అసలు మొదటిగా ఏం జరిగిందో తెలుసుకుందాము. ఆ తరువాత ఎలా జరిగింది అని అలోచిద్దాము. నా బ్లాగు మొదలు పెట్టిన కొత్తలో ఎప్పుడొ online photo hosting sites కోసం వెతుకుతున్నప్పుడు నాకు flickr గురించి తెలిసింది. ఇంకొన్ని వేరే సైట్లు ఉన్నా కూడా flickr నచ్చినంతగా అవి నచ్చలేదు. అప్పుడప్పుడూ అలా flickrలో తిరుగుతున్నప్పుడు కొంత మంది పేర్ల పక్కన pro అని కనపడుతూ ఉండేది. మొదట్లో మంచి మంచి ఫొటోలు తీసేవాళ్ల పక్కన అలా pro అని వస్తుందేమో అని అనుకున్నాను, తరువాత తెలిసింది లెండి, ప్రతీ నెలా రెందు డాలర్లు కడితే మన పేరు పక్కన కూడా pro అని వచ్చేస్తుందని తెలిసింది. నాకంతెందుకులే అని, ఉచిత సేవలతోనే సరిపెట్టుకున్నాను.
అయితే మొన్న 21న జరిగిందది. flickrలో నా పేరు పక్కన కూడా pro అని కనిపించటం మొదలయింది, అలా అని నేను డబ్బులేమయినా కట్టానా అంటే, ఒక్క రూపాయి కూడా కట్టలేదు. మరింకెందుకు అలా కనిపించటం మొదలయ్యింది. ఇంకా వివరాలలోకి వెళితే నేను ఇంకో నెలపాటు(వచ్చే నెల 21 వరకు) అలా నా పేరు పక్కన proని చూసుకుంటూ మురిసిపోవచ్చని తెలిసింది.
ఇప్పుడు అసలు ప్రశ్న flickrలో నేను డబ్బులు కట్టకపోయినా, నా ఎకౌంటు proగా ఎలా మారిపోయింది? ఇలా జరగటానికి నాకు రెండు కారణాలు కనపడుతున్నాయి. ఈ రెండిటిలో ఏదయినా కవొచ్చు. ఎవరయినా నాకు బహుమతిగా పంపించుండొచ్చు... కానీ అలా నాకు ఒక pro ఎకౌంటు కొంటునట్లు ఎటువంటి మెయిల్లు రాలేదు... ఇంక రెండోది flickrలో ఇదొక feature లాంటి bug అనుకుంటా :)
మీకీ సంగతి తెలుసా; flickrలోకి మీరు ఎక్కించిన ఫొటోలు, ఇతరులకు నచ్చుతాయా నచ్చవా అనే అంశం పరిశీలించి వాటిని ఆ రకంగా వర్గీకరిస్తుంది. ఇది కూడా మనుషులు కాకుండా ప్రోగ్రాములే చేస్తాయని నా వుద్దేశం...
Sunday, September 23, 2007
Friday, September 21, 2007
తెలుగులో అతి తరచుగా ఉపయోగించే అక్షరం ఏది?
ఆంగ్లంలో "E" అనే అక్షరాన్ని అతి తరచుగా వాడతారని మనందరికీ తెలిసిందే, మరి తెలుగులో కూడా అటువంటి అక్షరం ఒకటి ఉండాలి కదా... ఈ ప్రశ్నకు జవాబును కనుక్కోవటానికి తెలుగు వికీపీడియాలో ఉన్న సుమారు 58 వేల పేజీల సమాచారాన్ని సేకరించి పరిశీలించాను. అయితే చివరికి వచ్చే ఫలితాల నాణ్యత కాపాడటానికి 2KB కంటే తక్కువ సమాచారం ఉన్న పేజీలను పరిశీలన నుండి తప్పించాను, ఇలా తప్పించటం వలన దాదాపు అన్ని గ్రామాల పేజీలు, చాలా మట్టుకు సినిమా పేజీలు విశ్లేషణ నుండి బయట పడ్డాయి. అంటే విశ్లేషణకు ఇక మిగిలిన పేజీలలో ఉన్న సమాచారం మొత్తాన్ని ప్రోగ్రాములతో కాకుండా దాదాపూ పూర్తిగా మనుషులతోనే సృష్టించారు.
ఈ గణాంకాలు తీసుకుంటున్నప్పుడు వత్తులను కూడా మామూలు అక్షరాలతో సమానంగా లెక్కగట్టాను. ఈ గణాంకాలను తెలుగు వికీపీడియాలోని 3419 పేజీలలో ఉన్న సుమారు 66 లక్షల అక్షరాల(వత్తులు గుణింతాలు కలుపుకుని) నుండి సేకరించాను.
అచ్చులలో "ఇ లేదా ి" ఎక్కువగా ఉపయోగిస్తుంటే, హల్లులలో "ర"ను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ రెండిటికంటే కూడా ఎక్కువగా అచ్చు-హల్లు కాని ్(పొల్లును) ఉపయోగిస్తున్నారు!!!
