మా US కొలీగ్ ఒకతని పేరు QIN అని చూసి క్విన్ అని పిలిచా, వెంటనే అతను క్విన్ కాదు చిన్ అని పలకాలని చెప్పాడు. మరి chin అనే రాసుకోవచ్చు కదా అని అడిగితే, అలా ఎందుకు పిలవాలో తెలుసుకోవడానికి ఈ వెబ్సైటుని చూడమన్నాడు.
అది చూసిన తరువాత మా కొలీగ్ ఒకతను ఫిష్ స్పెల్లింగుకు ఈ గతి పట్టించాడు.
- F-I-S-H; - ఇది మనందరికీ గుర్తుకొచ్చే స్పెల్లింగు.
- G-H-T-I-O; GH as in రఫ్(rough), TIO as in నేషన్(NATION)
--
మరి మీకు కూడా ఇలాంటివి ఇంకేమన్నా తెలుసా...
Monday, August 18, 2008
Subscribe to:
Post Comments (Atom)
ఇది చైనా భాష కి సంబంధించినది కదా!!
ReplyDeleteఅలాంటివి బోలెడున్నాయి. నేనమెరికా వచ్చిన కొత్తలో ఓ రెస్టారెంట్ వాళ్ల మెన్యూలో quesadilla అనబడే మెక్సికన్ వంటకం వర్ణన చూసి నోరూరి 'వన్ క్వాసడిల్లా ప్లీజ్' అని స్టయిల్‌గా అడిగితే ఆ కుక్కు వింతగా చూసి ఆ తర్వాత చెప్పాడు 'దాన్ని కేసడియా అనాలి' అంటూ. ఇలాంటివే 'హాలాపీన్యో' అనబడే 'japapeno' మొదలైనవి.
ReplyDeleteస్పానిష్, జెర్మన్ తదితర భాషల్లో ఉండే కొన్ని ప్రత్యేక శబ్దాలకి తగ్గ అక్షరాలు ఇంగ్లీషులో లేకపోవటం వల్ల వచ్చిన తిప్పలివన్నీ. తెలుగులో కూడా ఇలాంటివున్నాయి. 'తమిళం' లోని 'ళ' నిజానికి అలా పలకరు తమిళులు. ఆ అక్షరం తెలుగులో లేదు. మీరు గమనించారో లేదో, తమిళులెప్పుడూ ఇంగ్లీషులో కూడా దాన్ని 'Tamil' అని కాకుండా 'Tamizh' అని రాస్తారు. ఉన్నంతలో ఆ స్పెల్లింగే వాళ్లు పలికే శబ్దానికి దగ్గరగా ఉంటుంది మరి.
మెక్సికన్లు - "J" ని "Y" అని పలుకుతారు - "san jose" ని సాన్ జొసె అని కాకుండా - సాన్ హొసె అని పలుకుతారు. అదే విధంగా "jalapeno" ని ఆలపీన్య అని (ఇక్కడ హ తేలికగా పలకడం వల్ల ఆ లా వినిపిస్తుంది). హిందిలో "chopda" అని రాసి "chopra" అని పలుకుతారు. చాలా భాషల్లొ ఇలాంటివి ఉన్నాయి. "GHOTI" ని "Fish" గా పలకవచ్చు అని జొకేసిన మహానుభావుదు - "G. B. Shaw".
ReplyDelete@భాస్కర్ రామరాజు,
ReplyDeleteకాదండీ, ఇంగ్లీషులోకి వేరే భాషల నుండి వస్తున్న పదాల గురించి :)
@అబ్రకదబ్ర,
అవునండీ, ఒక భాషలో ఉన్న శబ్ధాలు ఇంకో భాషలో ఉండవు, అయినా వేరేభాషల పదాలు దిగుమతవుతూనే ఉంటాయి.
@Anonymous,
G.B. Shaw అన్నమాట! నేన్నటి నుండీ మా కొలీగ్ దీనిని ఎక్కడి నుండి పట్టాడా అని ఆలోచిస్తున్నా... నిన్నటి నుండీ నెట్‌లో GHTIO అని వెతుకుతున్నా, ఎక్కడా దాని మూలం దొరకలేదు, GHOTI అని వెతుకుంటే దొరికేదన్నమాట...
నమస్కారం..
ReplyDeleteనేను ఒక పోస్ట్ రాసాను..
ప్లీజ్ ఒకసారి నా పోస్ట్ చదివి వీలుంటే మీకు నచ్చితే spread it..ప్లీజ్
ధన్యవాదాలు..
లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
http://prakamyam.blogspot.com/2008/10/blog-post.html