Monday, December 01, 2008

సంకలిని

సంకలిని ఒక ఓపెన్ సోర్సు ఆగ్రిగేటరు. సంకలినిని LAMP architecture లేదా దానికి సమానమైన architectureలలో పనిచేసే విధంగా రూపొందించాను. ఇందులో ఉపయోగించిన సాంకేతికాంశాలు.
- బ్లాగుల నుండి వచ్చే ఫీడ్లను చదవడానికి simplepie అనే ఒక పరికరం.
- చదివిన ఫీడ్లను ఎప్పటికప్పుడు డేటాబేసులో బధ్రపరచుకోడానికి ADOdb అనే ఇంకో పరికరం.
- JSON మరియూ AJAX ద్వారా సమాచారాన్ని వాడుకరులకు అందజేస్తుంది.

సంకలిని codebase మొత్తం, google code నుండీ SVN ద్వారా దిగుమతి చేసుకోవచ్చు.

వీవెన్‌గారు సంకలినిని పరీక్షించడానికి కూడలిలో ఒక ఆల్ఫా-డొమైను కూడా తయారు చేసారు.
http://alpha.koodali.org/code/


సంకలిని బ్లాగు టపాల నుండీ సారాంశాలను మాత్రమే భద్రపరుస్తుంది. అవి సహజంగా టపాలోని మొదటి 3-4 వాక్యాలు, లేదా బ్లాగులలో ఫీడుని configure చేసినదాని బట్టి భద్రపరుస్తుంది.

దీనిని ఎలా వాడుకోవచ్చు?
-- ఏదన్నా పదం ఉన్న టపాల(సారాంశాల)ను వెతకవచ్చు. ఇందుకు q అనే అక్షరాన్ని ఉపయోగించాలి.
ఉదా: సినిమా అనే పదం ఉన్న టపాల కోసం
http://alpha.koodali.org/code/?q=%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE

-- ఫలానా వర్గంలో ఉండే టపాలను వెతకవచ్చు. ఇందుకు c అనే అక్షరాన్ని ఉపయోగించాలి.
ఉదా: సినిమా అనే పదం ఉన్న టపాల కోసం
http://alpha.koodali.org/code/?c=%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE

-- ఏదన్నా ఒక్క బ్లాగుకి సంబందించిన టపాలను మాత్రమే చూసుకోవచ్చు. ఇందుకు b అనే అక్షరాన్ని ఉపయోగించాలి.
ఉదా: పొద్దు వ్యాసాలను మాత్రమే చూడాలని అనుకుంటే
http://alpha.koodali.org/code/?b=poddu.net


అంతే కాదు, సంకలినిని ఉపయోగించి మీరు ఫీడులను కూడా పొందవచ్చు. ఆ ఫీడులకు కూడా పైన తెలిపిన ఫిల్టర్లను పెట్టుకోవచ్చు
http://alpha.koodali.org/code/atom.php


సంకలినిని ప్రస్తుతం శైశవ దశలో వుంది, దీనిని మరింత మెరుగులు దిద్దటానికి మీకు ఉత్సాహం ఉంటే మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు. పాల్గొనాలనుకునే వాళ్లు నాకు ఒక e-mail పంపిస్తే మిమ్మల్ని ఈ ప్రాజెక్టులో సభ్యులుగా చేస్తాను.

4 comments:

  1. నాకు చేయాలనీ ఐతే ఉంది. కానీ ఇలాంటి వాటిల్లో పెద్దగ అనుభవం లేదు. ఎమన్నా ఉపయోగపడే లంకెలు ఉంటే పంపించండి. అలాగే రోజుకి ఎంత సమయం కేటాయించాలి దీనికోసం?

    ReplyDelete
  2. దీనికోసం ప్రత్యేకించి మీ సమయాన్ని కేటాయించవద్దు. మీకు ఎప్పుడయినా ఖాలీ సమయం వుంటే దానిని సద్వినియోగ పరచుకోడానికి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఈ ప్రాజెక్టును మొత్తం ఇప్పటివరకూ phpలోనే రాసాను కాబట్టి మీకు php.net అనే సైటు బాగా ఉపయోగపడుతుంది.

    ఇందులో పాల్గొనడానికి మీకు పెద్దగా అనుభవం కూడా అవసరం లేదు. సంకలినిలో ఇప్పటికే ఉన్న బోలెడన్ని లోపాలను ఎత్తి చూపించవచ్చు, ఇది అన్నిటికంటే బాగా ఉపయోగపడే సహాయం.

    ReplyDelete
  3. 11bet Vigiri | vntopbet.com
    Our website 10cric login is loaded with detailed overview, betting tips, 11bet Vigiri. 11bet Vigiri. 11bet 11bet Vigiri. 11bet 1xbet korean Vigiri. 11bet Vigiri.

    ReplyDelete