వికీపీడియాలో నాకు వచ్చిన పూర్తి ఫలితాలను ఇక్కడ చూడండి.
ఇలాంటి విశ్లేషణ ఇంతకు ముందే ఒకసారి అన్నమైయ్య పాటలపై ఒకసారి, రచ్చబండ గుంపులోని చర్చలో ఇంకోసారి జరిగాయి. ఈ రెండు చోట్లా మట్టుకు "న" అనే అక్షరం అత్యధికంగా వాడుతున్నట్లుగా గణాంకాలు వచ్చాయి.

Sunday, September 16, 2007
నేనూ ఒక ఇంటివాడినయ్యాను
నిజం చెప్పాలంటే నా బ్లాగు ఒక ఇంటిదయ్యింది, నేను కాదు :) ఈ మధ్యనే నేను ఒక 10 డాలర్లు పెట్టి ఒక URL కొనుకున్నాను, ప్రతీ సంవత్సరం ఇలా 10 డాలర్లు కడుతూ ఉండాలంట!. గూగుల్ ద్వారా గోడాడీలో కొనుక్కున్నాను. అంటే గూగులే ఇప్పుడు నా సైటుకు కావలిసిన స్టోరేజీ, బ్యాండ్‍విడ్తూ ఇచ్చి వాటి నిర్వహణా బాద్యతలను కూడా ఉచితంగా చేపడుతుంది. కాకపోతే మనకు ఇక్కడ వెబ్ సర్వర్, డేటాబేసు సర్వర్ ఉండవు.
URL కొనుక్కున్న తరువాత నేను చేసిన కొన్ని ప్రయోగాల వలన, తేనెగూడులో నా పాత టపా మూడు సార్లు వచ్చింది, ఆ తరువాత నేను తేనెగూడులో ఉన్న click analysisతో చేసిన ప్రయోగాల వలన, అక్కడ ఉండే "ఎక్కువగా చూచిన టపాలు" అనే శీర్షికలో మొదటి మూడు టపాలూ నావే వచ్చేసాయి :)

Tuesday, September 11, 2007
ఈ ఫోటోకి పేరు పెట్టలేదు
Wednesday, September 05, 2007
మధురైకి వెళ్ళి వచ్చాను
ఈ మధ్యన ఒక తోటి ఉద్యోగస్తుడి పెళ్లికని మధురై వెళ్ళి వచ్చాను. ఇంతకుమునుపే ఒక సారి కన్యాకుమారి వెళ్తూ మధురై కూడా వెళ్లాను. కానీ అప్పుడు మధురైలో పేరెన్నికగన్న మధుర మీనాక్షిగుడి నొక్కదానిని హడావిడిగా చూసేసి వచాను. ఈ సారి మధురైలో ఇంకొంత నింపాదిగా తిరిగటానికి అవకాశం లభించింది. పొద్దున్నే మీనాక్షీగుడికి వెళ్లాము, గుడిలో విగ్రహాన్ని ఎక్కడికో ఊరేగింపుకి తీసుకుని వెళ్ళటంవలన గుడిని మూసేసారంట! గుడి పరిసరాలలోనే ఉండే 1000 స్థంభాల హాలులో ఉండే మ్యూసియంను ఓ చుట్టు చుట్టి వచ్చేసాము. తరువాత పెళ్లివారింటికి వెళ్ళి తమిళులకు ప్రీతిపాత్రమైన సాంబారుతో భోజనం కానిచ్చేసి మధురైకి 20కిమీల దూరంలోనే ఉండే అలగర్‌కోవిల్ గుడికి బయలుదేరాము.
అలగర్‌కోవిల్ తమిళనాడులో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి, ఇది అలగర్ అనే కొండపైన ఉంటుంది. కొండ కింద ఒక గుడి, పైన రెండు గుళ్లు ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 అయిపోయింది. కింద ఉన్న గుడికి మరమత్తులు చేస్తున్నారు. కొండమీద ఉండే గుడికి రోడుమార్గం ఉంటుంది. మేము మాత్రం ఆ రోడ్డుకు ఆనుకుని ఉండే అడవిమార్గంలో నడుచుకుంటూ కొండ మీదకి వెళ్లటానికి నిశ్చయించుకున్నాము. (అసలు అలా trekking చేయొచ్చన్నే అక్కడకు వెల్లాము)
ఈ బావి అడవిదారి మొదట్లోనే కనపడుతుంది. ఇక్కడిదాకా రావాలంటే కొండ కింద ఉన్న గుడి లోపలకు వెళ్లి, కొండకు గుడికి అడ్డంగా కట్టిన పెద్ద గోడలో ఉన్న ఒక చిన్న ద్వారం గుండా వెళ్లాలి.
వర్షాకాలం అవ్వటం వళ్లనేమో అడవి చాలా దట్టంగా ఉంది, మేము బస్సులో కొండను చేరుకునే వరకూ వర్షం పడుతూనే ఉండటం వలన నేలంతా తడి తడిగా ఉంది.
