Wednesday, March 28, 2007

ఇది మీరు నమ్మాలి

దాదాపు 7,50,00,000 సంవత్సరాలకు పూర్వం జరిగిన కధ ఇది. 26 నక్షత్రాలు వాటిలో ఉన్న 76 గ్రహాలను, తీగీయాక్ అనే రాజ్యాన్ని, జిను అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అందులో మన భూగ్రహం కూడా ఉంది. కొంత కాలానికి అన్ని గ్రహాలలో జనాభా బాగా పెరిగి పోయింది. ఒక్కొక్క గ్రహంలో సుమారు 17800 కోట్ల జనాభాతో గ్రహాలు మరీ భారీగా తయారయ్యాయి. అప్పట్లో ప్రజల నాగరీకత అచ్చం మన నాగరికత లాగానే వర్ధిల్లుతుంది. మనమేసుకునే బట్టలనే వేసుకునే వాళ్ళు. మనం ఉపయోగించినట్లే రైళ్ళు, కార్లు, బస్సులు లాంటి వాహనాలను కూడా ఉపయోగించేవాళ్ళు.

మరి కొన్నాళ్ళకు జెను అధికారం కోల్పోయే సమయం ఆసన్నమయ్యింది, అప్పుడు తను అధికారం చలాయిస్తున్న అన్ని గ్రహాలలో ఉన్న అధిక జనాభాను నిర్మూలించాలని అనుకున్నాడు. సైకియాట్రిస్టుల సాయంతో కోత్ల మంది ప్రజలను మత్తు మందు ఇచ్చి నిర్వీర్యులను చేసాడు, వీరందరినీ ఆదాయపు పన్ను పరిశీలన అనే ముసుగులో పిలిచి, వారిని అక్కడ నుండి అపహరించి వారందరినీ చంపేయటానికి భూగ్రహానికి తరలించాడు. అలా భూగ్రహానికి తరలించిన జనాలందరినీ ఇక్కడ ఉన్న అగ్ని పర్వతాల చుట్టూ పేర్చాడు. ఈ అగ్ని పర్వతాలను హైడ్రోజను బాంబులతో నింపి, వాటన్నిటినీ ఒకే సారి పేలుస్తాడు. దాంతో ఇక్కడకు తరలించిన ప్రజలందరూ చనిపోతారు. ఏవో కొందరివి శరీరాలు వాత్రం మిగులుతాయి.

శరీరాలు లేని ఈ ఆత్మలన్నీ ఆ వ్స్పోటనానికి చల్లాచదురై గాలిలో అలా తేలుతూ ఉంటాయి. జెను సైనికులు వాటన్నిటినీ ఒక ఎలక్ట్రానిక్ రిబ్బను ఉపయోగించి బంధిస్తారు. అలా బంధించిన ఆత్మలను భూమి చుట్టూ ఉన్న సూన్యంలోకి పీల్చేస్తారు. వేల కోట్ల సంఖ్యలో బంధించిన ఈ ఆత్మలకు ఒక 3-D సినిమాను 36 రోజులపాటు చూపిస్తారు. అలా 36 రోజుల పాటు సినిమాను చూసిన ఆత్మలు తమ అస్తిత్వాన్ని మరిచి పోతాయి, లేనివాటిని ఉన్నవాటిగా భ్రమిస్తాయి, సినిమాలో చూసినదే నిజమయిన ప్రపంచంగా భావించటం మొదలుపెడతాయి. ఇలా కొత్త కొత్త నమ్మకాలతో ఉన్న ఈ ఆత్మలను విడిచి పెట్టేసిన తరువాత అవి గుంపులు పుంపులుగా ఏర్పడతాయి. సినిమా ప్రభావం వలన అవి తమ మధ్యన ఉన్న తేడాను కూడా గుర్తించలేవు. అలా ప్రతీ గుంపూ, పేలుడు తరువాత మిగిలిపోయిన శరీరాలలోకి వెల్లిపోతాయి. ఒక్కొక్క గుంపుకు ఒక్కో శరీరం ల్కభిస్తుంది. ప్రతీ గుంపులో వేలకొద్దీ ఆత్మలు ఉంటాయి.


