Tuesday, February 10, 2009

చెన్నైలో వరదలు

అప్పుడెప్పుడో చెన్నైలో వరదలు (తుఫాను వలన వచ్చిన వరదలు) వచ్చినప్పుడు, ఈ పోస్టుని తయారు చేసి పెట్టుకున్నా. ఆఫీసులో పని వత్తిడి వలన దీన్ని పోస్టు చేయడం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది కాబట్టి పోస్టు చేస్తున్నా!

మొన్న నవంబరులో నిషా అనబడే తుఫాను ఒకటి వచ్చింది. అప్పుడు తీసిన ఫొటోలే ఇవి. చెన్నైలో మురుగునీరు అంతటినీ సముద్రంలో కలిపేస్తూ ఉంటారు. తుఫాను వలన నీరు సముద్రంలోకి వెళ్లే బదులు అక్కడి నుండి వెనక్కు రావడం మొదలయ్యింది. ఇలా మురుగు కాలవలలోని నీరు సముద్రంలో కలవక పోవడం వలన, భారీగా వర్షాలు పడటం వలన చెన్నైలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు మోకాలులోతు వరకు నీళ్లు పేరుకుపోయాయి. నా దురదృష్టం కోద్దీ అలా నీళ్లలో మునిగిపోయిన కొన్ని 'ప్రాంతాలలో', నేను ఉంటున్న ప్రాంతం కూడా ఒకటి.

ఇది మేముంటున్న ఇంటి వెనుక ఉన్న బావి, నీటిలో మునిగిపోయింది!

ఎక్కడి నుండి వచ్చిందో మరి, మాతోపాటే వాన తగ్గుతుందేమో అని ఎదురుచూసి చాలా సేపటి తర్వాత ఆ నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్లిపోయింది.

ఆరోజు మాకు కనపడ్డ పాములలో ఇదీ ఒక్కటి

వర్షం ఆగిపోయింది కానీ ఆకాశం అంతా చాలా సేపు ఇలా దట్టమైన మేఘాలతో నిండిపోయింది

మొత్తం అంతా ఇలా నీళ్లతో నిండిపోయింది, రెండురోజులు పట్టింది ఈ నీళ్లన్నీ పోడానికి...

9 comments:

  1. ammoooo.. chaalaa darunam gaa vachchindi andi tufaan ee lekkana :(

    ReplyDelete
  2. అయ్యో! వర్షం ఇలా శ్రుతిమించి ప్రవర్తిస్తే చాలా చిరాకుగా ఉంటుంది.
    నాకూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయి.

    ReplyDelete
  3. డెభ్భయ్యో దశకంవరకు మద్రాసు నగరంలో చాలా చిన్న చిన్న చెరువులు,కుంటలు,జలాశయాలు ఉండేవి. తరువాత్తరువాత కొంతమంది ఔత్సాహికులు,పుణ్యపరుషులు చేరి వర్షాలు లేని సమయాల్లొ ఎండిపోయిన ఈ జలాశయాల్ని కబ్జా చేసుకున్నారు. ప్లాట్లు కట్ చేసి అమ్మేసుకున్నారు. మీ,నా లాంటి వాళ్ళు వాటిని కొనుక్కున్నారు. ఇవే ఈనాటి ఈ "లోతట్టు" డెభ్భయ్యో దశకంవరకు మద్రాసు నగరంలో చాలా చిన్న చిన్న చెరువులు,కుంటలు,జలాశయాలు ఉండేవి. తరువాత్తరువాత కొంతమంది ఔత్సాహికులు,పుణ్యపరుషులు చేరి వర్షాలు లేని సమయాల్లొ ఎండిపోయిన ఈ జలాశయాల్ని కబ్జా చేసుకున్నారు. ప్లాట్లు కట్ చేసి అమ్మేసుకున్నారు. మీ,నా లాంటి వాళ్ళు వాటిని కొనుక్కున్నారు. ఇవే ఈనాటి ఈ "లోతట్టు" ప్రాంతాలు. నీరు పల్లమెరుగు, so, వర్షాలు బాగా పడ్డ సమయాల్లొ ఈ ప్రాంతాలు ఖచ్చితంగా మునుగుతాయ్. బొంబాయి నగరంలో ప్రభుత్వం/కార్పొరేషన్ అత్య్యాశకు అక్కడి flood water drainage system బలయ్యింది. రెండువేల ఐదులొ లో నగరం వరదల్తో చావు దెబ్బ తింది. ప్రకృతి తన పని తాను చేసుకు పోతుంటుంది. దానికనుగుణంగా మనమే మన జీవనాన్ని నడిపించాలి. లెకపోతే ఇంతే, వరదలు, టీవి చానళ్ళకు కాసుల పంటలు.

