Tuesday, November 20, 2007

స్టాకు మార్కెట్టు???

కొన్ని నెలల క్రితం బ్లాగ్‌షేర్స్ అనే సైటులో నా బ్లాగులో షేర్లను అమ్మకానికి పెట్టి నేను నా మొటమొదటి షేర్ల వ్యాపారాన్ని మొదలు పెట్టాను. అక్కడ డబ్బు తప్ప మిగతాదంతా నిజంగానే జరుగుతుంటుంది. ఆ రకంగా కొన్ని రోజులు అక్కడ షేర్ల ఆట ఆడాను. అలా అక్కడ వేరే బ్లాగులలో షేర్లను కొంటూ అమ్ముతూ ఉంటే కొన్ని రోజులకు నా బ్లాగులో నా దగ్గర ఉన్న వాటాకంటే ఎక్కువ వాటాను ఇంకోడెవడో కొట్టేసాడు. నా బ్లాగు నాకు కాకుండా ఇంకోడెవడి దగ్గరో ఉండటమేమిటని (అప్పటికి ఆ సైటు బోరుకొట్టటం మొదలైయింది), ఆ సైటుకు వెళ్లటం మానేసాను. 1000 బ్లాగు డాలర్లతో మొదలు పెట్టి ఆరేడు నెలల్లో సుమారు 500,000 బ్లాగు డాలర్లు సంపాదించానక్కడ :) (అయితే అక్కడ బ్లాగు డాలర్లలో కొంత మంది ఆస్తి 13-14 అంకెలలో ఉండేది).

ఈ మధ్య కాలంలో "నిజమైన" స్టాకు మార్కెట్టును గమనించటం లేదా అందులో పెట్టుబడి పెట్టడం అనే ఒక కొత్త వ్యాపకం మొదలుపెట్టాను. ఇక్కడ కొనటం అమ్మటం ఎంత నిజమో డబ్బులు పోవటం రావడం కూడా అంతే నిజం! నేను స్టాకు మార్కెట్టుకి కొత్త కాబట్టి పెట్టుబడి పెట్టేబదులుగా వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తున్నాను. అందుకుగాను ఒక నాలుగైదు షేర్లను ఎంచుకుని వాటిని పరిశీలించటం మొదలు పెట్టాను. వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తుంటే నా చిన్న బుర్రలో ఉన్న లాజిక్కుకి అందనివి ఏవేవో జరిగిపోతున్నాయక్కడ...

ఉదాహరణకు ఒక "క", "చ" అనే రెండు కంపెనీల షేర్లను తీసుకుందాం. రెండు కంపెనీల షేర్లూ పెరుగుతుతున్నాయి. అంతా బాగానే ఉందికదా అనుకుంటూ వాటి తీరుతెన్నులు పరిశీలించాలని అనుకున్నాను, అప్పుడే గమనించాను "చ" అనే కంపెనీ షేర్లను అమ్మే వాళ్ళకంటే కొనేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటప్పుడు దాని షేరు విలువ పెరగటం సహజం. అయితే "క" అనే కంపెనీ స్టాకులను కొనేవారి కంటే అమ్మేవాళ్ళు 3-4 రెట్లు ఎక్కువమంది ఉన్నారు, అయినా దాని విలువ ఆ రోజంతా పెరుగుతూనేఉంది. అంతేకాదు "చ" కంటే "క" విలువ బాగా పెరిగింది ఆ రోజు. దీని బట్టి కంపెనీ షేర్ల విలువలు కొనటం/అమ్మటం మీద మాత్రమే ఆధారపడవని తెలుసుకున్నాను. మరింకా వేటిమీద ఆధారపడతాయనే ఇంకో పెద్ద ప్రశ్న మిగిలిపోయింది :(

సరే ఇంక ఇక్కడ చర్చించుకోదగ్గ ఇంకో విషయం ఏమిటంటే ప్రతి 5 నిమిషాలకొకసారి refresh బట్టన్ని నొక్కి షేరు విలువ ఎంత పెరిగిందో చూసుకోవటం మొదలు పెట్టాను. కూడలిని కూడా ఇన్నిసార్లు నేనెప్పుడూ refresh చేయలేదు!... ఇంకా ఏ షేర్లనూ కొనకుండానే ఇంతలా ప్రతీ ఐదు నిమిషాలకొక సారి చూస్తున్నానంటే మరి వందల సంఖ్యలో షేర్లను కొని అమ్మేవారి పరిస్తితి ఎలాగుంటుందో!... లేక కొత్తొక వింత, అన్నట్లు స్టాకు మార్కెట్టు క్లబ్బులో కొత్తగా జేరిన వాళ్లే ఇలాంటి విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారా?...

