mspaintని మనం అసలు వాడతామో లేదా తెలియదు కానీ, ఈ క్రింది వీడియో చూస్తే దానిలో కూడా మంచి మంచి బొమ్మలు గీయొచ్చేమో అని అనిపించక మానదు.
వీడియో చూడటానికి బొమ్మ మీద నొక్కండి. ఇక్కడ కూడా చూడొచ్చు.
స్నేహితులు పంపిన ఈ వీడియోని చూసి ఊరుకుంటే సరిపోయేది. ఏ క్షణాన చూసానో నాకు కూడా ఉత్సాహం వచ్చేసింది. ఇంకే ఆరు గంటల పాటు పాటుపడి ఈ బొమ్మ క్రింది గీసాను.
అలా ఆరు గంటల పాటు గీసిన తరువాత అర్థమయింది, నేను ఆ సమయాన్నంతా వృధాచేసానని. కాకపోతే ఒక విషయం తెలిసింది, mspaintలో బొమ్మలు గీయటం పెన్సిలు చెక్కటానికి గొడ్డలి వాడటంలాంటిదే అని. ఇంకో వీడియోని చూసిన తరువాత అర్ధమయ్యింది, ప్రోగ్రాములను రాయటానికి assembly, C, javaలు ఉన్నట్లు బొమ్మలను గీయటానికి కూడా mspaint, photoshop లాంటి సాఫ్టువేర్లు ఉంటాయని.
Thursday, April 12, 2007
Subscribe to:
Post Comments (Atom)
మీ ఆరుగంటల సమయం వృదా అయిందని బాదపడకండి, మీరు గీచిన బొమ్మ చాలా బాగుంది.
ReplyDeleteఅబ్బ! బొమ్మ భలే ఉంది. ఇంత చక్కటి బొమ్మ గీసి వృథా అంటారేమిటి? బొమ్మగీయడానికి Photoshop వాడాలని తెలుసుకున్నారు కదా?
ReplyDeleteప్రదీప్ గారు,
ReplyDeleteబహుశా "పని లేని మంగలోడు పిల్లి తలగొరిగాడట" అనే ప్రయోగం సరికాదనుకుంటా. అది "పని లేని మంగలోడు పిలిచి తలగొరిగాడట" అని ఉండాలనుకుంటా.
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com
చాలా బాగా గీశారు (అదే, బొమ్మలెండి). ముద్దొచ్చేస్తోంది. నేనింత బాగా ఎమ్మెస్ పెయింట్ ని వాడుకోగలనా ? అనిపిస్తోంది. ఇలా చెయ్యడం సమయం వృథా అని అపోహపడకండి. చేత్తో గీసి శ్కాన్ చెయ్యడం కంటే ఎమ్మెస్ పెయింట్ లోనో, కోరల్ డ్రాలోనో గీయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శ్కాన్ చేసినవాటిల్లో వాడిన రంగులకి Electronic glaze రాదు. తెఱ మీద డల్ గా ఉంటాయి. అదే ఇలాంటి అప్లికేషన్ తో గీసినవాటికి మంచి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. ఏమంటారు ?
ReplyDelete