నిన్న రాత్రి 12:00కి లాబ్ నుండి బయటపడి down co-ops అనబడే ఒక బేకరీకి వెళ్ళి ఒక జ్యూస్ చెప్పాము. అప్పుడే బాగా దిట్టంగా పెరిగిన ఈ మఱ్ఱిచెట్టును చూసాము. దాన్నిని చూసిన తరువాత ఎందుకనో నేను చిన్నపుడు చేసిన ఒక ఘనకార్యం గుర్తుకు వచ్చింది.
అప్పట్లో మేము విశాఖపటణంలోని NAD కొత్తరోడ్డు దగ్గర ఉండేవాళ్ళము. నేనేమో అక్కడికి దగ్గరలో ఉండే సెంట్. ఆన్స్ హై స్కూలులో చదివే వాడిని. అయితే ఆ స్కూలు పక్కనే ఒక స్మశానం ఉండేది. నా క్లాసు రూములో నేను కూర్చునే బెంచీ నుండి ఆ స్మశానం చాలా బాగా కనిపించేదన్న మాట. అడపాదడపా అక్కడకు శవాలను తీసుకు రావటం కూడా చూసాను. అక్కడే చని పోయిన గేదెలు, బర్రెల చర్మాలను వలిచి వాటిని పాతి పెట్టేసే వారు. ఇవ్వన్నీ చూసినప్పుడు నాకు పెద్దగా భయం వేయలేదు. నాకు అప్పటి వరకూ శవాల గురించి, ప్రేతాత్మల గురించి ఎవరూ నూరి పోయనందుకు గావచ్చు. అయితే ఒక రోజు ఆ స్మశానం చుట్టూ తిరిగి అవతలికి వెళ్ళ వలసి వచ్చింది. ఆ స్మశానం పక్కనే ఒక ఆటస్థలం ఉంది గావచ్చు, చాలా సేపు నడవాలి, బాగా చీకటి పడి పోయింది. అంత సేపు ఎవడు నడుస్తాడని ఆ స్మశానంలో నుండి వెళ్ళటానికి నిస్చయించుకున్నాను (అప్పట్లో ఆ స్మశానానికి గేట్లు లేవు మరి). పెద్దగా ఆలోచించకుండా ఆ స్మశానం నుండే వెళ్ళి ఒక పావుగంట నడకను కాపాడుకున్నాను.
అదే ఇప్పుడు, పట్టపగలు వెళ్ళమన్నా కూడా ఆలోచిస్తానేమో. అప్పుడు మరి నాకు దెయ్యాలగురించి ఎవరూ చెప్పలేదు కాబట్టి స్మశానంలో ఉన్న అడ్డ దారికి బయట ఉన్న దారికి పెద్దగా తేడా కనిపించలేదు. రెండూ దారులుగానే కనిపించాయి.
అంటే కొత్త విషయాలు తెలిసేకొద్దీ మనము చేయగలిగే పనుల మీద కూడా అపనమ్మకం తలెత్తుతుందంటారా? కాదేమో ఇక్కడ మనలో రెండు భావనలు ఉంటాయి, ఒకటేమో స్మశానంలో దెయ్యాలున్నాయి అనేదానిని నమ్మమంటుంది, ఇంకోటేమో అదంతా ఉత్తదే అక్కడ దెయాలేమీ ఉండవు, మహా అయితే పాములుంటాయేమో అని చెబుతుంది. ఈ రెండు భావనల సంఘర్షణలలో మొదటిది గెలిచినప్పుడు స్మశానం అంటే మనకు భయం వేస్తుంది, అదే రెండోది గెలిచినప్పుడు...(ఇది గెలవటం కొంచెం కష్టం).
అక్కడ అలా ఆ చెట్టును చూసిన ప్రతీ సారీ నాకు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు నేను చిన్నప్పుడు తెలియక చేసినదానిని తెలిసి చేయగలన మరి?... ఏమో!!, అయినా అంత సమయం ఎవరికుందీ...
In English: Yesterday after completing the work in lab at night 12:00 we went to our regular visit, down co-ops, and ordered a juice. Then I have come across this fully grown baniyan tree, which always made me remember about the adventure I have done in my childhood.
In those days we used to live near NAD kottaroad in Vishakapatnam. I used to study in St. Anns High School. Behind this school there was a graveyard, and the deseased were buried there ocasionally. The place where I sit in my classroom has a very excellent view of the graveyard. I have seen many dead bodies brought there and then burried. Sometimes the skins of dead buffaloes are peeled off, which were later burried in a big pit at a corner of the graveyard. I did not feel any kind of fear at that age. May be, I was not told, that the dead may become ghosts, till that time. One night due to some reasons I have to walk around the graveyard, suddenly I felt like, why not take a shortcut through the graveyard, instead of walking all around it. So, proceeded with that idea and crossed the graveyard and saved 15 minutes.
But, can I do this now. May be I will think twice to cross alone even in daylight. As I was not induced with any fear at that time of my childhood, I did not felt any difference in those paths.
Can we conclude, that knowing new things, reduce our confidence... I think not... Here it might be thought of as a war between two ideas, one idea saying that there are ghosts in the graveyard and the other saying that a graveyard is like any other place and the ghost thing is trash. The idea that wins will be controlling our mind. Most often the first idea wins beyond the logic...
Everytime I see this tree I get all these wierd feelings. Can I still do what I have done in my childhood?... who knows!!, anyway who is having that much of time to do all those crap...
Wednesday, March 15, 2006
Subscribe to:
Post Comments (Atom)
Comments I got for this post in my previous blog...
ReplyDelete--------------------------
Nice Perception abt my favourite tree in the campus, shall we try to go to some nearby graveyard at night time?,
అని Sumit panwarగారు చెప్పారు | 3/15/2006 07:34:00 PM
Are you always carrying your cam with you...The pics are very natural. Your latent photography skills are showing off.
అని Thejaగారు చెప్పారు | 3/16/2006 03:33:00 AM
@sumit
We will go one day if you are ready. Fix a date.
@Theja
Not always. but I carry it most of the time. I already took some 2500 photos. Most photos out of them are crap and went into recycle bin.
అని Pradeepగారు చెప్పారు | 3/16/2006 07:24:00 AM
As theja said seems ur photography skills are showing off. but wait until i buy one and lets see who is the better photographer ;)
అని Sandeepగారు చెప్పారు | 3/16/2006 09:41:00 PM
--------------------------
boss I have seen ur blog.Quite interesting and i want to tell u only one thing that ghosts exists only in our minds but not in materialistic world.
ReplyDelete