Friday, February 08, 2008

బొమ్మలలోని భావాలు

వంద మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క బొమ్మతో చెప్పొచ్చంటారు. దానికి సరిగ్గా సరిపోయే బొమ్మ ఇది. "పై" అనే సంఖ్యకు 3.1415... అనే విలువ ఎలా వచ్చిందని అడిగితే, అది వృత్తం యొక్క వ్యాసానికి దాని చుట్టుకొలతకు మధ్యన ఉన్న నిష్పత్తి అని చెప్పొచ్చు. అలా కాకుండా కింద ఉన్న బొమ్మను చూపిస్తే ఎవరైనా సరే "పై" అంటే ఏమిటో చిటికెలో అర్ధం చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే కాదు, దానిని ఇంక జీవితంలో మర్చిపోరు.


వికీమీడియా కామన్సులో ఇటువంటి బొమ్మలు వేలకొలదీ ఉన్నాయి. చూడంగానే చూస్తూ ఉండిపోవాలనిపించే బొమ్మలు కూడా ఇక్కడ వేలలోనే ఉన్నాయి. క్రితం సంవత్సరం అప్లోడుచేసిన బొమ్మలలో అత్యుత్తమ బొమ్మలుగా ఎన్నుకున్న బొమ్మలను కూడా ఒకసారి చూడండి.

4 comments:

  1. NGC వాడి తలను తన్నేటట్టున్నాయి...ఫోటోలు. అదీ వేల ఫోటోలు. చీమలన్నీ కలిస్తే...పెద్ద పామైనా ఏమి చేయగలుతుంది :)

    ReplyDelete
  2. బావుంది. ఇటువంటి పరికరాలు ప్రైమరీ, సెకండరీ ఉపాధ్యాయులకి చేరాలి!

    ReplyDelete
  3. chaala baagundi,naaku nachchindi.
    naaku oka doubt.(pie)22/7=3.1415 raavatlEdu,3.1428 vastundi.
    International Maths Olampiad exam lo kUdaa 3.1415 ichchaaru.
    Please explain.

    ReplyDelete
  4. @tapasya
    బొమ్మ చూపిస్తే అర్థమైపోతుందని అనుకున్నాను... Actualగా పై వాల్యూ 22/7 కాదు, అది ratio of the circumference of a circle to its diameterని represent చేయటానికి వాడతారు. అంటే 1 unit diameter ఉన్న circleకి circumference 3.1415... ఉంటుంది. నువ్వు 7 units diameter ఉన్న circle తీసుకుంటే దాని circumference సుమారుగా 22 వస్తుంది. అందుకనే మన calculationsకి సులువుగా ఉంటుందని పై వాల్యూని 22/7గా తీసుకుంటారు. ఇంకో సంగతేమిటంటే, ఇప్పటివరకూ పై అసలు వాల్యూ ఎవరికీ తెలియదు, (3.1415 కూడా approximate వాల్యూనే). నీకు మరింత detailedగా కావాలంటే వికీపీడియాలోని పై పేజీకి వెళ్లి ఆ article చదువు.

    ReplyDelete