ఎప్పటిలాగానే శనివారం ఆఫీసులేదని కొంచెం ముందే నిద్రలేచాను :) ఏంచేయాలో తోచక వికీపీడియాలో వ్యాసాలను కెలుకుతూ కూర్చున్నాను. రవీ వస్తాననడం గుర్తొచ్చి, రమ్మని ఫోను చేసాను. ఇంకో అరగంట తరువాత ఎప్పుడూ సైలెంటు మోడులో ఉండే నా సెల్లులోని మిస్సుడు కాల్సు చూస్తే నవీన్ దగ్గర నుండి ఒక కాల్ వచ్చిందని ఉంది. ఫోన్‌చేస్తే నవీన్, ప్రవీణ్ ఇద్దరూ సమావేశమై అప్పుడే గంటయ్యిందని చెప్పాడు. రవీ వచ్చేవరకూ ఆగి అతనిని కూడా అటు పట్టుకెళ్ళాను.
వెళ్ళిన వెంటనే ఒక ప్లేటులో కాజూబర్ఫీ, ఇంకో ప్లేటులో హాటు వచ్చేసాయి మాదగ్గరకి. ఇంకొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నా తరువాత ప్రవీణ్, నవీన్ తయారు చేద్దామనుకుంటున్న తెలుగు సహాయక వీడియోలు ఎలా తయారు చేద్దామనుకుంటున్నదీ చెప్పి, వాళ్ళు అప్పటికే తయారు చేసిన, ఒక చిన్న వీడియోను చూపెట్టారు. చాలా బాగా వచ్చింది ఆ వీడియో. ఆ తరువాత గంటా, రెండు గంటలు ఏవేవో చర్చించాము, వాటిలో ముఖ్యమైనవి ఇవి:
- ఇంటర్నెట్టులో తెలుగును బాగా వ్యాప్తి చేయటానికి పనికి వస్తాయనుకునే ఆలోచనలను అన్నీ ఒకేచోట ఎప్పటికప్పుడు చేర్చడం. ఈ-తెలుగు సంఘాన్ని, ఏర్పాటు చేసిందే అందుకు కదా మరి. ఇదేకాదు తెలుగు ప్రచారానికి అవసరమైన వ్యాసాలను కూడా తయారు చేసి, వాటన్నిటినీ కూడా ఒకే చోట పదిలపరిస్తే బాగుంటుందని అనుకున్నాము.
- కంప్యూటరులో తెలుగును స్థాపించటానికి సహాయపడే వీడియోలను మరిన్ని తయారు చేయటం. ఒక పేజీడు సూచనలకన్నా 2 నిమిషాల వీడియో చూస్తే ఇంకా తొందరగా బాగా తెలుసుకోవచ్చు కదా మరి.
- తెవికీకి ఒక Recruitment Bulletinని మొదలు పెడితే ఎలా ఉంటుందో అనే కూడా ఒక ముఖ్యమైన విషయం. రాశిలో తెవికీ భారతీయ వికీలన్నిటికన్నా ముందుంది అనేది అందరికీ తెలిసిందే. వాశిలో మాత్రం మనం కన్నడ, తమిళ భాషలు మనకు చాలా పోటీని ఇస్తున్నాయి, అవి మనకంటే ముందు కూడా ఉండి ఉండవచ్చు. అయితే తెవికీని వాశిలో కూడా ముందుంచే చిన్న ఆలోచన ఇది. తెవికీలో ప్రస్తుతం బోలెడన్ని వ్యాసాలు మెరుగుపరచటానికి ఎదురుచూస్తున్నాయి. ఎవరెవరికి ఏ ఏ రంగాలలో ప్రవేశముందో లేదా ఇష్టముందో తెలుసుకుని వారిని తెవికీలో ఆయా వ్యాసాలను మెరుగుపరచటానికి ప్రోత్సహించటం ఈ Bulletin యొక్క ముఖ్యోద్దేశం.
