Saturday, July 05, 2008

ఇప్పుడు నేను చెన్నైవాసిని

నేటితో చెన్నై వచ్చి సరిగ్గా రెండు నెలలయ్యింది. ఇక్కడికి వచ్చె ముందు ఇక్కడి వాతావరణం గురించి అందరూ చాలా చాలా బయపెట్టారు, కానీ కొత్త ఉద్యోగం బాగా నచ్చి వచ్చేసాను. వచ్చిన తరువాత ఇక్కడి వాతావరనం విజయవాడ ఎండలు కంటే బానే ఉన్నట్లు అనిపించింది!!!

వచ్చిన తరువాత మొదటి శనివారం మెరీనా బీచ్‌కి వెళ్లి సముద్రాన్ని చూద్దామని అనుకున్నాం. అయితే మొదటిసారిగా సముద్రమంటే నీళ్లతోనే కాకుండా జనాలతో కూడా తయారవుతుందని ప్రత్యక్షంగా చూసాం. శనివారం, ఆదివారాలు మాలానే ఇంకా చాలా మంది అనుకుంటూ ఉంటారని అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది. అప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లాగా సముద్రాన్ని చూద్దామని సముద్రపు ఒడ్డున ఉండే ఇసకమీద అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ చివరికి నీళ్ల దగ్గరకు చేరుకునే సరికి చీకటి పడిపోయింది. మొత్తానికి, ఇలాంటి ఇంకో సాయంత్రం అవుతుందని వెళ్లిన మాకు చాలా పెద్దనిరాశ.

అలా కొన్ని రోజులపాటు ఎటూ వెళ్లకుండా, కొన్ని రోజుల తరువాత మళ్లీ ఏదో ఒక సముద్రపు బీచ్‌కి, అదీ జనాలు లేని బీచ్‌కి వెల్లాలని బాగా ప్లానేసి, స్కెచ్చుగీసి, చెన్నై నుండి 30కీమీల దూరంలో ఉండే మహాబలిపురం వెళ్లాలని నిర్ణయించాం. సాయంత్రమైతే చాలా మంది ఉంటారని, మధ్యాహ్నం అయితే ఎవరూ ఉండరని 10:30 కి బయలుదేరి 12 కల్లా అక్కడికి చేరుకున్నాం. ఒక గంట పాటు అక్కడ ఉన్న గుడిని, దాన్ని చూడటానికి వచ్చిన టూరిస్టులను చూసి, కొన్ని ఫొటోలు కూడా దిగేసాం.


తరువాత ఆ గుడికే ఆనుకుని ఉండే సముద్రం దగ్గరకు వెళ్లాం. మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా అక్కడ ఇంత మంది ఉంటారని ఏమాత్రం ఊహించలేదు. కాకపోతే మెరీనా బీచ్‌కంటే ఇది చాలానయం.


మొన్నామధ్య సునామీ వచ్చినప్పుడు ఈ గుడి కూడా మునిగి పోయినట్టుంది, ఈ సారి గుడికేమీ జరగ కూడాదని, ఆ గుడికీ, దాని వెనుక ఉండే సముద్రానికీ మధ్యన పెద్ద పెద్ద బండరాళ్లతో నింపేసారు.


తరువాత అక్కడున్న బండరాళ్ల మీద చాలా సేపు కూర్చుని, సముద్రపు అలలు వచ్చి ఈ బండరాళ్లను ఢీకొట్టటం చూస్తూ కూర్చున్నాం.


---
ప్రస్తుతానికి "తమిళ్ తెరియాదు" అనే వాక్యాన్ని నేర్చుకున్నా. అదేంటో గానీ ఆ వ్యాక్యాన్ని ప్రయోగించిన ప్రతీసారీ ఎదుటోళ్లు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో అరిచేస్తూ ఉంటారు... నేను తరువాత ఇంగ్లీషులో ఏదో మాట్లాడతాను, తరువాత వాళ్లు తమిళంలో ఇంకేదో మాట్లాడతారు. ఇదంతా కాదని చివరికు సైగలతోనూ, ఏకపద వాక్యాలతోనూ నెట్టుకురావడం మొదలుపెట్టా.

