ఇందాకే స్ప్రైట్ కొనుక్కుని తాగటం మొదలు పెట్టాను. ఇంతలో టీవీలో వస్తున్న స్ప్రైట్ వాణిజ్య ప్రకటణ గుర్తుకు వచ్చింది. పక్కనున్న నా స్నేహితుడు తన అదృష్టాన్ని పరీక్షించుందామని అనుకున్నాడు. వెంటానే ఆ బాటిల్లో వచ్చిన codeను వాళ్లు ఇచ్చిన నంబరుకు ఒక SMS పంపించాడు. కొంత సేపటికి స్ప్రైట్ బాటిలు ఏ రంగులో ఉంటుంది అని అడుగుతూ ఇంకో SMS పంపించమంటూ ఒక SMS వచ్చింది. దానికి కూడా, నా మితృడు, ఇంకో SMSను సమాధానంగా పంపించాడు. ఈ సారి 2008లో తమిళనాడులో అమ్మిన మొత్తం స్ప్రైట్ బాటిల్లెన్నో తెలుపమంటూ ఇంకో SMS వచ్చింది!!!
అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా, నోకియా ఫోనుని గెలుచుకుందామని కంకణం కట్టుకుని, అంతర్జాలంలో వెతికి రెండో ప్రశ్నకు కూడా సమాధానం పట్టేసుకుని సమాధానం పంపించాడు. కొంత సేపటికి లక్కీ డ్రాలో గెలిస్తే మీకో నోకియా ఫోనుని పంపిస్తాము ఆ codeని జాగ్రత్త చేసి పెట్టుకో మంటూ ఒక SMS వచ్చింది. దీనికే నా మితృడు నోకియా ఫోనునే గెలుచుకున్నంత ఆనందంతో పులకరించిపోయాడు. ప్రస్తుతం తన నోకియా ఫోనుకోసం codeను పట్టుకుని ఎదురు చూస్తావున్నాడు. అతను గెలుస్తాడంటారా...
Sunday, June 07, 2009
Subscribe to:
Post Comments (Atom)
ఏంటో అంతా విష్ణుమాయ. పోని గెలవాలని కోరుకుందాం.
ReplyDeleteభావధారిద్ర్యం ఎందుకండి!!
ReplyDeleteగెలవాలనే కోరుకుందాం!!
మూడు యస్సమ్మెస్సులు
ReplyDeleteసుమారుగా 15 రూపాయలన్నమాట ?
ఏంటో లాటరీ టిక్కెట్ కొన్నట్టే అన్నమాట.
ఎంతమంది ఆ లింకులో వున్న నంబరుని చూసారో మరి, అక్కడ వున్న సంఖ్య ఇదీ 333,532,333,335,300. అన్ని స్ప్రైట్ బాటిల్లను వాళ్లు 10 సంవత్సరాలలో కూడా అమ్మగలరో లేదో. అంతేకాదు ఆ రెండో ప్రశ్నకు సరైన సమాధానం ఒక్కళ్లన్నా చెప్తారని కూడా నాకు నమ్మకం లేదు!! వాళ్లు గంటకో మొబైలుని బహుమతిగా ఇస్తున్నారు అని కూడా నమ్మకం లేదు నాకు. కిరణ్‌గారు అన్నట్లు ఇది పూర్తిగా లాటరీ అన్నమాట.
ReplyDeletevankaya pachchadi am kadhu ,mee vadu konna sprite kharchu tho nalugu nokia phonelu konachu avuna kadha!
ReplyDeleteabbe..ilantivannee namma kudadandi..mee snehitudikkooda aa mata telise untundi. kani Phalitam undadani telisina konni panulu cheyyadamlo bhale anandam untundi kada..bahusa mee snehitudu kooda alage chestunnattunnadu. let him feel happy in his eduruchoopulu..Gayatri
ReplyDeleteమీ ఫ్రెండు ఖచ్చితంగా ఒక రోజు నోకియా ఫోన్ గెల్చుకుంటాడండీ.. కాకుంటే ఈ లోపు వాళ్ళబ్బాయి వాళ్ళ ముని ముని మనుమడు కూడా ముసలైపోతాడు.. ఒక వేళ కొద్ది సమయంలో వచ్చేసినా.. అదేదో twinkle twinkle little star లాంటి ఫోన్ ఔతుందని అనిపిస్తుంది.. కొన్నాళ్ళకి స్ప్రైట్ తాగటం మానేసి.. మంచి నీళ్ళని మించిన మాధుర్యం ఇంకెందులోనూ లేదని అనుకుంటాడు..
ReplyDeleteఇవి ఇలా జరుగుతాయని కాదు కానీ... అదృష్టం మీద ఆధారపడే మనసు గతులు ఎలా ఉంటాయో ఉదహరించాలనిపించింది సరదాగా.. మీ స్నేహితుడ్ని ఇందులో వాడినందుకు ఆయనకూ, మీకూ కూడ క్షంతవ్యణ్ణి..
nice to meet you... nice blog..
వీలుంటే http://liscience.blogspot.com చూసి మీ అభిప్రాయాలను టైపు చెయ్య ప్రార్ధన.