ఇదంతా అయిన తరువాత ఇంక పరిశీలించింది చాలనుకుని, ధైర్యం చేసి నా "బిగినర్స్ లక్కు"ను పరీక్షించుకుందామని అంతకుముందు తగ్గి ఇప్పుడు పెరుగుతున్న రెండు కంపెనీల షేర్లను తలా మూడు కొన్నాను... తీరా కొన్న ఐదు నిమిషాలలోనే షేరుకి ఐదు శాతం చప్పున వాటి విలువ పడిపోయింది... స్టాకు మార్కెట్టులో కనీసం "బిగినర్స్ లక్కు" కూడా పని చేయదని ఇంకో పాఠాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు వాటిని వదిలించుకుందామని ప్రతీ రెండు నిమిషాలకోసారి వాటి విలువలోని హెచ్చుతగ్గులను పరిశీలించటం మొదలు పెట్టాను...

11 comments:

  1. :) బాగుంది మీ బ్లాగాట!

    ReplyDelete
  2. Praveen,
    Somebody sent this story to me recently - might be of help to you :-)

    Once upon a time in a village, a man appeared and announced to the
    villagers that he would buy monkeys for Rs10.

    The villagers seeing that there were many monkeys around, went out to the
    forest and started catching them.

    The man bought thousands at Rs10 and as supply started to diminish, the
    villagers stopped their effort. He further announced that he would now
    buy at Rs20. This renewed the efforts of the villagers and they started
    catching monkeys again.

    Soon the supply diminished even further and people started going back to
    their farms. The offer rate increased to Rs25 and the supply of monkeys
    became so little that it was an effort to even see a monkey, let alone
    catch it!

    The man now announced that he would buy monkeys at Rs50! However, since
    he had to go to the city on some business, his assistant would now buy on
    behalf of him.

    In the absence of the man, the assistant told the villagers. Look at all
    these monkeys in the big cage that the man has collected. I will sell
    them to you at Rs35 and when the man returns from the city, you can sell
    it to him for Rs50."

    The villagers squeezed up with all their savings and bought all the
    monkeys.

    Then they never saw the man nor his assistant, only monkeys everywhere!!!

    Welcome to the "Stock" Market!!!!!

    ReplyDelete
  3. @ నాగరాజు గారు,
    స్టాకు మర్కెట్ లోని చాలా మంచి కథని మళ్లీ వినిపించినందుకు ధన్యవదాలు.

    @ ప్రదీప్ గారు,
    మీకు శాస్త్రీయబద్ధంగా స్టాకు వ్యాపారం చెయ్యాలంటే, దానిని ఒక పేకాటలా కాకుండా ఒక శాస్త్రంగా చూడాలి.
    దానికి మొదట మెట్టు ఒక పుస్తకం చదవడం.
    కోరమంగలా లోని ఫారంలోని లాండ్మార్కులోని, ఫైనాన్సు పుస్తకాలలో
    Investments by Bodie, Kane, Marcus, Mohanty అన్న పుస్తకం దొరుకుతుంది.
    వీలుంటే చదవగలరు.
    వెల 495రూ.
    ఇదే అమెరికాలో 5000రూ కంటే ఎక్కువ ఉండవచ్చు.
    మీరు అది చదివితే లాభాలు వస్తాయా అని నన్నడిగితే.. చెప్పలేం :)

    దాని తరువాత, అదే చోట Options Futures and Derivatives by John Hull దొరుకుతుంది. అందులో ఏం లేకుండా డబ్బులు ఎలా సంపాదించాలి అన్న విషయం వుంటుంది.
    ఇది చదివిన తరువాత మీ డబ్బు మొత్తాన్ని స్టాకుల్లో ఎలా పోగట్టుకోగలరో తెలుస్తుంది. :)

    ఒక సరళమైన పద్ధతేంటంటే, ఒక ఒందరకాల స్టాకులు (లేదా nifty 50) తలోటి కొనుక్కుంటే, ఒకటి తగ్గినా ఒకటి పెరిగుతుంది.