ఇదే క్రమంలో మొన్నమధ్య దశావతారం సినిమాని తమిళంలో చూసా. సినిమా నాకు బానే అనిపించింది, కాకపోతే ఇంటర్వెల్ తరువాత వచ్చే అసిన్ పాత్రను కట్ చేసేసి అవతల పారేస్తే బాగుండేదనిపించింది; ఏంటో మరి ఆ పాత్రను మొదటిసారిగా చూపించే పాటలో తప్ప తరువాతంతా ఏదేదో అరుస్తూనే ఉంటుంది, చిరాగ్గా...

9 comments:

  1. Good. But you are in the first phase. Slowly you will fall in love with SHOUTING and speaking LOUDLY ! My sister who was an introvert, has now turned into an Extrovert by staying in Chennai for just over two months. It is now difficult to cope with her non-stop nonsence. But we liked her new-born talktativeness since it is the LOUD statement (talking nicely and talking/expressing ones feelings more clearly) one can give to the world. Good Luck.

    ReplyDelete
  2. అడయారు లోని ఇలియట్స్ బీచ్, తక్కువ జనంతో (మెరినా తో పోలిస్తే), ఆహ్లాదకరంగా ఉంటుంది. అడయారు లోనే ఉన్న, థియోసాఫికల్ సొసైటి ప్రాంగణం లోని, మర్రిచెట్టు చెంత, కావలసినంత ప్రశాంతి. దీని గురించిన వివరాలకు చూడండి.
    http://www.hinduonnet.com/thehindu/mp/2002/10/16/stories/2002101600230300.htm

    ReplyDelete
  3. ఓ వెరీ గుడ్ సెటిల్ అయిపోయారన్నమాట.
    ఆ బీచ్ ల గురించి మా చెన్నై టీం మేట్లు చెబుతారు. మెరీనా బీచు పెద్ద చిరాకని. ఇంకేదో బీచుందంట అది బాగుంటుందని చెప్పారు.

    నాకయితే విశాఖలో బీచు నచ్చుతుంది.

    ReplyDelete
  4. మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు మెరెనా బీచ్ మొత్తం జనాలు ఉంటారని.. మేము బెసెంట్ బీచ్ కి వెళ్ళాం.. అక్కడ కాస్త ఫర్లేదు...

    ReplyDelete
  5. Nice photographs and a good post!!

    ReplyDelete
  6. జన సముద్రం అంటున్నారు. మన బెంగుళూరులో .. ఊప్స్... బెంగుళూరులో ఎప్పుడూ ఫోరంకి వెళ్లలేదా వారాంతాల్లో...
    తిలక్ చెప్పినట్లు.
    అమెరికాలో డాలర్లు పండును
    భారత దేశంలో జనాభా పండును.

    మీ పిపిటి బావుంది. :)

    ReplyDelete
  7. @sujata
    hope so...

    @cbrao
    నేను కూడా ఆ బీచ్ గురించి విన్నా ఇంక వెల్లటమే తరువాయి. చెట్టు గురించి మొట్టమొదటి సారిగా వింటున్నా...

    @ప్రవీణ్
    ఇక్కడికి రాకముందే సెటిల్ అయిపోయా! ఇప్పటికే ఇక్కడ ఉంటున్న స్నేహితులతో పాటుగా చేరిపోయా..

    @మేధ
    మరీనా బీచ్ ఒక్కటే లోకలు ట్రెయిను స్టేషనుకు దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడికి అంతమంది వస్తారనుకుంటా(అక్కడికి చేరుకోవటం సులువని).

    @పూర్ణిమ
    thanks

    @రాకేశ్వర రావు
    మాల్‌కీ సముద్రానికీ కొంచమైనా తేడా ఉండాలి కదా మరి. పీపీటీ అంటే మొదట అర్థం కాలేదు, అర్థమైన తరువాత, అంతే కదా మరి అని అనిపించింది.

    ReplyDelete
  8. నాకూ విశాఖ బీచ్లంటే భలే ఇష్టం.. చెన్నై లో ఆ అడయారు బీచ్ (బెసంట్ నగర్ బీచ్ అంటే ఇదేనా?) చూడాలని నాకో ఆశ. ఎప్పుడు కుదుర్తుందో తెలీదు.

    బొమ్మలు బావున్నాయి.

    ReplyDelete
  9. ఫొటో బాగుందండి!నాకైతే వెగేటర్(గోవా) బీచ్ నేను చూసిన అన్ని బీచుల్లోకీ బాగా నచ్చింది.విశాఖ ఇంతవరకూ చూళ్ళేదు.

    ReplyDelete