అలా అడవిమార్గంలో కొంత దూరం నడిచిన తరువాత రోడ్డు ఇలా రోడ్డు కనపడింది. అడవిలోనే వెళ్లటానికి మాకు ఇంక దారి కనపడలేదు. సరే అని ఇంక రోడుమార్గంలోనే మిగతా కొండ ఎక్కడం మొదలు పెట్టాము.
అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ ...
సుమారు గంటన్నర నడక తరువాత ఇలా కొండపైన ఉన్న గుడి ఆనవాలు కనపడింది. ఇక్కడ కొండపైన ఉండే మొదటి గుడి ఉంటుంది. ఇక్కడి నుండి ఇంకో 10-15 నిమిషాలు నడిస్తే రోడ్డు అంతమయ్యి ఇంకో గుడి ఉంటుంది. ఈ రెండో గుడిని చత్తాచెదారాన్ని పేర్చడానికి వాడుతున్నారా అని అనిపిస్తుంది.
అలా కొండపైవరకూ వచ్చిన తరువాత అక్కడ ఏంచేయాలో తోచక మళ్లీ కిందకు దిగటం మొదలుపెట్టాము. ఈ కొండ నిండా బోలెడన్ని కోతులు ఉంటాయి, అవి మన దగ్గర ఉన్న సంచీలలో ఏవయినా తినుబండారాలు ఉన్నాయేమోనని వాటిని లాక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, కాబట్టి మీరు ఎప్పుడయినా ఇక్కడికి వెళ్ళినప్పుడు వాటితో జాగ్రత్తగా ఉండండి.
కొండమీద నుండీ దిగుతున్నప్పుడు ఇలా ఒక జంట కనపడితే కెమెరాతో ఒక క్లిక్కు క్లిక్కాను. జంట ఎక్కడా కనపడటంలేదంటారా :) అయితే ఫొటో అసలు సైజులో వెతకండి కనపడుతుందేమో.
కొండదిగుతున్నపుడు కనిపించిన ప్రకృతి దృశ్యాలు.
తరువాతి రోజు పెళ్లిలో సాంబారులో అన్నం కలుపుకు తినేసి, మధురైలోనే ఉండే నాయక్ మహల్ చూడటానికి వెల్లాము. 17వ శతాబ్ధంలోనే అంత పెద్ద భవనాన్ని కట్టడం ఒక ఎత్తయితే పైకప్పుతో సహా భవనం మొత్తాన్ని ఇటుకలూ సున్నంతోనే కట్టేసారు, అయినా ఇంకా చెక్కుచెదరలేదు.
ప్రస్తుతం మహలులో ఒక దర్బారు, ఆసనం, దర్బారు చుట్టూ ఒక వరండా కొన్ని చిన్న చిన్న గదులూ మిగిలి ఉన్నాయి. మిగతా చాలాభాగం ద్వంసం చేసేసారంట. ఒక గదిలో మహలు చుట్టుపక్కల లభ్యమైన రాతిశిల్పాలు, టెర్రకోట బొమ్మలను ప్రదర్శనకై ఉంచారు.
ఇంకొన్ని విశేషాలు:

- బెంగుళూరులోనూ, హైదరాబాదులోనూ ఫుట్‌పాతులపై అమ్మే దొంగ CDలను అమ్మటానికి ఇక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అమ్ముతున్నారు. కొనే ముందు CDలో ఉన్న సినిమా ఎంత క్వాలిటీ ఉందో చూసుకోవటానికి డీవీడీ ప్లేయర్లను కూడా ఏర్పాటు చేసారు!!!
- మధురైలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం "జిగర్ తండా".
- మధురైలో నుండీ 100-150కీమీల దూరంలో మంచి మంచి జలపాతాలు కూడా ఉన్నాయి, కానీ మేము వాటిని చూడలేకపోయాము.
జల్లెడలో లోపం
మొన్నా మధ్యన జల్లెడలో టపాల తేదీలను తీసుకోవటంలో ఒక చిన్న లోపాన్ని గమనించాను. దానిని సవరించేవరకూ నాయీటపా అన్నిటికంటే మొదటిగా కనపడుతుంది మరి :) అంతేకాదు నా బ్లాగులో కూడా అన్నిటికంటే ముందు ఈ టపానే కనపడుతుంది :(
టపా రాసిన ఏడు గంటల తరువాత చేసిన మార్పు...
మీ అందరికీ కలిగిన అసౌకర్యానికి నన్ను క్షమించాలి. నాకు ఆటలా తోచింది ఇంకొంతమందికి ఇబ్బందిని, చికాకును తెచ్చిపెడుతున్నాయి. ఏదేమయినా నేను చెప్పాలనుకున్నది చెప్పేసాను కాబట్టి ఈ టపా తేదీని మళ్లీ మార్చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ టపా నా బ్లాగులో కూడా మొదటి టపాగా ఎంత మాత్రమూ ఉండదు :)

Subscribe to:
Posts (Atom)