Wednesday, March 29, 2006

ఇంకా ఎన్ని రోజులు

ఒక వారం రోజుల నుండి ఈనాడు పేపరు అసలు చదువుతునట్లే లేదు. ఎందుకంటారా అక్కడ శ్రీదర్ గారి కార్టూన్లు రావటం లేదు మరి. ప్రతీ రోజు ఐదారు సార్లు ఆ పేజీ తెరిచి చూస్తున్నాను శ్రీదర్ గారి కార్టూను ఉంటుందేమోనని. కానీ ప్రతీ సారీ నన్ను నిరాశపరుస్తూ అక్కడ ఎటువంటి కార్టూనూ కనపడటంలేదు. అందరూ నెట్‌లోనే చదివేస్తూ, అసలు పేపరుని ఎవరూ కొనడం లేదేమోనని, ఇంటర్‌నెట్ ఎడిషన్‌లో కార్టూన్లను తొలగించేసారేమోనని మొదట అనుకున్నాను. అందుకని మొన్న బెంగలూరు వెళ్ళినప్పుడు అక్కడ ఈనాడు పేపరు కొన్నాను. ఉహూ అందులో కూడా శ్రీదర్ గారి కార్టూన్లు ఇవ్వలేదు.

అసలు సగం మంది తెలుగువారు ఈనాడు పేపరుని శ్రీదర్‌గారి కార్టూన్ల కోసమే కొంటారంటే అతిశయోక్తి కాదేమో. అట్లాంటి సగం మందిలో నేనూ ఒక్కడిని. మొటమొదట శ్రీదర్ గారి కార్టూన్ని చదవందే వేరే వార్తలు చదవాలని అనిపించదు. మరి అట్లాంటి కార్టూన్లకు మంమల్ని బానిసలుగా చేసి ఇలా చెప్పాపెట్టకుండా ఆపేయడం (తాత్కాలికంగానయినా సరే) ఏమయినా భావ్యమా. ప్రస్తుతానికయితే ఈనాడు అర్చీవ్స్‌లో ఉండే పాత కార్టూన్లను మళ్ళీ మళ్ళీ చదివి కాలం గడుపుతున్నాను.

శ్రీదర్ గారు మీరు ఏమి చేస్తున్నాగానీ వెంటనే మళ్ళీ తమ బ్రషులను పట్టుకొని చకచకా కార్టూన్లు గీయాలని నా మనవి. మీ కార్టూన్ల కోసం నాలాంటి వీరాభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment