ఒక వారం రోజుల నుండి ఈనాడు పేపరు అసలు చదువుతునట్లే లేదు. ఎందుకంటారా అక్కడ శ్రీదర్ గారి కార్టూన్లు రావటం లేదు మరి. ప్రతీ రోజు ఐదారు సార్లు ఆ పేజీ తెరిచి చూస్తున్నాను శ్రీదర్ గారి కార్టూను ఉంటుందేమోనని. కానీ ప్రతీ సారీ నన్ను నిరాశపరుస్తూ అక్కడ ఎటువంటి కార్టూనూ కనపడటంలేదు. అందరూ నెట్‌లోనే చదివేస్తూ, అసలు పేపరుని ఎవరూ కొనడం లేదేమోనని, ఇంటర్‌నెట్ ఎడిషన్‌లో కార్టూన్లను తొలగించేసారేమోనని మొదట అనుకున్నాను. అందుకని మొన్న బెంగలూరు వెళ్ళినప్పుడు అక్కడ ఈనాడు పేపరు కొన్నాను. ఉహూ అందులో కూడా శ్రీదర్ గారి కార్టూన్లు ఇవ్వలేదు.
అసలు సగం మంది తెలుగువారు ఈనాడు పేపరుని శ్రీదర్‌గారి కార్టూన్ల కోసమే కొంటారంటే అతిశయోక్తి కాదేమో. అట్లాంటి సగం మందిలో నేనూ ఒక్కడిని. మొటమొదట శ్రీదర్ గారి కార్టూన్ని చదవందే వేరే వార్తలు చదవాలని అనిపించదు. మరి అట్లాంటి కార్టూన్లకు మంమల్ని బానిసలుగా చేసి ఇలా చెప్పాపెట్టకుండా ఆపేయడం (తాత్కాలికంగానయినా సరే) ఏమయినా భావ్యమా. ప్రస్తుతానికయితే ఈనాడు అర్చీవ్స్‌లో ఉండే పాత కార్టూన్లను మళ్ళీ మళ్ళీ చదివి కాలం గడుపుతున్నాను.
శ్రీదర్ గారు మీరు ఏమి చేస్తున్నాగానీ వెంటనే మళ్ళీ తమ బ్రషులను పట్టుకొని చకచకా కార్టూన్లు గీయాలని నా మనవి. మీ కార్టూన్ల కోసం నాలాంటి వీరాభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.
Wednesday, March 29, 2006
Monday, March 27, 2006
తగిన శాస్తి aka Tit for Tat
ఇవాళ బెంగళూరులో ఏదో పనిబడి అక్కడి బస్సులో ప్రయానిస్తున్నాను. అటూ ఇటూ తిరగవలసిన పని కాబట్టి ఒక రోజు పాసు(Rs.25) తీసుకున్నాను. ఆ బస్సుకు వేరేగా కండక్టరు లేడు. డ్రయివరే కండక్టరుగా వ్యవహరించి టికెట్లు జారీ చేస్తున్నాడు. చాలా మంది ఉండటం వలన నేను ఇచ్చిన 100 రూపాయిలకు చిల్లర తరువాత ఇస్తానని చెప్పాడు. నేను సరేనని ఎట్లాగూ ఆ బస్సు చివరి స్టాపు వరకు వెళ్ళాలి కాబట్టి దిగేముందు తీసుకోవచ్చు కదా అని అనుకున్నాను.
స్టాపు వచ్చింది. నేను డ్రయివరుగారి దగ్గరకు వెళ్ళి నాకు రావలసిన Rs.75 గురించి అడిగాను. నా చేతిలో 5/- పెట్టి "ఎస్టు కొటిదవు" అని ఏదో అడిగాడు. బహుషా ఎక్కడ ఎక్కానో అరాతీస్తున్నాడేమో, రెండు మూడు సార్లు అడిగినా తరువాత అతనికి నేను ఎంత ఇచ్చాను అనేది అరాతీస్తున్నాడేమో అని సందేహం వచ్చి 100 అని చెప్పాను. తరువాత నాటికెట్టు తీసుకుని దానిని పరిశీలించి ఇంకో 5/- నా చేతిలో పెట్టాడు. టికెట్టును మరల ఇంకో సారి పరిశీలించి నాచేతిలో ఉన్నా 5+5=10/- తీసుకుని 80 రూపాయిలు నాచేతిలో పెట్టాడు.
