కొత్త సంవత్సరాన్ని నేను ఉదకమండలంలో జరుపుకున్నాను. ఆలా వెళ్ళినప్పుడు తీసిన ఫొటోలలో ఇవి కొన్ని. మరిన్ని ఫొటోల కోసం ఈ లింకును సందర్శించండి.
నా ఈ బ్లాగును కూడా చదివే వారు ఉన్నారు అని, ఇవా ఒక్క రోజులోనే వచ్చిన నాలుగు వ్యాఖానాలను చూస్తే తెలిసిపోయింది. అందుకనే ఒక బ్లాగు పాఠకుడు వ్యాఖానించినట్లుగా ప్రతీ చిత్రానికి కొంత సమాచారాన్ని చేర్చాను.
ఊటీ దగ్గరలోనే కూనూరు అనే ఇంకో అందమయిన ప్రదేశం ఉంటుంది. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక టీ ఫ్యాక్టరీ చూడటానికి వెళ్తున్నప్పుడు మార్గమంతా మనం ఇలాంటి అందమయిన టీ తోటలు చూడవచ్చు.
అసలు పరిమాణం
ఈ సూర్యోదయం ఫొటో కాదు, సూర్యాస్తమయం ఫొటో. మధ్యానం 4 గంటలకు తీసాను. టీ తోటల మొక్కలతో పాటుగా మధ్యలో ఇలా కొన్ని ప్రత్యేకమయిన చెట్లు కూడా పెంచుతారు. అవి వర్షపునీటిని తమ వేర్లలో దాచుకుని టీ మొక్కలకు అందిస్తూ ఉంటాయంట. కాబట్టే టీ మొక్కలకు ప్రత్యేకంగా నీటి సరఫరాలంటిదేమీ ఉండదు.
అసలు పరిమాణం
ఏనుగు కాలు చెట్టు (Elephant Leg Tree)... ఈ చెట్టు పేరుకు తగ్గట్లుగానే అచ్చం ఏనుగు కాలులాగానే ఉంటుంది. కూనూరు లోనే సింస్(sims) పార్కులో ఈ చెట్టును మనం చూడవచ్చు. ఫొటోలో కనపడటంలేదుకానీ ఈ చెట్టు చాలా ఎత్తు ఉంటుంది. ఇద్దరు ముగ్గురు పక్క పక్కనే నుంచుంటే ఉండేటంత లావు ఉంటుంది ఈ చెట్టు.
అసలు పరిమాణం
మైసూరు నుంది ఊటీ వెల్తున్నప్పుడు కొంతదూరం తరువాత ఘాట్ రోడ్డు ప్రారంభమవుతుంది. మొంత్తం 36 మలుపులు(hairpin curves) ఉంటాయి. వాటిని ఎక్కేసరికి బండి ఇంజిను బాగా వేడెక్కిపోతుంది. అందుకనే బండికి నీళ్ళు తాగించటానికి మధ్యలో ఆపుతూ ఉంటారు. ఆలా ఆగినప్పుడు ఈ చెట్టు కనిపించింది. ఎందుకో తెలీదు కానీ ఈ చెట్టు, దాని వెనుక నీలి ఆకాశం నాకు చాలా బాగా నచ్చింది.
అసలు పరిమాణం
ఇది ఊటీ సరస్సు. ఈ సరస్సులో మనం బోటులో షికారు చేయవచ్చు. ఊటీలో ఇది ఒకానొక ప్రధాణాకర్షణ.
అసలు పరిమాణం
కూనూరు దగ్గరి టీ తోటల చిత్రాలు ఇంకొన్ని.
అసలు పరిమాణం
వీటన్నిటినీ నేను మధ్యానం తీసాను. అయినా కూడా మంచు పోలేదు. అసలు అవి మేఘాలేమో... కూనూరు ఊటీ రెండూ ఎత్తయిన కొండల మీద ఉంటాయి కదా...
అసలు పరిమాణం
సాయంత్రం 4 తరువాత ఇలా కొంచెం ఎండ కాసింది. అప్పటిదాకా ఉన్న చలివల్ల కావచ్చు ఎండ పడేసరికి చాలా హాయిగా అనిపించింది.
అసలు పరిమాణం
ఫొటోలో సరిగ్గా రాలేదు కానీ, ఇది చాలా పెద్ద లోయ.
అసలు పరిమాణం
ఇది టీ మొక్క కాదు, అసలు ఈ మొక్కకూ, ఊటీకి సంబందమే లేదు. మైసూరు నుండి ఊటీ వెల్తున్నప్పుడు మధ్యలో బోజనానికి ఆగాము. అక్కడ ఈ గడ్డి మొక్క కనిపిస్తే ఒక ఫొటో తీసాను. ఈ మొక్క పేరు కూడా నాకు తెలియదు.
అసలు పరిమాణం
హోటలు దగ్గర కనిపించిన ఈ పూలను బాగున్నాయని తీసాను కానీ నాకు ఈ పూల పేర్లు తెలీదు. ఊటీ ఉధ్యానవనంలో కూడా ఇవే పూలను ఒక చోట చూసాను.
అసలు పరిమాణం
ఊటీ ఎత్తయిన కొండలలో ఉన్న ఒక చిన్న లోయ. ఈ ప్రాంతమంతా కొండలలో చుట్టుముట్టి ఉంటుంది. అలాంటి ఒక కొండపైకెక్కి తీసిన చిత్రమిది. మొత్తం ఊటీ కాకపోయినా, ఏదో కొంత ప్రాంతం వచ్చింది, ఈ ఫొటోలో...
