Tuesday, March 20, 2007

300

వాళ్ళు 300 మందే, కానీ 1000000 మంది శత్రు సైనికులను ఎదుర్కుంటారు. "Lord of the Rings" తరువాత సాంకేతిక పరంగా అంత అత్భుతమైన సినిమా అంటే ఇదే. ట్రెయిలర్స్ చూసిన తరువాత సినిమాలో నిరాశ పరుస్తాడేమో ఉనుకున్నాను. కానీ సినిమా ట్రెయిలర్స్ కంటే కూడా చాలా బాగుంది. "Sin City" సినిమాని నచ్చిందంటే మీకు ఈ సినిమా కూడా నచ్చి తీరాలి. ఈ సినిమాని నిజంగా ఒక కళా కండం అని చెప్పొచ్చు.


ఒకప్పటి గ్రీకులో జరిగిన సంఘటనకు కొంత కల్పన జోడించి ఈ సినిమాను రూపొందించారు. స్పార్టా అనేది ఒక చిన్న గ్రీకు పట్టణం. ఆ పట్టణంలో యువకులు యుద్దంలో మరణం ఒక అందమయిన మరణంగా భావిస్తారు. పుట్టినప్పటి నుండి వారిని యుద్దానికి పనికి వస్తారా-రారా అనే పరీక్షిస్తూ ఉంటారు. అప్పట్లో పెర్శియా ఒక బలమయిన రాజ్యం. అప్పటికే 1000 రాజ్యాలను జయించి గ్రీకు దేశాన్ని కూడా తనలో కలుపుకుందామని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే స్పార్టాను లొంగిపొమ్మని దూతలను పంపుస్తాడు. కానీ స్పార్టా రాజు అయిన లియోనిదాస్ దానికి ఒప్పుకోడు, ఫలితంగా ఈ యుద్దం.

ఈ సినిమాలో చూపించినంత ఎర్రగా, రక్తాన్ని ఇంకో సినిమాలో చూపించలేరేమో. అందుకనే నేను కూడా ఈ జాబును ఎర్రగా రాస్తున్నాను. నిజమయిన యుద్ద వాతావరనాని చూపిస్తారు సినిమాలో. శత్రు సైనికుల శవాలతో కొండనే తయారు చేస్తారు ఆ 300ల మంది. బాణాల వర్షం వళ్ళ ఏర్పడే నీడలో యుద్దం చేస్తారు. తలలు చేతులు కాళ్ళు అన్నీ అలా తెగి పడుతూనే ఉంటాయి. వయలెన్సుకి తాతలాంటిది ఈ సినిమా. ఈ సినిమాలో చూపించినంత హింసను నేను ఇంకో సినిమాలో చూడలేదు. మాంసాన్ని కోస్తున్న శబ్దమే వినపడుతుంది. అంత హింస ఉన్నాకూడా ఈ సినిమా మీద నాకు వ్యతిరేకత రాలేదు, పైగా ఇంకోసారి చూడాలని అనిపిస్తుంది.


ఈ సినిమాలో చాలా బాగాన్ని స్టూడియో లోపలే నీలిరంగు బెక్గ్రవుండ్‌లో తీసి, ఆ తరువాత దానిమీద బోలెడంత గ్రాఫిక్‌వర్క్ చేసారు. అందుకనే మనకు సినిమా చూస్తున్నంత సేపు వేరే లోకాన్ని చూస్తున్న ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ సినిమాను తియేటరులోనే చూడండి, DVDల కోసం వేచి చూడొద్దు. చూసినా మీరు హాలులో చూసినప్పుడు పొందే అనుభూతి పొందలేరు. ఈ చిత్రం ఈ యేటి మేటి చిత్రంగా ఆస్కారు అవార్డు పొందినా ఆశ్చర్యం లేదు.

యుట్యూబులో ఈ సినిమా ట్రెయిలరు చూడొచ్చు. ఈ ట్రెయిలరులో పిల్లలకు ఆమోదయూగ్యం కాని సన్నివేశాలు ఉండొచ్చు.

అంతే కాదు ఈ సినిమాకు ఇరానులో అప్పుడే వ్యతిరేకత కూడా మొదలయ్యింది. http://www.youtube.com/watch?v=H41h994hF6I

2 comments:

  1. your review is superb. after reading ur review even i want to see this movie. have u seen ' the last king of scotland'. this movie also good, just chekout.

    -famus

    ReplyDelete
  2. గత నాలుగు రోజులు గా చూస్తున్నా ఎవరూ రాయలేదేంటబ్బా ఈ సినిమా గురించి అని ..మొత్తానికి మీరు రాసారు !!
    ఈ సినిమా గురించి నేను ఆల్ మోస్ట్ 1 1/2
    ఇయర్ నుంచి వెయిటింగ్ !! మొత్తానికి రిలీజ్ అయిన రోజే చూసాననుకోండి !!

    "Sin City" సినిమాని నచ్చిందంటే మీకు ఈ సినిమా కూడా నచ్చి తీరాలి
    అది నచ్చని వాళ్ళకి కూడా ఇది నచ్చి తీరుతుంది డౌటే లేదు !!

    ReplyDelete