Sunday, November 25, 2007

ఆరుకాళ్ళ సాలీడు

Spider Hanging
అసలు పరిమాణం
కొన్ని రోజుల క్రితం ఒక ఆదివారం రోజు నిద్ర లేస్తూనే ఇలా వేలాడుతూ కనిపించింది. అంత పెద్ద సాలీడును నేను ఇంతవరకూ చూడలేదు. పైగా చాలా సేపు కదలకుండా అలాగే వేలాడుతూ ఉంది. వెంటనే కెమరాతీసి ఒక క్లిక్కు క్లిక్కాను. ఫ్లాష్ వెలుతురుకి బయపడింది కావచ్చు, వెంటానే కిందకు జారి...

'Six' legged spider
అసలు పరిమాణం
ఇలా ఒక తలుపు సందులోకి వెళ్ళి దాక్కుంది, ఈ సారి మెళ్ళగా తలుపును తెరచి దగ్గరి నుండి ఇంకో ఫొటో తీసాను, ఈ సారి ఇంకా తొందరగా ఎక్కడికో వెళ్ళి మాయమైపోయింది.

బొమ్మలను కంప్యూటరులో ఎక్కించిన తరువాత, దీనికి ఒక పక్కన నాలుగు కాళ్ళకు బదులుగా రెండే ఉన్నాయని గమనించాను. అందుకే గావచ్చు ఎక్కడో under groundలో ఉండాల్సింది ఇలా బయటకు వచ్చింది!!!

7 comments:

  1. "నేనే స్పైడర్ మాన్" అంటూ జబ్బలు చరిచే మా హాసుకు చూపించాలి నిజం స్పైడీ ఎలా ఉంటాడో?

    ReplyDelete
  2. ఆ కాలును నువ్వో మీ రూములో ఉండే వాళ్ళో తొక్కేసి తుంచేసి ఉంటారు. లేదా...ఆ తెగిపోయిన కాలు మీ సాంబారులో వచ్చుంటుంది ;)

    యాక్..థూ..కదూ. ఒక సారి హాస్టల్లో ఇదే సైజుకు కొంచెం తక్కు సాలీడు సాంబారులో వచ్చింది. అప్పుడు చూడాలి క్యాంటీన్లో గోల.

    ఇంతకూ ఏ కేమెరా ఉపయోగించావు?

    ReplyDelete
  3. @రాకేశ్వర రావు,
    ప్రతీదాంట్లో ఎంతో కొంత అందం ఉంటుందండీ. అసలు మీరు దీని అందాన్ని వర్ణిస్తూ ఒక పద్యం రాయాలి, కానీ ఇలా yikes అంటే ఎలా, ..

    @స్మైల్,
    ఇలాంటి స్పైడీతో కుట్టించుకునే పీటర్-పార్‌కర్ కాస్తా స్పైడర్-మాన్‌గా మారిపోతాడు.

    @నవీన్ గార్ల,
    నేను ఎప్పుడూ ఉపయోగించే sony DSC P200 కెమరేనే ఉపయోగించాను. దాని కాళ్లను మేమే తొక్కేసుండొచ్చు, కానీ మా సాంబారులో రాలేదని కచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే మేము మా రూములో ఇప్పటిదాకా సాంబారును తయారుచేసుకోలేదు :). ఆ రోజు అలా ఫొటో దిగిన తరువాత ఇప్పటివరకూ మళ్లీ కనిపించలేదు...

    ReplyDelete
  4. ఇదిగో మీ సాలీడుకో కందం!
    కం. చక్కగనుందీ సాలీ
    డక్కడ చిక్కగ తమరికి టక్కున కేమ్రా
    క్లిక్కితిరి గాని, అక్కట!
    యక్కని పించెను నవీను కౌరా! సుమతీ!

    ReplyDelete
  5. @రాకేశ్వర రావు,
    అడిగిన వెంటనే ఇలా ఒక పద్యం రాసేశావుగా... దానికి సమాధానంగా ఏం చెప్పాలో కూడా అర్ధం కావటం లేదు!!

    ReplyDelete
  6. మురిసిపోకండి, రాకేశ్వర పద్యంలో కూడా "యక్క"నే అన్నాడు!

    ReplyDelete