Wednesday, April 02, 2008

పైథాను భాష

మీరు ఒక సాఫ్టువేరు ఇంజినీరయ్యుంటే పైథాను భాష గురించి పలువిధాలుగా ఇప్పటికే వినుంటారు. అన్ని కంప్యూటరు భాషలలోకీ నేర్చుకోవడానికి అత్యంత సులువైన భాష అనీ; ఇందులో రాసే ప్రోగ్రాములు ఇంగీషు భాషకు అతి దగ్గరగా ఉండి, ఇతరులు రాసిన ప్రోగ్రాములను కూడా చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చనీ; ఇలా రకరకాలుగా వినే ఉంటారు.

అయితే నేను ఈ మధ్యన చూసిన ఒక వెబ్సైటువలన పైథాను భాషను ఇంకో కొత్తకోనంలో చూడగలిగాను. అదేంటంటారా...

పైథాను భాషను, మన మాతృభాషలో ఉన్న పదాలను ఉపయోగించి ప్రోగ్రాములు రాసుకునేటట్లు మలుచుకోవచ్చు. కామెంట్లు మాత్రమే కాకుండా, మొత్తంగా తెలుగులోనే ఉన్న ప్రోగ్రామును ఒకసారి ఊహించుకోండి... మామూలు తెలుగు వాక్యాలలో ఉండే ప్రోగ్రాములతో, ఎవరయినా చాలా సుల్వుగా ప్రోగ్రాములను రాసేయవచ్చు. అలా మాతృభాషలోనే ప్రోగ్రాములు రాయగలిగితే, రాస్తున్న వారికి కంప్యూటరు పరిజ్ఞానం కూడా పెద్దగా అవసరంలేదేమో...

అయితే సమస్యల్లా అలాంటి పైథాను భాష ప్రస్తుతానికి చైనావారి లిపిలోనే లభ్యమవుతుంది. ఇది త్వరలోనే ఇతరభాషలకు కూడా విస్తరిస్తుందేమో చూడాలి. మరిన్ని వివరాలకు చైనా పైథాను భాషకోసం ఏర్పాటుచేసిన ఈ వెబ్సైటును సందర్శించండి. http://www.chinesepython.org/cgi_bin/cgb.cgi/english/english.html

4 comments:

  1. తెలుగులో కొచ్చేటప్పటికి దాన్ని కొండచిలువ భాష అనిపిలవాలి. లేకపోతే మనవాళ్లు పైథానుతోపాటు కిందిథాను భాష కూడా కావాలని అడగగలరు! :)

    ReplyDelete
  2. ఆసం...
    కాంసెప్టు కొత్తగా బాగుంది. కానీ ఇది ఎంత వరకూ అవసరమో ?

    ReplyDelete
  3. కిందిథాను భాషా? హహ్హహ్హ...
    Python గురించి విన్నప్పుడల్లా దాని (అవ)లక్షణం గుర్తుకు వచ్చి వణికి పోతుంటాను. Indentation ని ప్రాణ ప్రదంగా భావించే భాషల్లో Python కూడా ఒకటి (Cobol) కి పోటీ కాదనుకోండి. యెప్పుడైనా program debug చెయ్యాల్సివస్తే spaces లెక్కపెట్టుకొనేసరికి తల ప్రాణం తోకలోకి వచ్చేది.

    ReplyDelete
  4. 1xbet - Best Bet in 1xBet - Download or Install for Android
    1xbet is the best betting app in the world aprcasino created for esports. It is a one 1xbet korean of communitykhabar the safest https://access777.com/ and most trusted names among players. It offers a user friendly interface

    ReplyDelete