Friday, July 06, 2007

Alt+Shift+s

ఏమిటో ఈ మధ్య Alt+Shift+s కీ కాంబినేషను చాలా విరివిగా ఉపయోగించేస్తున్నాను. అవే కాదండీ, Alt+Shift+p కూడా. ఎవరికయినా మెయిలు పంపాలని అనుకుంటే, మెయిలులో సందేశాన్ని మొత్తం టైపు చేసేసి వెంటనే దానిని పంపించటానికి Alt+Shift+s, అని ఓ నొక్కు నొక్కుతున్నాను. నొక్కిన తరువాత నేను నొక్కాల్సిన చోట కాకుండా ఇంకో చోట నొక్కుతున్నానని ప్రతీ సారీ నాలికర్చుకోవలసి వస్తుంది. అలాగే పంపించే ముందు ప్రీవ్యూ చూడాలని అనుకున్నప్పుడు పని చేయదని తెలిసి కూడా, Alt+Shift+p అని నొక్కేస్తున్నాను.

అరె ఇప్పుడు కూడా ఈ పోస్టుని పంపీయడానికి Alt+Shift+s అని నొక్కేస్తున్నాను, హతోస్మీ!!!...

2 comments:

  1. మీ బ్లాగ్ చాలా బావుంది. నాకు తెలుగు లో బ్లోగ్ మొదలు పెడదామని ఉంది. తెలుగు లో వ్రాయడానికి www.quillpad.in/telugu కన్నా మంచి సాఫ్ట్‌వేర్ ఉంటే చెప్ప్పండి. అంటే ఇది చాలా బావుంది కానీ మీరు చాలా రోజుల నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా.

    ReplyDelete
  2. రాకేష్ గారు,
    నా బ్లాగు మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.

    మొదటగా ఈ-తెలుగు సహాయ కేంద్రాన్ని చూడండి.

    తెలుగులో బ్లాగు మొదలు పెట్టటానికి ఈ వ్యాసాన్ని చూడండి.

    ReplyDelete