మొన్న ఆరు కాళ్ల సాలీడుని చూసారు ఇప్పుడు, ఒకే కాలు ఉన్న కాకిని చూడండి. ఈ వీడియోను సుమారు రెండు సంవత్సరాల క్రితం NITKలో MTech చేస్తున్నప్పుడు చిత్రీకరించాను...
ఈ కాకులకు వేరుశనగ పలుకులు విసురుతున్నాము, అందుకే మా చుట్టూ తిరుగుతున్నాయి. మొత్తమన్ని కాకులూ వేరుశనగ పలుకులను నేలమీద పడక ముందే తినాలని వాటిని మేము విసురుతున్నప్పుడు గాలిలోనే అందుకునేవి. కొన్నయితే రెండు మూడు పలుకులను ఒకేసారి అందుకోవాలని ప్రయత్నించేవి. కానీ మొత్తానికి వేరుశనగ పలుకులను గాలిలోనే, చాలా బాగా అందుకునేవి. బెంగుళూరు వచ్చిన తరువాత కాకులను ఒక్కసారి కూడా చూసిన గుర్తులేదు!
Tuesday, November 27, 2007
Sunday, November 25, 2007
ఆరుకాళ్ళ సాలీడు
అసలు పరిమాణం
కొన్ని రోజుల క్రితం ఒక ఆదివారం రోజు నిద్ర లేస్తూనే ఇలా వేలాడుతూ కనిపించింది. అంత పెద్ద సాలీడును నేను ఇంతవరకూ చూడలేదు. పైగా చాలా సేపు కదలకుండా అలాగే వేలాడుతూ ఉంది. వెంటనే కెమరాతీసి ఒక క్లిక్కు క్లిక్కాను. ఫ్లాష్ వెలుతురుకి బయపడింది కావచ్చు, వెంటానే కిందకు జారి...
అసలు పరిమాణం
ఇలా ఒక తలుపు సందులోకి వెళ్ళి దాక్కుంది, ఈ సారి మెళ్ళగా తలుపును తెరచి దగ్గరి నుండి ఇంకో ఫొటో తీసాను, ఈ సారి ఇంకా తొందరగా ఎక్కడికో వెళ్ళి మాయమైపోయింది.
బొమ్మలను కంప్యూటరులో ఎక్కించిన తరువాత, దీనికి ఒక పక్కన నాలుగు కాళ్ళకు బదులుగా రెండే ఉన్నాయని గమనించాను. అందుకే గావచ్చు ఎక్కడో under groundలో ఉండాల్సింది ఇలా బయటకు వచ్చింది!!!
Thursday, November 22, 2007
ఒకప్పటి IT నిపుణుడు!
IT నిపుణుల కష్టాల గురించి బొలెడన్ని రకాలుగా, కధలు కధలుగా చెబుతూ ఉంటారు. అసలు ఆ వృత్తి ఎందుకు కష్టంగా ఉంటుందో ఈ యూట్యూబులో ప్రదర్శిస్తున్న ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోండి...
Tuesday, November 20, 2007
స్టాకు మార్కెట్టు???
కొన్ని నెలల క్రితం బ్లాగ్‌షేర్స్ అనే సైటులో నా బ్లాగులో షేర్లను అమ్మకానికి పెట్టి నేను నా మొటమొదటి షేర్ల వ్యాపారాన్ని మొదలు పెట్టాను. అక్కడ డబ్బు తప్ప మిగతాదంతా నిజంగానే జరుగుతుంటుంది. ఆ రకంగా కొన్ని రోజులు అక్కడ షేర్ల ఆట ఆడాను. అలా అక్కడ వేరే బ్లాగులలో షేర్లను కొంటూ అమ్ముతూ ఉంటే కొన్ని రోజులకు నా బ్లాగులో నా దగ్గర ఉన్న వాటాకంటే ఎక్కువ వాటాను ఇంకోడెవడో కొట్టేసాడు. నా బ్లాగు నాకు కాకుండా ఇంకోడెవడి దగ్గరో ఉండటమేమిటని (అప్పటికి ఆ సైటు బోరుకొట్టటం మొదలైయింది), ఆ సైటుకు వెళ్లటం మానేసాను. 1000 బ్లాగు డాలర్లతో మొదలు పెట్టి ఆరేడు నెలల్లో సుమారు 500,000 బ్లాగు డాలర్లు సంపాదించానక్కడ :) (అయితే అక్కడ బ్లాగు డాలర్లలో కొంత మంది ఆస్తి 13-14 అంకెలలో ఉండేది).
