Thursday, March 16, 2006

దెయ్యమా?.. aka Is it ghost!...

ఇవాళ, ఎందుకనో నేను ఇప్పటి వరకు తీసిన ఫొటోలను ఒక సారి తిరగేయాలని అనిపించింది. ఇదిగో అప్పుడే ఈ ఫొటో కనిపించింది. దీనిని నేను ఎటువంటి మార్పులు-చేర్పులు చేయలేదు. మరి అక్కడ ఉన్న ఆ ఆకారం ఏమిటి మరి. ఈ ఫోటోను నేను మొన్నామధ్య తమిళనాడు వెళ్ళినప్పుడు, ఈరోడ్ జంక్షనులో ఇంకో రైలు కోసం ఆగినప్పుడు తీసాను. గమనించారా అక్కడ ట్రాలీ మీద ఏదో పొగ, మనిషి పోలిన ఆకారం ఒకటి ఉంది. కనిపించిందా. మనకు అప్పుడప్పుడు ఈమెయిల్లలో వచ్చే దెయం ఫొటోలాగే ఉందికదా. ఫోటో లోపలికి ఆ ఆకారం ఎలా వచ్చింది చెప్మా!!. బహుశా ఈరోడ్ జంక్షనులో ఏదయినా దెయ్యం ఉందేమో. అదే ఇలా నా ఫొటోలో వచేసిందేమో...
What's That Beside the Train

మరదే, ఇంకా నేను పూర్తిగా చెప్పక ముందే అలాంటి సందేహాలకు తావివ్వకూడదు. నేను ఈ ఫొటో ఎలా తీసాను అని మరిచి పోయుంటే నేను కూడా మీలాగే ఆలోచించేవాడినేమో. కానీ నేను మరిచిపోలేదు కదా మరి. ఈ ఫొటోను తీస్తునప్పుడు స్టేషనులో కొంచెం చీకటిగా ఉంది. అందుకని కెమెరా షట్టర్ వేగాన్ని కొంచెం తగ్గించి, టైమర్ పెట్టి తీసాను ఇంతలో నా మిత్రుడు నేను రైలు ముందు నుంచుని ఫొటో దిగుతానని చెప్పి ఇదిగో ఇలా అటూ ఇటూ తిరిగాడు. దాని ఫలితమే ఫొటోలోని ఆ వింత ఆకారం.

మరిచే పోయాను ఈ బ్లాగులో ఇది నా 50వ రచన. మొదలు పెట్టిన 20 నెలల తరువాత 50 కి చేరుకున్నాను, 100ను చేరుకోవాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి. అప్పుడప్పుడు ఇంగీషులో రాస్తూ అప్పుడప్పుడూ తెలుగులో రాస్తూ, ఈ మధ్యనే రెండు భాషలలో రాయటం మొదలు పెట్టాను మరి. పైన ఉన్న View in English - Beta చూడండి. ఇలా రెండు భాషలలో రాయటం ఎన్నిరోజులు కొనసాగుతుందో చూద్దాం మరి.

In English: Today, I felt like scanning through the photos I have taken with my camera. That is when I came across this photo. I shot this photo when we were waiting for a train in erode junction. You might have already observed that there is some kind of fog taking the shape of a man. I assure you that there arent any editings in photoshop or similar software. Then how did the weird shape come into the picture. You might be thinking that there might be some ghost in that railway station. And some how it appeared in this photo.
What's That Beside the Train

No, you should listen to the complete story before coming to a conclusion. If I forgot how I took this photo then I would have come to a similar conclusion like you people. But luckily I did not forget that. While I was taking this photo there is a bad light in the station and I have to adjust the camera to a slower shutter speed and then set the timer to take the photo, meanwhile, one of my friend started wakling in between. Thats how the strange, wierd figure in the photo formed. So, no ghosts.

OH! I just forget to tell, this is my 50th post. Started this blog some 20 months ago. Though I thought to remind you all in my 100th post, I feared that it might take another couple of years. Till recently this blog featured posts in english and some times in Telugu language. Recently I started posting in both the languages simultaneously. You might have already noticed that, so you are reading this post in english. Any way once again see తెలుగులో చదవండి - నిర్మాణంలో ఉన్నది at the top. Lets see how long I will be posting in two languages.

6 comments:

  1. Comments I got for this post in my previous blog...
    --------------------------
    బాగున్నాయి మీ ఫొటోలు, వాటి వెనుక కథలు. Hope to see more of 'em..!!

    అని చేతనగారు చెప్పారు | 3/16/2006 02:22:00 PM

    Cool pic ra...I thought it was some smoke or some stain on the lens..And what is this shutter speed? You have sort of become an expert photographer!! I will have to learn this stuff from u some day..of course as soon as I get my digicam!!

    P.S Remove the Word verification. Shouldn't place so many barriers to post comments.

    అని Thejaగారు చెప్పారు | 3/16/2006 10:43:00 PM

    U r becoming good at abstract photography. Keep up the good work.

    అని Anonymousగారు చెప్పారు | 3/24/2006 08:44:00 AM
    --------------------------

    ReplyDelete
  2. అటూ ఇటూ తిరిగాడా? లేక ఒక్క చొటే ఊగాడా మీ మిత్రుడు? చాయా చిత్రం ఒక చొటనే ఉంది మరి.చాయచిత్ర గ్రహణ సమయములో కాంతి శక్తి (Lux), Exposure time, Aperture వివరాలు లభ్యమవుతాయా?

    ReplyDelete
  3. Remove Word verification -It is causing lot of waste of time and repeated posting of same message, because of session time limitations.

    ReplyDelete
  4. రావుగారూ అలాగే మీరు చెప్పినట్ట్లే "word verification" తీసేసాను. ఇకపోతే ఒక ఫొటో ఎక్ష్పొసురె టైము వగైరా విషయాలను flikrలో కనుక్కోవాటం సులభమే. అందుకు మీరు బొమ్మపైన ఒక క్లిక్కు క్లిక్కితే చాలు అప్పుడు flickrలో ఉన్న బొమ్మ వద్దకు మిమ్మల్ని తీసుకుని వెల్తుంది అక్కడ పక్కనే ఉన్న "Additional Information"లో "More Properties" నొక్కితే ఫొటో పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఈ టపాలో ఉన్న ఫొటో వివరాలు ఇక్కడ ఉన్నాయి

    ReplyDelete
  5. appudappudu naaku oka sandeham vastundi entante patrikalalo vache photolu ilage thisinavemonani sandeham vastundi, nee photolu chala bagunnayee

    ReplyDelete
  6. photos chalaa bagunnari i think plat farm meeda vunnadi may be ghoast kakapovachu naa anumanam emitante adi neon light shadow manaki ala anipinchindani naa anumanam

    ReplyDelete