Friday, September 18, 2009

చెన్నైలో తాంబరం

తాంబరం

మొన్నో రోజు పొద్దున్నే నాలుగింటికే మెలుకువ వచ్చేసింది, మళ్లీ ఎంత ప్రయత్నించిన నిద్ర పట్టలేదు. అప్పుడు కెమరా పట్టుకుని మేము ఉంటున్న అపార్టుమెంటు మేడెక్కి ఈ ఫొటోతీసాను. అప్పుడు నిండు చంద్రుడు ఉన్నాడు కానీ మేఘాలు కూడా దట్టంగా ఉండటం వలన బాగా చీకటిగా ఉంది. కాబట్టి రెండు నిమిషాల exposureతో తీసా దీన్ని.

update:
ఎక్కువ exposure సమయంతో నేను తీసిన ఇంకొన్ని ఫొటోలకు లింకులు.

Thursday, September 10, 2009

నీటి చుక్కలు

నీటి చుక్క

నీటి చుక్క - 2

ఈ నీటి చుక్క ఫొటోలను తీయడానికి బానే కష్టపడాల్సి వచ్చింది. దీనిని "point and shoot" కెమెరాతో తీసాను. మొదటగా ఫొటోతీస్తున్న గదిలో లైటు ఆపేసి చీకటిగా ఉండేటట్లు చేసాను (అలా చేయక ఫొటోలో వెలుతురు సరిగ్గా పరుచుకోవడంలేదు). ఆ తరువాత ఆ చీకట్లోనే నీటి చుక్క ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశంలో ఒక వేలును పెట్టి కెమెరాను అక్కడికి focus చేసాను. నీటి చుక్క పడుతూ ఉండగా కెమెరాను క్లిక్కుమనిపించాను. అన్నీ కుదిరి ఒకటో రెండో మంచి ఫొటోలు తీయటానికి సుమారు మూడు గంటలు పట్టింది నాకు!!! ఇంకొన్ని నీటి చుక్కల ఫొటోల ఉదాహరణలకు flickrలోని ఈ దారాన్ని చూడండి.

Sunday, June 07, 2009

స్ప్రైట్ తాగండి స్ప్రైట్

ఇందాకే స్ప్రైట్ కొనుక్కుని తాగటం మొదలు పెట్టాను. ఇంతలో టీవీలో వస్తున్న స్ప్రైట్ వాణిజ్య ప్రకటణ గుర్తుకు వచ్చింది. పక్కనున్న నా స్నేహితుడు తన అదృష్టాన్ని పరీక్షించుందామని అనుకున్నాడు. వెంటానే ఆ బాటిల్లో వచ్చిన codeను వాళ్లు ఇచ్చిన నంబరుకు ఒక SMS పంపించాడు. కొంత సేపటికి స్ప్రైట్ బాటిలు ఏ రంగులో ఉంటుంది అని అడుగుతూ ఇంకో SMS పంపించమంటూ ఒక SMS వచ్చింది. దానికి కూడా, నా మితృడు, ఇంకో SMSను సమాధానంగా పంపించాడు. ఈ సారి 2008లో తమిళనాడులో అమ్మిన మొత్తం స్ప్రైట్ బాటిల్లెన్నో తెలుపమంటూ ఇంకో SMS వచ్చింది!!!

అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా, నోకియా ఫోనుని గెలుచుకుందామని కంకణం కట్టుకుని, అంతర్జాలంలో వెతికి రెండో ప్రశ్నకు కూడా సమాధానం పట్టేసుకుని సమాధానం పంపించాడు. కొంత సేపటికి లక్కీ డ్రాలో గెలిస్తే మీకో నోకియా ఫోనుని పంపిస్తాము ఆ codeని జాగ్రత్త చేసి పెట్టుకో మంటూ ఒక SMS వచ్చింది. దీనికే నా మితృడు నోకియా ఫోనునే గెలుచుకున్నంత ఆనందంతో పులకరించిపోయాడు. ప్రస్తుతం తన నోకియా ఫోనుకోసం codeను పట్టుకుని ఎదురు చూస్తావున్నాడు. అతను గెలుస్తాడంటారా...

Tuesday, February 10, 2009

చెన్నైలో వరదలు

అప్పుడెప్పుడో చెన్నైలో వరదలు (తుఫాను వలన వచ్చిన వరదలు) వచ్చినప్పుడు, ఈ పోస్టుని తయారు చేసి పెట్టుకున్నా. ఆఫీసులో పని వత్తిడి వలన దీన్ని పోస్టు చేయడం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది కాబట్టి పోస్టు చేస్తున్నా!

మొన్న నవంబరులో నిషా అనబడే తుఫాను ఒకటి వచ్చింది. అప్పుడు తీసిన ఫొటోలే ఇవి. చెన్నైలో మురుగునీరు అంతటినీ సముద్రంలో కలిపేస్తూ ఉంటారు. తుఫాను వలన నీరు సముద్రంలోకి వెళ్లే బదులు అక్కడి నుండి వెనక్కు రావడం మొదలయ్యింది. ఇలా మురుగు కాలవలలోని నీరు సముద్రంలో కలవక పోవడం వలన, భారీగా వర్షాలు పడటం వలన చెన్నైలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు మోకాలులోతు వరకు నీళ్లు పేరుకుపోయాయి. నా దురదృష్టం కోద్దీ అలా నీళ్లలో మునిగిపోయిన కొన్ని 'ప్రాంతాలలో', నేను ఉంటున్న ప్రాంతం కూడా ఒకటి.

ఇది మేముంటున్న ఇంటి వెనుక ఉన్న బావి, నీటిలో మునిగిపోయింది!

ఎక్కడి నుండి వచ్చిందో మరి, మాతోపాటే వాన తగ్గుతుందేమో అని ఎదురుచూసి చాలా సేపటి తర్వాత ఆ నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్లిపోయింది.

ఆరోజు మాకు కనపడ్డ పాములలో ఇదీ ఒక్కటి

వర్షం ఆగిపోయింది కానీ ఆకాశం అంతా చాలా సేపు ఇలా దట్టమైన మేఘాలతో నిండిపోయింది

మొత్తం అంతా ఇలా నీళ్లతో నిండిపోయింది, రెండురోజులు పట్టింది ఈ నీళ్లన్నీ పోడానికి...