    Good luck.

    ReplyDelete
  4. రాకేశ్వరా మీకు లేని పరిజ్ఞానం లేదుకదా? మాయా పెట్టి(Futures & Options) తో ఎప్పుడైనా ఆటలు ఆడావా?

    ReplyDelete
  5. ప్రదీప్ గారు,
    మీరు ఇపుడు అనుభవిస్తున్న స్థితినే నేను 1987 ప్రాంతాలలో అనుభవించాను. ఇపుడైతే అంతర్జాలం ద్వారా అన్నీ తెలుస్తున్నాయి కాని, అపుడైతే బ్రోకర్ ఏం చెప్తే అదే వేదం.కొనాలన్నా,అమ్మాలన్నా ధరకి కొంత హద్దు చెప్పి ఆ అంతరంలో వ్యాపారం చేయమనేవారం. ఆ హద్దుల మధ్య వాడెంత ధర ఖాయం చేసినా మేము నమ్మాల్సిందే.
    ఆ పిచ్చలో పడి కనిపించిన పుస్తకమల్లా కొనేవాడిని. చిట్కాల కోసం పత్రికలన్నీ తడిమేసేవాడిని. బ్రోకర్ దగ్గర నుంచి ఊరికి కదిలేది రాత్రి 11 తర్వాతే.
    చివరికి హర్షద్ మెహతా టైం లో చేతులు బాగా కాలాక శాంతించాను. ఆ మంట చాలా ఏళ్ళ పాటు ఉండేది. ఈ మధ్యనే మళ్ళి షేరు సంత లోకి మళ్ళీ ప్రవేశం చేసాను ఈసారి ఏమవుతుందో?

    ReplyDelete
  6. నాలాంటి కొత్త వారికి స్టాకు మార్కెట్టులో అడుగు పెట్టటానికి అది సరయిన టైము కాదనుకుంటా... ఇవాళయితే ఏ స్టాకు చూసినా భారీగా పాయింట్లను పోగొట్టుకున్నాయి. నిన్నా మొన్నా కూడా తగ్గాయి, గాని ఇవాళ తగ్గినంత తగ్గలేదు...

    ReplyDelete
  7. స్టాకుల మీద నాగరాజు గారి కున్న అభిప్రాయమే నాదీనూ!కాకపోతే కథలో చెప్పినట్టు కోతులు కొనబోయి మనం కోతులు కాకుంటే సరి!

    ReplyDelete
  8. డబ్బు సంపాదించడానికి ఏకైక మార్గం స్టాకుల్లోనూ, ఆప్షంస్ లోనూ, ఫారెక్స్ లోనూ పెట్టక పోవడం :-)

    -- విహారి

    ReplyDelete
  9. hi ra pradeep,
    neeku share market lo chudadaniki time untunda, vallu iche dabbu saripovadam leda, leka inka sapadinchalani asha na.

    ReplyDelete
  10. హయ్ దయా, చాలా రోజుల తరువాత వచ్చావ్ నా బ్లాగుకి... పెద్దగా టైము ఉండటం లేదు పొద్దున్న 10 నుండి మధ్యాహ్నం 3:30 వరకూ మాత్రమే దొరుకుతుంది :( డబ్బు సంపాదించాలని కాదుగానీ పెరగటాలూ తగ్గటాలూ చాలా differentగా ఉంటుంది. నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను కాబట్టి ఎక్కువగా పెట్టుబడి పెట్టటం లేదు.

    ReplyDelete
  11. నూతన సంవస్తర శుభాకాంక్షలు

    ReplyDelete