పోయినాదివారం, హరేరాం సినిమా చూసా. మొదటగా ఆ సినిమా దర్శకుడు హర్షవర్దన్ గారికి కొత్తదనంతో నిండున్న ఇలాంటి సినిమాను అందించినందుకు నేనర్లు. అప్పుడెప్పుడో కల్యాణరాందే అతనొక్కడే సినిమా చూసా, అందులో సినిమా మొదట్లోనే, మిగతా సినిమా మొత్తం ఉత్సాహంగా చూడాలనిపించేటట్లు చేసే సన్నివేశం ఒకటి చూపిస్తాడు. ఆ తరువాత మిగతా సినిమా కొంతవరకూ బలమైన కధతో, ఊహించలేనన్ని మలుపులతో బాగానే నడుస్తుంది. ఆ సినిమా బాగుంది కాబట్టి, రెండు సినిమాలలో కల్యాణ్‌రాం ఉన్నాడు కాబట్టి, ఈ సినిమా కూడా బానే ఉంటుందేమోననే ఒక Transitive Relation ఏర్పరచేసుకుని, స్నేహితులతో పాటుగా చెన్నై నగరానికి 30కీమీల అవతల ఉండే మాయాజాల్ అనే మల్టీప్లెక్సులో చూడటానికి వెళ్లా.
నా అంచనాలను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా, సినిమా మొదట్లోనే కొన్ని సంకేతాలొచ్చాయి. సినిమా మొదటి గంటలోనే అనేకానేక మలుపులు తిరిగి, చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ వచ్చేంతవరకూ నా స్నేహితుడు, ఈనాడువాడి మీద కేసేద్దామని అనుకున్నాడంట (ఈనాడులో ప్రియమణి CBI అని రాసాడు, కానీ అప్పటి వరకు, ఆమె పాత్రకూ CBIకి ఎటువంటి సంభందం కనిపించదు మరి!!). అప్పటికే సినిమాలో వచ్చిన బోలెడన్ని మలుపులను చూడటంవలన మేమందరం ఇంటర్వెల్ తరువాత మిగతా కథ ఎలా ఉంటుందోనని తలా ఒక థియరీని ఏర్పరిచేసుకున్నాం.
ఇంటర్వెల్ తరువాత సినిమాలో ఇంకొన్ని మలుపులతోనూ, ఆశ్చర్యకర సన్నివేశాలనూ కలుపుకుని సినిమా ముగుస్తుంది. అయితే మేము ఇంటర్వెల్ అప్పుడు ఏర్పరచుకున్న థియరీలన్నిటినీ కాకుండా దర్శకుడు తనదైన కొత్త థియరీతో సినిమాను నడిపిస్తాడు. అలా నేను తరువాత సన్నివేశంలో ఈ విధంగా జరుగుతుంది, అని అనుకుంటూ ఉంటే, సినిమా ఇంకో కొత్త మలుపు తిరిగి నేను అనుకున్నది జరగకుండా పోతుంది. అలా కొంతసేపటికి నేను ఏంజరుగుతుందో ఆలోచించటం మానేసి, మిగతా సినిమానంతా అక్కడ ఏంచూపిస్తే అది చూసా. మొత్తానికి సినిమా అయిపోయే సరికి నా మెదడు పాదరసంలా పనిచేయటం మొదలు పెట్టింది!
ఈ సినిమాలో నాకు నచ్చినవి:
- పాటలు, ముఖ్యంగా యాఖుదా జర ధేఖోనా అనే పాట. ఈ పాటను ఇప్పటికే వరకూ కొన్ని వందల సార్లయినా వినుంటాను.
- అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో ఒక కథ ఉంది. చాలా రోజుల తరువాత కధ ఉన్న ఒక తెలుగు సినిమాను చూసాననిపించింది.