ఇది జరిగిన కధ, ఈ ఆత్మలు ఇప్పుడు కూడా చాలా మంది శరీరాలను అంటిపెట్టుకుని ఉన్నాయంట. అలా అంతిపెట్టుకుని అందరినీ బాధిస్తున్నాయంట, అంతే కాదు మీకు కలిగే చాలా సందిగ్ధాలకు కారణం కూడా ఈ పిచ్చి పట్టిన ఆత్మలేనంట. అయితే ఈ ఆత్మలు Scientologists అనే వారిని ఏమీ చేయలేవంట, ఎందుకంటే వాళ్ళందరూ తమతమ శరీరాలనుండి ఈ ఆత్మలను తొలగించేసుకున్నారంట. అంటే మనం రామాయణ మహాభారతాలను నిజంగానే జరిగాయని ఎలా నమ్ముతామో, ఈ Scientologistలు కూడా పైన చెప్పిన ఆ కధను కూడా నిజంగా జరిగిన కధే అని నమ్ముతారు. అంతే కాదండోయ్ అమెరికాలో Scientologyని 1993లోనే ఒక మతంగా గుర్తించేసారు కూడా.

7 comments:

 1. పిచ్చి పలు విధాలు.

  --ప్రసాద్
  http://blog.charasala.com

  ReplyDelete
 2. ఈ కధంతా మీరు రాసారా.,ఎక్కడన్నా చదివారా? చదవటానికి వరకూ బావుంది.,.,కానీ నమ్మలేకపొతున్నాను..spielberg సినిమా లాగ ఉంది.,.,కొంపతీసి april 1st హడావుడిలో భాగం కాదు కదా??

  ReplyDelete
 3. కథ సంగతేమొ నాకు తెలియదు కానీ, మేము ఈ church of scientologyకి 2-3 projects చేసాము, చేస్తాము కూడా. మా వాళ్ళందరు jokes వేసుకుంటుంటారు. "నేనొక్కిడినే client meetingకి వెళ్ళను, నన్ను కలిపేసుకుంటారు" అని, "client meetingకి వెళ్తున్నావు, మళ్ళీ నిన్ను చూస్తామో లేమో" అని. ఊర్లో (మా ఊళ్ళో కాదు) ఒక part అంతా వీళ్ళదే. అంతా యూనిఫారాల్లో తిరుగుతుంటారు. మా కొలీగ్ వాళ్ళ wife కూడా follower. పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంది followers/believers ఉంటారంట, including Tom Cruise and others.

  ఇది మన అధ్యాత్మిక/spiritual centers లాంటిదా అనుకునేదాన్ని, కాని మరీ ఇంత science (hydrogen bombs దగ్గెరనుంచి), "spirits" ఉన్న విషయం నాకు తెలియదు.

  ReplyDelete
 4. @ప్రసాద్
  అవునండి బాబు.

  @pavan kommireddi
  కధను నేను వికీపీడియా నుండి తీసి అనువాదించాను. అసలు సృస్టికర్త రాన్ హబ్బార్డ్. అతను మొదట్లో రాసిన సైన్సు ఫిక్షను నవలలు, బాగా ప్రచారం పొంది, తరువాత ఒక మత్తాన్నే సృస్టించే స్తాయికి ఎదిగి పోయాయి.

  @చేతన
  అయితే మీరు Trapped in the Closet అనే వీడియోను చూడాల్సిందే. ప్రాజెక్టులు చేసామన్నారు, ఏ ప్రాజెక్టులు? వాళ్ళ Scientology e Meterని ఆదునీకరిస్తున్నారా ఏమిటి?

  ReplyDelete
 5. బాబొయ్ ఎంటండి ఇది నిజమా?:-((
  http://gannarapu.wordpress.com

  ReplyDelete
 6. మీరు నమ్మి తీరాలని చెప్పినా నేను నమ్మలేకపోతున్నాను.కానీ మన పురాణ కధలలానే అని ఒక మాట పెట్టేసారు కాబట్టి నమ్మాలనిపిస్తుంది.మన కదలు కూడా చాలా నమ్మలేనంత గా వుంటాయి కదా.

  ReplyDelete
 7. పురాణాల చుట్టూ అల్లిన సైన్స్ ఫిక్షన్ కథ లా ఉంది.

  ReplyDelete