ఇవాళ బెంగళూరులో ఏదో పనిబడి అక్కడి బస్సులో ప్రయానిస్తున్నాను. అటూ ఇటూ తిరగవలసిన పని కాబట్టి ఒక రోజు పాసు(Rs.25) తీసుకున్నాను. ఆ బస్సుకు వేరేగా కండక్టరు లేడు. డ్రయివరే కండక్టరుగా వ్యవహరించి టికెట్లు జారీ చేస్తున్నాడు. చాలా మంది ఉండటం వలన నేను ఇచ్చిన 100 రూపాయిలకు చిల్లర తరువాత ఇస్తానని చెప్పాడు. నేను సరేనని ఎట్లాగూ ఆ బస్సు చివరి స్టాపు వరకు వెళ్ళాలి కాబట్టి దిగేముందు తీసుకోవచ్చు కదా అని అనుకున్నాను.
స్టాపు వచ్చింది. నేను డ్రయివరుగారి దగ్గరకు వెళ్ళి నాకు రావలసిన Rs.75 గురించి అడిగాను. నా చేతిలో 5/- పెట్టి "ఎస్టు కొటిదవు" అని ఏదో అడిగాడు. బహుషా ఎక్కడ ఎక్కానో అరాతీస్తున్నాడేమో, రెండు మూడు సార్లు అడిగినా తరువాత అతనికి నేను ఎంత ఇచ్చాను అనేది అరాతీస్తున్నాడేమో అని సందేహం వచ్చి 100 అని చెప్పాను. తరువాత నాటికెట్టు తీసుకుని దానిని పరిశీలించి ఇంకో 5/- నా చేతిలో పెట్టాడు. టికెట్టును మరల ఇంకో సారి పరిశీలించి నాచేతిలో ఉన్నా 5+5=10/- తీసుకుని 80 రూపాయిలు నాచేతిలో పెట్టాడు.
75/- ఇవ్వాల్సిన చేట 80 ఎందు కిచ్చాడా అని ఆలోచిస్తుంటే, బస్సు మళ్ళీ నిండటం మెదలు పెట్టింది, నేను దిగిపోయాను. అందుకనే ప్రతీ బస్సులో కండక్టరు వేరేగా ఉంటే బగుంటుంది, ఇదిగో ఇలా ఎక్కువ డబ్బు ఎచ్చేవాడు కాదుగదా అని నేను ఆలో చిస్తుంటే అప్పుడు నాకు తట్టింది. నా టిక్కెట్టు ఆ డ్రయివరు దగ్గరే ఉంది అని. బస్సేమో వెళ్ళిపోయింది. ఒకరోజు పాసు కాబట్టి దానిని మళ్ళీ ఇంకోళ్ళకు అమ్ముకోవచ్చు.
ఇంతకీ ఇక్కడ బకరా ఎవరు, మళ్ళీ టికెట్టు కొనుకున్న నేనా, ఎక్కువ డబ్బు ఇచ్చిన డ్రయివరా, లేక ఇద్దరమూనా.
Today when I started my journey in Bangalore, I bought a day pass worth Rs.25. The bus does not have a conductor. Driver is also issuing the tickets. He told me that he will be giving the change for the 100 I have given to him, when I get down. As my destination is the last stop of this bus, I did not bother much about it.
The stop has come. Asked the driver about my 75/-. He put a 5/- in my hand and asked "esTu koTidavu"(kannaDa). I thought he is asking me about where I got into the bus. He aske the same question for two more times. Then, I guessed that he was asking how much I have paid him innitially. He took my ticket and observed it and put another 5/- in my hand. Immidiately he observed the ticket once again and then replaced the 5+5=10/- with 80/-.
But why did he give me 80/- instead of 75/-. As the bus started to fill up, I got down from the bus. I started thinking, about why he gave me 80/-. May be because he got confuseddoing the double duties. But wait, where is my ticket. It is still there with the driver, he has not returned to me back after his observation. And there is a possibility that he can still sell that ticket to some other person as it is a day pass.
So, who is the "bakara" here. Me, because I had to buy another ticket; the driver, who has returned me excess fare; or is it both of us.
Monday, March 27, 2006
Subscribe to:
Post Comments (Atom)
ఇక్కడ మీరే బకరా. మీరు మరల డైలీ పాస్ కోసం 75/- రూపాయలు ఖర్చు పెట్టాలి. మీకు మొత్తం రోజు ఖర్చు రూ 95/- మీకు కలిగిన నష్టం రూ 20/-
ReplyDelete