- తెవికీలో అనువాదాలకు వ్యాసాలను ఆంగ్లవికీ నుండే కాకుండా ఇతర భారతీయ భాషలనుండి కూడా తేగలిగితే ఎలాఉంటుందో అని కొంచెం సేపు చర్చించాము. ఉదాహరణకు తెవికీలో ఉన్న ఈ పేజీని చూడండి, దీనిని కన్నడ వికీ నుండి అనువదిస్తున్నారు.
- తెవికీకో ఉన్న అన్ని సహాయ పేజీలకు WP:5MINలా ఉండే సంక్షిప్త పేర్లతో దారిమార్పు(redirect) పేజీలను సృష్టించాలి అనికూడా అనుకున్నాము. దీనివలన మన గుంపులలో ఎప్పుడయినా ఆ పేజీలకు లింకులను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సంక్షిప్త చిరునామాలయితే సులువుగా ఉంటుండి.
- మాటల మధ్యలో తెవికీలో RTS-తెలుగు Transliteratorని ఇంకోంచెం వేగంగా పనిచేయించటానికి ప్రయత్నించాలని అభిప్రాయపడ్డాము.
- పేరుకి బ్లాగరుల సమావేశం అనే మనం పిలుస్తున్నా కానీ, ప్రతీ సారీ బ్లాగరులు మరియు వికీపీడియనులు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అందుకని ఈ సమావేశాలకు "ఈ-తెలుగు సమావేశం" అనే పేరే సరయినదని కూడా కొంచెం సేపు చర్చించుకున్నాం.
అప్పటికి మధ్యాహ్నం 2:30 అయ్యింది. మొదటి సమావేశంలో అనుకునట్లు MTRలో తినలేక పోయినా, అంతకంటే ఎన్నోరెట్లు రుచికరమైన విందు భాజనం చేసాము. అందునా ఆ విందులో వడ్డించిన వంకాయ కూర అదుర్స్. కాబట్టి ఇంక వారం వారం సమావేశాలు జరగాలని కోరుకుంటున్నాను. భోజనం ముగించిన తరువాత కొంచెం సేపు లినక్సు గురించీ ఉబుంటూ ఉచిత CDల గురించి మాట్లాడుకున్నాము. ఆ తరువాత జరిగిన సన్నివేశాలన్నీ మీరు ప్రవీణు రాసిన పోస్టులో ఇప్పటికే చదివేసి ఉంటారు.
నలుగురమూ కలిసినందుకు గుర్తుగా(రుజువుగా) చివరిలో ఈ ఫొటో తీసుకున్నాము. ఫొటోలో ఎడమ నుండి కుడి వైపుకు, నేను, ప్రవీణ్, తెవికీ, నవీన్, రవీ నుంచున్నాము.
బెంగుళూరు వారు బానే ముందుకు ఉరుకుతున్నారు. మంచి ఆలోచనలు, పనులు చేస్తున్నారు. శుభాకాంక్షలు!
ReplyDeleteమీ సమావేశాలని "బెంగుళూరు e-తెలుగు సమావేశాలు" అనండి.
ప్రదీప్..సమావేశం వివరాలన్నీ చాలా బాగా వ్రాశావు. ముఖ్యంగా అవసరమైన చోట లింకువివ్వడం బాగా నచ్చింది. ఒక్క 5 నిముషాలు ఆలస్యం ఐనా..అందరూ ఓపికగా ఇలా లింకులిచ్చుకుంటే బాగుంటుంది.
ReplyDeleteవారం నుంచి ఓఠ్ఠి ఇడ్లీలు, పెరుగన్నం తిని నాలిక చవి చచ్చిపోయిందా....మళ్ళీ ఇంటి భోజనం రుచి చూసేసరికి...ఆహా..జీవాత్ముడు..అనందలోకాల్లో విహరించాడు.
nAku telupaka pOvaDam anyAyam....
ReplyDeleteచాలా బాగా రాశారు...
ReplyDeleteవచ్చే సారి కూడా మీరే ;)
లేటుగా రాసినా లేటెస్టుగా రాశారు.