అసలు పరిమాణం
ఊటీ వెళ్ళినప్పుడు తప్పకుండా చేయవలసిన పని ఇది. ఊటీ నుండి కూనూరుకు వెళ్ళటానికి ఒక ఒక రైలు బండి ఉంటుంది. ఎప్పుడో బ్రిటీషువాళ్ళ కాలంలో వేసిన పట్టాల మీద, దాదాపు అంతే పాతదయిన రైలు తిరుగుతూ ఉంటుంది. ఇది కేవలం పర్యాటకుల కోసమే తిరిగే రైలు. మెల్లగా ఒక మనిషి పరిగెత్తేటంత వేగంతో వెళ్తూ 20 కిమీల దూరాన్ని 2 గంటలలో తీసుకుని వెళ్తుంది. అలా మెల్లగా తీసుకుని వెళ్ళటం వలన దారిలో ఉన్న ప్రకృతి దృశ్యాలను మనం చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఈ రౌలు ప్రయాణంలోనే మేము దాదాపు 100 ఫొటోలు దాకా తీసుకున్నాము. మద్య్హలో రెండు మూడు సొరంగమార్గాలు, ఇరువైపులా అందమయిన లోయలతో ప్రయానిస్తున్నంత సేపు, చాలా మంచి అనుభూతిని పొందవచ్చు.
అసలు పరిమాణం
అర్ధరాత్రి 3 గంటలకు మైసూరులో ఒక నిర్మానుష్యపు రోడ్డులో తీసిన ఫొటోఇది...
అసలు పరిమాణం
మైసూరు నుండి ఊటీకి వెళ్తున్నప్పుడు వచ్చే ఒక మలుపు ఇది.
అసలు పరిమాణం
నగరాలలో యాంత్రిక జీవితానికి, రణగొణ ద్వనులకు అలవాటు పడిపోయిన వాళ్ళకు ఇలాంటి అందమయిన ప్రదేశంలో ఇలా ఒక ఒంటరి ఇల్లు కనిపిస్తే ...
అసలు పరిమాణం
టీ కాకుండా ఇక్కడ ఇలా వేరే పంటలు కూడా పండిస్తారు మరి.
అసలు పరిమాణం
ఈ ఫొటో చూసినప్పుడు గుర్తుకు వచ్చింది, ఊటీలో నీటికొరత. అందుకనే అక్కడ నీటిని చాలా జాగ్రత్తగా వాడు కుంటారు.
అసలు పరిమాణం
Thursday, January 04, 2007
Subscribe to:
Post Comments (Atom)
ఫోటోలు చాలా బావున్నాయండి...
ReplyDeletecaalaa baagunnayamdi.
ReplyDeleteచాలా బాగున్నాయి. ఒక ఫోటో అయితే ఆకాశం అంత నీలంగా వుంటుందా అనిపించింది.
ReplyDelete--ప్రసాద్
http://blog.charasala.com
మంచి ఫోటోలు. ప్రతిఫోటోకూ మీ మనసుకు తోచిన చిన్న వ్యాఖ్య రాయగలిగితే, ఆ పోటో సౌందర్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని మీరు అంగీకరిస్తారా?
ReplyDelete@ప్రవీణ్, @radhika, @ప్రసాద్
ReplyDeleteనా ఫొటోలు మీకు నచ్చినండుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు...
@ramanadha reddy
మీరు చెప్పినది నిజమే, కానీ నా మనసుకు తోచినది రాయడమంటే కొంచెం కష్టం. కాకపోతే ఆ ఫొటోలను వివరిస్తూ ఇంకొంచెం సమాచారాన్ని అందిస్తాను.
వ్యాఖ్యలు, చాయా చిత్రాలు ఒకదానికి మరొకటి complementary గా బాగున్నాయి. చిత్రాల composition బాగుంది. బెంగళూరు లో తెలుగు మిత్రుల సమావేశం జరపాలని అకాంష.మీ e-mail, address and telephone numbers తో ఒక జాబు నాకు గాని, తెలుగుబ్లాగ్ గుంపుకు కాని రాయగలరా?
ReplyDeleteఫోటోలు చాలా బావున్నాయండి. keep it up.
ReplyDeleteమీ ఫోటోలు చాలా బాగున్నాయి. మీరు వాడిన కేమెరా నా దగ్గర వున్నా, ఇంత బాగా తీయవచ్చును అని నేను ఊహించలేదు!
ReplyDeleteమెచ్చుకోదగ్గ ఫొటోలండి.. చాలా బాగున్నాయి.. :-)
ReplyDeletePhotos chaalaa baavunnaayi Pradeep. vaaTiki explanation ivvaTam kUDaa baagundi. intakU mIru ye camera ni use chEsaaru?
ReplyDeleteఫోటోలు చాలా బావున్నాయండి.ఈ రోజే మీ ఫోటోలు చూసాను.ఒకసారి మరలా నన్ను ఊటీకి తీసుకువెళ్ళారు. నేను కోయంబత్తూరులో చదివేటప్పుడు ఊటీ చాలా సార్లు వెళ్ళాను, తరువాత పెళ్ళి అయ్యాక మొదటి సారి మేము వెళ్ళింది కూడా అక్కడికే. మీ ఫోటోలు నన్ను కాసేపు గతకాలపు జ్ఞాపకాలలొకి తీసుకువెళ్ళాయి.అక్కడ దొడబెట్ట అని ఎత్తైన ప్రదేశం ఫోటో పెట్టటం మరిచిపొయినట్లున్నారు. ఏమైనా వ్యాఖ్యానాలతో కూడిన మీ ఫోటోలు చాలా బాగున్నాయి.
ReplyDelete@venu
ReplyDeleteనేను "Sony DSC P200" కెమరాను వాడతాను.
@సిరిసిరిమువ్వ
మర్చిపోవటం కాదు. నేను అక్కడికి వెళ్ళలేదు. మాకు టైము సరిపోలేదు అక్కడికి వెళ్ళటానికి.