జింప్ మరియు ఇంక్‌స్కేప్ ఈ రెండూ వేర్వేరు అవసరాలకు ఉపయోగించగలిగే సాఫ్టువేర్లు. రెండిటినీ ఉపయోగించి బొమ్మలపై చిన్న చిన్న మార్పులు-చేర్పులు చేసుకోవచ్చు. రెండు సాఫ్టువేర్లు అంతర్గతంగా rendering కొరకు GTKను ఉపయోగిస్తాయి. కాబట్టి GTKలో యూనీకోడ్ తెలుగు rendering ఉంటే రెండిటిలోనూ, మనకు తెలుగు కనిపిస్తుంది.
ఇంక్‌స్కేప్ ఒక వెక్టారు గ్రాపిక్సు పరికరం. అంటే గీతలతో తయారు చేయగలిగే బొమ్మలకు ఎక్కువగా ఉపయోగపడుతుందన మాట. గీతలతో తయారు చేయగలిగే బొమ్మలంటే మ్యాపులను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. 3డ్ బొమ్మల తయారీలో తయారు చేసే వైర్‌ఫ్రేములు(wireframes) కూడా ఇంక్‌స్కేప్‌లోతయారు చేయవచ్చు. వెక్టారు గ్రాపిక్సుకు XML ప్రామాణికమయిన SVGని చాలా వరకు support చేస్తుంది. ఇంక్‌స్కేప్‌లో మామూలు పొటోలపై కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కానీ అలాంటి పనులకు జింప్‌ను వాడటం ఉత్తమం. ఇంక్‌స్కేప్‌లో మీరు వెక్టారు బొమ్మలను తయారు చేసి వాటిని SVGలో బద్రపరచుకూవచ్చు కూడా.
జింప్‌తో మనం ఫొటోలపై మార్పులు చేర్పులు చేయవచ్చు. ఉదాహరణకు, నలుపు-తెలుపు ఫొటోలను రంగుల ఫొటోలుగా మార్చుకోవడం, మరకలుపడి పాడయిన ఫొటోలపై మరకలను తొలగించి బాగుచేయటం లాంతివి చేయొచ్చు. అవే కాకుండా నేను చిరంజీవితో కరచాలనం చేస్తూ ఫొటో దిగినట్లు లేకపోతే ఇల్లియానా నేను కలిసి గోవా బీచిలలో డ్యాన్సు వేస్తునట్లు ఫొటోలను తయారుచేసుకోవచ్చనమాట (ఇలాంటివి నిజజీవితంలో జరగవు కాబట్టి ఇలాంటి శునకానందాలు వస్తుంటాయి అప్పుడప్పుడు).
జింప్ మరియు ఇంక్‌స్కేప్ రెండూ ఉచితంగా లభించే సాఫ్టువేర్లు. Adobe వారి Photoshop(ఫొటోల కోసం) మరియు Illustrator(గీతల కోసం)లు కూడ ఇలాంటి అవసరాల కోసమే ఉపయోగిస్తారు. కానీ వాటిని కొనుక్కుని వాడాలి కాబట్టి జింప్ మరియు ఇంక్‌స్కేప్‌ల కంటే బాగాపనిచేస్తాయని అనిపించవచ్చు.
ఎప్పుడో నెల రోజుల క్రితం రాసి మధ్యలో ఆపేసిన పోస్టు ఇది, ఏదో మారథాను కాదా అని బూజు దులిపి, కొంచెం బాగు చేసి, పది లైన్లు ఉన్నాయో లేదో చూసి పోస్టు చేస్తున్నాను.
Monday, July 16, 2007
Subscribe to:
Post Comments (Atom)
మారథాను మొదలయిందన్నమాట
ReplyDeleteనేను కూడా లెక్కేసుకుంటాను ఈ రోజునుండి తొమ్మిది రోజులు
చూద్దాం ఎవరు గెలుస్తారో!
ఈ నెల ఇరవై ఐదున మనము లెక్కేద్దాం
మారథాను ప్రారంబించిన సంధర్భంలో శుభాకాంక్షలు.
ReplyDeleteఇక నేను వచ్చిన పనేమిటంటే, మీరిచ్చిన జాలము లింకులో image http://dir.jalleda.comdirlogo.png అని ఉంది, అందుకే మీ బ్లాగులో అది కనిపించటంలేదు. దాన్ని http://dir.jalleda.com/dirlogo.png గా మారిస్తే ఆ బొమ్మ కనిపిస్తుంది.
@జాలయ్యగారు, సరిచేసేసాను. అయ్యితే తప్పు నాది కాదు, మీరు నాకు పంపించిన మెయిలో అలాగే ఉంది మరి :)
ReplyDeleteహు...
ReplyDeleteఎంత నేర్చుకుందామనుకున్నా ఈ బొమ్మలు, గీతల సాఫ్ట్‌వేర్లు ఓ పట్టాన నాకు అంతు చిక్కట్లేదు.
క్రియేటివిటీ అంత కన్నా లేదు. ఏం చేస్తాం ?? ప్చ్...
అవునండీ, తప్పుమాదే. కొన్ని రోజుల క్రితం మీ పేజి చూసి, మాకోడు మార్చడం జరిగినది. అయితే, మీకు తెలియజేయుటలో కొంచం జాప్యం జరిగినది.
ReplyDeleteధన్యవాదములు.