ఈ మధ్య కాలంలో "నిజమైన" స్టాకు మార్కెట్టును గమనించటం లేదా అందులో పెట్టుబడి పెట్టడం అనే ఒక కొత్త వ్యాపకం మొదలుపెట్టాను. ఇక్కడ కొనటం అమ్మటం ఎంత నిజమో డబ్బులు పోవటం రావడం కూడా అంతే నిజం! నేను స్టాకు మార్కెట్టుకి కొత్త కాబట్టి పెట్టుబడి పెట్టేబదులుగా వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తున్నాను. అందుకుగాను ఒక నాలుగైదు షేర్లను ఎంచుకుని వాటిని పరిశీలించటం మొదలు పెట్టాను. వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తుంటే నా చిన్న బుర్రలో ఉన్న లాజిక్కుకి అందనివి ఏవేవో జరిగిపోతున్నాయక్కడ...
ఉదాహరణకు ఒక "క", "చ" అనే రెండు కంపెనీల షేర్లను తీసుకుందాం. రెండు కంపెనీల షేర్లూ పెరుగుతుతున్నాయి. అంతా బాగానే ఉందికదా అనుకుంటూ వాటి తీరుతెన్నులు పరిశీలించాలని అనుకున్నాను, అప్పుడే గమనించాను "చ" అనే కంపెనీ షేర్లను అమ్మే వాళ్ళకంటే కొనేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటప్పుడు దాని షేరు విలువ పెరగటం సహజం. అయితే "క" అనే కంపెనీ స్టాకులను కొనేవారి కంటే అమ్మేవాళ్ళు 3-4 రెట్లు ఎక్కువమంది ఉన్నారు, అయినా దాని విలువ ఆ రోజంతా పెరుగుతూనేఉంది. అంతేకాదు "చ" కంటే "క" విలువ బాగా పెరిగింది ఆ రోజు. దీని బట్టి కంపెనీ షేర్ల విలువలు కొనటం/అమ్మటం మీద మాత్రమే ఆధారపడవని తెలుసుకున్నాను. మరింకా వేటిమీద ఆధారపడతాయనే ఇంకో పెద్ద ప్రశ్న మిగిలిపోయింది :(
సరే ఇంక ఇక్కడ చర్చించుకోదగ్గ ఇంకో విషయం ఏమిటంటే ప్రతి 5 నిమిషాలకొకసారి refresh బట్టన్ని నొక్కి షేరు విలువ ఎంత పెరిగిందో చూసుకోవటం మొదలు పెట్టాను. కూడలిని కూడా ఇన్నిసార్లు నేనెప్పుడూ refresh చేయలేదు!... ఇంకా ఏ షేర్లనూ కొనకుండానే ఇంతలా ప్రతీ ఐదు నిమిషాలకొక సారి చూస్తున్నానంటే మరి వందల సంఖ్యలో షేర్లను కొని అమ్మేవారి పరిస్తితి ఎలాగుంటుందో!... లేక కొత్తొక వింత, అన్నట్లు స్టాకు మార్కెట్టు క్లబ్బులో కొత్తగా జేరిన వాళ్లే ఇలాంటి విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారా?...
ఇదంతా అయిన తరువాత ఇంక పరిశీలించింది చాలనుకుని, ధైర్యం చేసి నా "బిగినర్స్ లక్కు"ను పరీక్షించుకుందామని అంతకుముందు తగ్గి ఇప్పుడు పెరుగుతున్న రెండు కంపెనీల షేర్లను తలా మూడు కొన్నాను... తీరా కొన్న ఐదు నిమిషాలలోనే షేరుకి ఐదు శాతం చప్పున వాటి విలువ పడిపోయింది... స్టాకు మార్కెట్టులో కనీసం "బిగినర్స్ లక్కు" కూడా పని చేయదని ఇంకో పాఠాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు వాటిని వదిలించుకుందామని ప్రతీ రెండు నిమిషాలకోసారి వాటి విలువలోని హెచ్చుతగ్గులను పరిశీలించటం మొదలు పెట్టాను...

Monday, November 19, 2007
బెంగుళూరు - లాల్‌బాగ్
అసలు పరిమాణం
చాలా రోజుల క్రితం తీసిన పొటో ఇది, అప్పుడు సమయం లేక ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. రెండు మూడు రోజుల నుండి ఇక్కడ బెంగుళూరులో అసలు ఎండనేదే కనపడటం లేదు. మధ్యాహ్నం ఒంటిగంటా రెండు గంటలకు కూడా బాగా చలనిపిస్తుంది. ఆఫీసులో ఏసీ కంటే బయటే ఎక్కువ చలిగా ఉంది. నాలుగు వారాల క్రితం తీసాను ఈ ఫొటోను, అప్పుడు చూడండి ఎంత ఎండ ఉందో! బెంగుళూరు లాల్‌బాగ్‌లో ఇలాంటి కనువిందు కలిగించే దృశ్యాలు ఇంకా చాలా ఉన్నాయి, త్వరలోనే మరికొన్ని ఫొటోలు పెడతాను.
Subscribe to:
Posts (Atom)