ఇందాకే స్ప్రైట్ కొనుక్కుని తాగటం మొదలు పెట్టాను. ఇంతలో టీవీలో వస్తున్న స్ప్రైట్ వాణిజ్య ప్రకటణ గుర్తుకు వచ్చింది. పక్కనున్న నా స్నేహితుడు తన అదృష్టాన్ని పరీక్షించుందామని అనుకున్నాడు. వెంటానే ఆ బాటిల్లో వచ్చిన codeను వాళ్లు ఇచ్చిన నంబరుకు ఒక SMS పంపించాడు. కొంత సేపటికి స్ప్రైట్ బాటిలు ఏ రంగులో ఉంటుంది అని అడుగుతూ ఇంకో SMS పంపించమంటూ ఒక SMS వచ్చింది. దానికి కూడా, నా మితృడు, ఇంకో SMSను సమాధానంగా పంపించాడు. ఈ సారి 2008లో తమిళనాడులో అమ్మిన మొత్తం స్ప్రైట్ బాటిల్లెన్నో తెలుపమంటూ ఇంకో SMS వచ్చింది!!!
అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా, నోకియా ఫోనుని గెలుచుకుందామని కంకణం కట్టుకుని, అంతర్జాలంలో వెతికి రెండో ప్రశ్నకు కూడా సమాధానం పట్టేసుకుని సమాధానం పంపించాడు. కొంత సేపటికి లక్కీ డ్రాలో గెలిస్తే మీకో నోకియా ఫోనుని పంపిస్తాము ఆ codeని జాగ్రత్త చేసి పెట్టుకో మంటూ ఒక SMS వచ్చింది. దీనికే నా మితృడు నోకియా ఫోనునే గెలుచుకున్నంత ఆనందంతో పులకరించిపోయాడు. ప్రస్తుతం తన నోకియా ఫోనుకోసం codeను పట్టుకుని ఎదురు చూస్తావున్నాడు. అతను గెలుస్తాడంటారా...
Sunday, June 07, 2009
Subscribe to:
Posts (Atom)