- క్లైమాక్సులో హీరోని పోలీసులూ, విలన్లూ కలిపి చేసింగు చేసే సన్నివేశం. ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు నాకు NFS most wantedలో hot pursuit, వేరేవాళ్లు ఎవరో ఆడుతుంటే, ఆ ఆటను నేను చూస్తున్నట్లు అనిపించింది (ఆటలో ఉన్నట్లే హెలీకాప్టర్ కూడా ఉంటుంది)
- మామూలుగా అన్ని తెలుగు సినిమాలలో కార్లూ సుమోలూ దేన్నయినా(ముఖ్యంగా హీరో ప్రయాణించే కారుని) గుద్దుకుని గాలిలోకి ఎగరాల్సొస్తే నిట్టనిలువుగా పైకి ఎగురుతూ ఉంటాయి, ఈ సినిమాలో మట్టుకూ కొత్తగా పక్కకు ఎగురుతుంది.
సినిమాలో నేను గమనించిన కొన్ని లోపాలు:
- కల్యాణ్‌రాం ఇందులో ఒక ACP పాత్ర పోషిస్తాడు. ఆ పాత్ర పేరు హరికృష్ణ, అయితే అతని యూనిఫాం మీద N.Krshna అనే పేరు ఉన్నట్లు అనిపించింది. ఇంకెవరైనా చూసి నేను చూసింది కరెక్టోకాదో చెప్పాలని మనవి.
- ఇంకో సన్ని వేశంలో సింధూ తులానీ పోషించిన పాత్ర ఆపదలో ఉంటుంది అలా ఆమె పరిగెట్టుకుంటూ వెళ్లి అప్పుడే మూసేయబోతున్న ఒక ఇంటర్నెట్టు కఫేలోకి వెల్తుంది. వెళ్లి తన పరిస్తితిని వివరిస్తూ, ఈమెయిలును టైపు చేసేస్తుంది. అంత టెన్షన్లోనూ ఆమె పారాగ్రాఫు మొదట్లో ఖాళీలను వదిలి, మిగతా పారాగ్రాఫునంతటినీ చాలా అందంగా అమరుస్తుంది, కింద తన సిగ్నేచరు కూడా టైపుచేసేస్తుంది. ఇదంతా కూడా outlook లాంటి సాఫ్టువేరు నుండి చేసేస్తుంది. అంత టెన్షనులో ఆమె తన ఈమెయిలుని outlookలో కాన్‌ఫిగరు చేసుకుని మరీ, ఈమెయులుని పంపిందంటారా.
- హై సెక్యూరిటీ CBI జైళ్లలో హీరో గారు తప్పించు కోవడానికి వెంటిలేటర్లు ఎల్లవేలలా ఉంటాయి. పైగావారికి తాగటానికి coke tinలను కూడా ఇస్తుంటారు. (ఇది సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది).
మొత్తానికి సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటే గనక, నాకు ఒక పజిల్‌ని పరిష్కరించినట్లు అనిపించింది. అందుకనే కథ గురించి ఎక్కువగా చెప్పలేదు.
నిజమే గానీ ఈ చిత్రదర్శకుడు హర్షవర్ధన్ గతంలో విజయేంద్రవర్మ అను ఒక చిత్రరాజమును బాలకౄష్ణతో తీసాడూ అతని అసలు పేరు స్వర్ణ సుబ్బారావు అని తెలిసి మరీ ఈ సినిమా చూసుంటే మీ భావాలు ఎలా ఉండేవో!!??
ReplyDeleteనాకేమితో ఇది వ్యంగ్యంగా రాసిందా ? స్ట్రెయిటుగా రాసిందా అర్థం కావట్లా ?
ReplyDeleteకళ్యాణ్ రామ్ సినిమా బానే ఉంది అనుకోడానికి కూడా ఆలోచించాల్సిందే.
patalu anni seetarama sastry rasinavi, lyrics superb, sariga padani tholi adugu anedhi super.
ReplyDeleteసినిమా చూసే ధైర్యం చేయలేదు గానీ 'యా ఖుదా జర దేఖోనా ' పాట మాత్రం బాగుంది వినడానికి!
ReplyDelete