంటారు.
ReplyDeleteRailway Station దగ్గరిలోనే College Hotel లో ఎప్పుడు వెళ్లినా బస దొరుకుతుంది.
గుముసుము గుముసుము గుప్పుచ్చు..మామా కొడుకు రాతిరికొస్తే పాట చిత్రీకరించింది ఇక్కడే (తిరుమల నాయగర్ ప్యాలెస్లో)..ఫోటోలు బాగున్నాయి
ReplyDelete@కొత్తపాళీ - మేము కింద గుడినీ పైన గుడినీ, దాని పైన ఉన్న గుడినీ బయటనుండే చూసేసి వచ్చేసాము. లోపటికి వెళ్లలేదు :(
ReplyDelete@cbrao - ఊరి చివర కోనేరా!!!, దాని గురించి మా గైడు(పెళ్లికొడుకు) మాకు చెప్పలేదు.
@రవి - ఫొటోలు మీకు నచ్చినందుకు సంతోషం.
మరిన్ని ఫొటోలను పికాసాలో అప్లోడు చేసాను. ఇంకా ఓపికుంటే చూడండి.
Photos bagunnayi.. seems like you had a nice trip!
ReplyDeleteబాగుంది మీ ట్రిప్...
ReplyDeleteపెళ్ళికొడుకు ని గైడ్ గా భలేగా కుదిర్చారే. :)
ఫోటోలు కూడా బాగా వచ్చాయి.
బాగున్నాయి మీ యాత్రా విశేషాలు.
ReplyDelete