మీకు నిజంగానే బోరుకొడుతుందా? అయితే మిగతా పోస్టును కూడా చదివేసి ఆ తరువాత పక్కనున్న ఈ బొమ్మపై నొక్కి ఆటను అడేయండి. ఈ ఆటను ఫైరుఫాక్సులోనే ఆడగలరు, IEలో పని చేయకపోవచ్చు. నాకు కూడా రెండు మూడు నెలల క్రితం బాగా బోరుకోట్టి ఈ ఆటను తయారు చేయడం మొదలు పెట్టాను. కొంత మంది దీనిని చుక్కలాట లేదా చుక్కలు-డబ్బాలాట అని కూడా పిలుస్తారు. ఈ ఆట గురించి మరింత తెలుసుకోవడానికి ఆంగ్ల వికీపీడియాలో ఉన్న ఈ వ్యాసాన్ని చదవండి. బీటెక్ చదువుతున్నప్పుడు క్లాసు బోరు కొడుతున్నప్పుడల్లా పక్కన కూర్చున్నోడితో ఈ ఆట ఆడే వాళ్ళం. ఒక సారి పరీక్షలకు చదువుదామని నోట్సు తీస్తే అందులో నాకు నోట్సు కంటే కూడా ఈ గీతలే ఎక్కువ కనపడ్డాయి!!!
ఆటను తయారు చేయడం నెల రోజులలో పూర్తయిపోయింది. కంప్యూటరే ఆలోచించి ఎత్తులువేసేటట్లుగా తయారుచేసాను. ఆ తరువాత ఇంకో నాలుగైదు రోజులు కష్టపడి, ఈ ఆటను w3 standardsకి తీసుకుని వచ్చాను. (ఈ ఆటను పూర్తిగా DHTMLలోనే రాశాను). అంతే కాదు ఫ్లాషు గానీ అప్లెట్టులు కానీ వాడకుండా ప్రోగ్రామును SVG+javascript లోనే రాసేసాను. అంటే నేను మీకు ఆటతోపాటు దాని సోర్సుకోడును కూడా ఇచ్చేసున్నాన్నమాట. మీరు ఈ ప్రోగ్రామును తీసుకుని మీ ఇస్టమొచ్చినట్లు మార్చుకోవచ్చు కూడా.
మీలో సోర్సుకోడును చూసేవాళ్ళు చాలామంది ఉంటారనే అనుకుంటున్నాను. అలా చూసేవాళ్ళకు ఒక చిన్న పరీక్ష. ఇందులో ఆటను మూడో లెవెల్లో ఆడేటప్పుడు కంప్యూటరు ఎత్తులువేయటంలో ఒక చిన్న పొరపాటు చేస్తుంది. ఆ పొరపాటు ఏమిటి? అలా ఎందుకు చేస్తుంది? దానిని సరి చేయడానికి ఏం చేయాలి? ఆ పురుగును పట్టుకోగలరేమో చూడండి!!!
ఇది కాకుండా వేవెనుడి బ్లాగులో ఇంకో ఆట ఉంది అది కూడా ఆడండి. ఈ ఆట యొక్క UI Designని అక్కడి నుండే తీసుకున్నా...
Wednesday, January 16, 2008
Subscribe to:
Post Comments (Atom)
ప్రదీప్ గారు : మీరేమో బోర్ కొట్టినప్పుడు ఆడమన్నారు .. మాకేమో వేరే పని తగిలేదాకా లేక బోర్ కొట్టే దాకా ఆడించేలా ఉంది ఈ ఆట.....మీ కష్టం, తెలివితేటలు బహుధా ప్రశంశనీయం ఈ ఆటను రూపొందించటంలో మరియు దీనిని అంతా DHTML/JavaScript లో (Flash/Applet లేకుండా) తయారుచేసినందుకు..
ReplyDeleteఅభినందనలతో ...
కాలేజీరోజుల్లో వెనుకబెంచీల్లో కూచ్చొని బాగానే ఆడాం ఈ ఆట. కానీ అటవగానే మళ్ళీ చుక్కలు పెట్టడమే చిరాగ్గా ఉండేది. ఆన్లైన్ అవతారం బావుంది..కానీ ఇంకొద్దిగ పెద్దది చేస్తే బావుంటుంది. మూడు సార్లు కష్టమైన స్థాయిలో ఆడా..రెండు సార్లు ఓడా..కానీ చివరి ఆటలో గెలుపు నాదే
ReplyDeleteబాగుంది. కాలేజి రోజులు గుర్తుకు తెచ్చారు.
ReplyDeleteచాలా work చేసిన్నట్టూన్నారే
ReplyDeleteflash లేకుండా చేయటం అంత మాటలు కాదు
జహాపనా మీకు నా ధన్యవాదములు
@తెలుగూవాడిని, అశ్విన్,
ReplyDeleteమీకు నచ్చినందుకు నాకు సంతోషం. ఆటను తయారు చేసిన తరువాత IEలో కూడా పని చేసేటట్లు చేదామని అనుకున్నాను, 4-5 రోజులు ప్రయత్నించి తరువాత చేతులెత్తేసాను.
@రవి, సిరిసిరిమువ్వ,
నాలుగు సంవత్సరాల పాటు, నన్ను నాపక్కనోడిని, క్లాసులో నిద్ర పోనివ్వకుండా ఈ ఆటే నన్ను కాపాడింది :)
@ఇకపై ఆడాలని అనుకున్నవారికి,
ఈ ఆటలో "కష్టం" లెవలును మీ కంప్యూటరు చాలా వేగంగా పని చేస్తుందని అనుకున్నప్పుడే ఆడండి, లేకపోతే కంప్యూటరు ఆలోచిస్తూ చిస్తూ మీ సహనానికి పరీక్ష పెడుతుంది. ఈ కారణంగానే "అతి-కష్టం" అనే ఇంకో లెవలు తయారు చేయాలని ఉన్నా తయారు చేయలేదు ...
pradeep gaaru.. Nice work...
ReplyDeletei tried to play your game.. i had problem with colour of the line(yellow..).., i think it would be good to play if its in other colour( may be red is suitable)
--
Yagnesh
Evari cheviloo pedthunnaru meeru puulu....Nalugu samvathsarala patu mimmalni ee aata, class lo nidra ponivvakunda chesindhi antee nammamantaaraa.
ReplyDeleteEla aatalu aduthuu nidra pothuu chadivithenee ee aatanu tayaru cheyagaligaraa DHTML/JavaScript లో (Flash/Applet లేకుండా).
మా బీటెక్ కోర్సులో javascriptలు అవీ ఉండేవి కావు, ఆపరేటింగు సిస్టం అనీ కంప్యూటరు ఆర్కిటెక్చరు అనీ ఏవేవో చెప్పి బోరు కొట్టించే వాళ్లు. మరి అలాంటి క్లాసులలో నిద్రపోతేనే కదా javascriptలు అవీ నేర్చుకోగలిగేది.
ReplyDelete