అనిల్ గారూ లాస్ట్ మినట్ ప్లానింగ్ అండీ కనక కుదరలేదు. అయినా దాంతో పనేముంది మీరు ఏ వీకెండ్ ఖాళీయో చెప్పండి. ఇంకో బెబ్లాస రడీ :)
ప్రదీపు గారూ, బాగా రాశారు. మొత్తమ్మీద మీ ఆలోచనలు, ఆచరణా బాగున్నాయి. చాలా సార్లు సమన్వయము లేకపోవటం వలన మనం ఒకే పనిని చాలా మంది చేయటమో, మళ్లీ మళ్లీ చేస్తున్నామేమో అని అనిపించింది. (ఇది తెలుగు ప్రయత్నాలన్నిటికీ వర్తిస్తుంది). చర్చలను ఆలోచనలనూ ప్రతిచోట పరచకుండా ఒక చోట కేంద్రీకరించటమనేది చాలా ముఖ్యం. ఈ-తెలుగు పై చర్చావేదిక ఎందుకో నాకు రిడండంట్ గా అనిపించింది.
ReplyDeleteనేను వీవెన్ గారి పొద్దులోని ఈ-తెలుగు పరిచయ వ్యాసంలో కూడా ఇలాంటి సూచనే చేశాను. మనం ఇంటర్నెట్టులో తెలుగుకై జరుగుతున్న ప్రయత్నాలన్నింటిలో పాల్గొనకపోయినా కనీసం సమన్వయ వేదికలాగా పనిచేయాలని.
వికిలో చిన్న లింకుల ఆలోచనా, వివిధ వికీపీడియన్ల అభురిచి ప్రకారం ఇది వరకు ఆంగ్ల వికీలో ఉన్న క్లీనప్ డెస్క్ లాంటి ఆలోచన, సహాయం వీడియోల ఆలొచన చాలా బాగున్నాయి..ఆచరణీయమైనవి.
అంతా వివరంగా అర్థం అయ్యింది కాని టపా శీర్షిక పేరే అర్థం కాలేదు.బెబ్లాస అంటే ఏమిటి --మాటలబాబు
ReplyDeleteబెబ్లాస అంటే,బెంగుళూరు బ్లాగరుల సమావేశం...హా హా నాకర్ధమయ్యింది.
ReplyDelete@వీవెన్, నవీన్
ReplyDeleteధన్యవాదాలు...
@అనీల్
ఈసారి మీరే సమావేశ తేదీ, స్థలాని నిర్ణయించి అందరినీ పిలవండి :)
@ప్రవీణ్
అంతకంటేనా, కాకపోతే నేను నెలకొక్క టపానే రాద్దామని అనుకున్నాను, అలాంటప్పుడు, ఇక్కడన్నీ బెబ్లాసా టపాలే ఉంటాయేమో...
@రవి
అలోచనైలయితే వచ్చాయి కానే, వాటన్నిటినీ ఆచరణలో ఎలాపెట్టాలో ఇంకా నిర్ణయించలేదు, మెల్లిగా ఒక ప్రణాళిక తయారు చేద్దాము.
@మాటలబాబు, క్రాంతి
అవును బెబ్లాసా అంటే "బెంగుళూరు బ్లాగర్ల సమావేశం", అలాగే హైబ్లాస - "హైదరాబాదు బ్లాగర్ల సమావేశం", అబ్లాస - "అమెరికా బ్లాగర్ల సమావేశం". సంక్షిప్త నామాలు వాడడం లేటెస్టు ట్రెండు కదా మరి.
అనీల్ ..అసలు నేను ప్రవీణ్ ఇంటికి నా Laptop లో ThunderBird Install చేసుకోవడానికెళ్ళా. మాటల సందర్భంలో ప్రదీప్ ఇల్లు పక్క సందులోనే అని తెలియడంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొన్నాము...అసలు..ఇది మినీ బెబ్లాస లాంటిది అనుకోండి. ఈ సారి స్థలం, సమయం మీరు నిర్ణయించండి అందరం ఇంకోసారి కలుద్దాం దానికోసం ఇంకో నెలదాకా ఆగనౌసరం లేదు:)
ReplyDeleteఈ సారి బెంగుళూరు వస్తే, తిండి కష్టాలు ఉండవన్న మాట! మీ తెవికీ కృషికి వందనాలు!!
ReplyDeleteHeello mate great blog post
ReplyDelete