    ReplyDelete
  4. మద్రాస్ లో కొంచెం వర్షం పడినా మామ్బలం, టీనగర్ లో నీళ్లు పారుతూ ఉంటాయ్. ప్రతి సంవత్సరం వర్షాకాలం నాకు అనుభవమే!

    ReplyDelete
  5. ఫోటోలే ఇలా ఉంటే, మీరు ఎంత కష్టపడ్డారో కదా!!!!

    ReplyDelete
  6. నాకు ఆ అనుభవమా అయ్యిందండి...మా అన్నయ్య మొదటి సరి U.S వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ అంత వెళ్ళాం....అప్పుడు పెద్ద వాన...మేము విజయవాడలో ఉంటాం...వాడు flight ఎక్కాక మేము రితను అయ్యాం ..మా ట్రైన్ రద్దు అయ్యింది.స్టేషన్ మొత్తం జనం.ఒక్క బస్ లేదు,ట్రైన్ లేదు.
    ఏదో మా పుణ్యమా అని rtc bus...పైగా ఆ బస్ కి చిల్లులు..బస్ లో గొడుగు వేసుకుని కూర్చున్న మొట్టమొదటి వాళ్ళం మేమే నేమో...మద్రాసులో 6 గంటలకు బయలుదేరి ఆ తరువాతి రోజు సాయంత్రము 5 గంటలకు విజయవాడ వచాము...తిండి లేదు...వామ్మో ....!!!!

    ReplyDelete
  7. If I am right, the snake is called as "white-bellied rat snake" (Zaocys Fuscus). Predemonantly forest inhabitant, but also found in water streams hunting for frogs and lizards.

    ReplyDelete
  8. @నేస్తం,
    తుఫాను చిన్నదే, కానీ అది తెచ్చిన చిరాకులు మాత్రం పెద్దవి :)

    @భవాని,
    అవును. ఇలా ఏదన్నా అవుతుందేమో అని తుఫాను మొదలైనప్పుడే వారానికి సరిపడ కూరగాయలవీ పోగేసేసాము. దాని వలన ఆ నీటిలో ఈదే భాధ తప్పింది!!!

    @Pinstriped Zebra,
    అవునండీ, అలాంటి ఒకప్పటి చెరువులోనే వుంటున్నామని కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నాం!!!

    @శ్రీ,
    చెన్నై వచ్చిన కొత్తలో, అంతకు ముందు 3 సంవత్సరాల నుండి ఉంటున్న నా మిత్రుడు "చెన్నైలో అసలు వర్షాలే పడవని" చెప్పాడు :)

    @...Padmarpita...,
    పడవల్లో ఆఫీసులకు బయలు దేరిన వాళ్లతో పోలిస్తే నేను మరీ అంత భాధలు పడలేదు లెండి :)

    @sobha,
    మీరు ట్రెయిను - వరద అనంగానే, నాకు తుఫానులతో వున్న అనుభందాలన్నీ గుర్తుకొచ్చాయి, వాటి గురించి ఇంకెప్పుడైనా ఒక టపా రాస్తాను.

    @Prashanth.M,
    Dont tell me that I live in forest!!

    ReplyDelete
  9. Itis a very beautiful experience in the english world net . but i dont konw how to send in telugu .i am sai (MBA,2007-09)MY EAMIL ID ,sairam.taraka05@gmail.com
    once again I appreciate you for a beautiful telugu world

    ReplyDelete