75/- ఇవ్వాల్సిన చేట 80 ఎందు కిచ్చాడా అని ఆలోచిస్తుంటే, బస్సు మళ్ళీ నిండటం మెదలు పెట్టింది, నేను దిగిపోయాను. అందుకనే ప్రతీ బస్సులో కండక్టరు వేరేగా ఉంటే బగుంటుంది, ఇదిగో ఇలా ఎక్కువ డబ్బు ఎచ్చేవాడు కాదుగదా అని నేను ఆలో చిస్తుంటే అప్పుడు నాకు తట్టింది. నా టిక్కెట్టు ఆ డ్రయివరు దగ్గరే ఉంది అని. బస్సేమో వెళ్ళిపోయింది. ఒకరోజు పాసు కాబట్టి దానిని మళ్ళీ ఇంకోళ్ళకు అమ్ముకోవచ్చు.
ఇంతకీ ఇక్కడ బకరా ఎవరు, మళ్ళీ టికెట్టు కొనుకున్న నేనా, ఎక్కువ డబ్బు ఇచ్చిన డ్రయివరా, లేక ఇద్దరమూనా.
Today when I started my journey in Bangalore, I bought a day pass worth Rs.25. The bus does not have a conductor. Driver is also issuing the tickets. He told me that he will be giving the change for the 100 I have given to him, when I get down. As my destination is the last stop of this bus, I did not bother much about it.
The stop has come. Asked the driver about my 75/-. He put a 5/- in my hand and asked "esTu koTidavu"(kannaDa). I thought he is asking me about where I got into the bus. He aske the same question for two more times. Then, I guessed that he was asking how much I have paid him innitially. He took my ticket and observed it and put another 5/- in my hand. Immidiately he observed the ticket once again and then replaced the 5+5=10/- with 80/-.
But why did he give me 80/- instead of 75/-. As the bus started to fill up, I got down from the bus. I started thinking, about why he gave me 80/-. May be because he got confuseddoing the double duties. But wait, where is my ticket. It is still there with the driver, he has not returned to me back after his observation. And there is a possibility that he can still sell that ticket to some other person as it is a day pass.
So, who is the "bakara" here. Me, because I had to buy another ticket; the driver, who has returned me excess fare; or is it both of us.

Thursday, March 16, 2006
దెయ్యమా?.. aka Is it ghost!...
ఇవాళ, ఎందుకనో నేను ఇప్పటి వరకు తీసిన ఫొటోలను ఒక సారి తిరగేయాలని అనిపించింది. ఇదిగో అప్పుడే ఈ ఫొటో కనిపించింది. దీనిని నేను ఎటువంటి మార్పులు-చేర్పులు చేయలేదు. మరి అక్కడ ఉన్న ఆ ఆకారం ఏమిటి మరి. ఈ ఫోటోను నేను మొన్నామధ్య తమిళనాడు వెళ్ళినప్పుడు, ఈరోడ్ జంక్షనులో ఇంకో రైలు కోసం ఆగినప్పుడు తీసాను. గమనించారా అక్కడ ట్రాలీ మీద ఏదో పొగ, మనిషి పోలిన ఆకారం ఒకటి ఉంది. కనిపించిందా. మనకు అప్పుడప్పుడు ఈమెయిల్లలో వచ్చే దెయం ఫొటోలాగే ఉందికదా. ఫోటో లోపలికి ఆ ఆకారం ఎలా వచ్చింది చెప్మా!!. బహుశా ఈరోడ్ జంక్షనులో ఏదయినా దెయ్యం ఉందేమో. అదే ఇలా నా ఫొటోలో వచేసిందేమో...

మరదే, ఇంకా నేను పూర్తిగా చెప్పక ముందే అలాంటి సందేహాలకు తావివ్వకూడదు. నేను ఈ ఫొటో ఎలా తీసాను అని మరిచి పోయుంటే నేను కూడా మీలాగే ఆలోచించేవాడినేమో. కానీ నేను మరిచిపోలేదు కదా మరి. ఈ ఫొటోను తీస్తునప్పుడు స్టేషనులో కొంచెం చీకటిగా ఉంది. అందుకని కెమెరా షట్టర్ వేగాన్ని కొంచెం తగ్గించి, టైమర్ పెట్టి తీసాను ఇంతలో నా మిత్రుడు నేను రైలు ముందు నుంచుని ఫొటో దిగుతానని చెప్పి ఇదిగో ఇలా అటూ ఇటూ తిరిగాడు. దాని ఫలితమే ఫొటోలోని ఆ వింత ఆకారం.
మరిచే పోయాను ఈ బ్లాగులో ఇది నా 50వ రచన. మొదలు పెట్టిన 20 నెలల తరువాత 50 కి చేరుకున్నాను, 100ను చేరుకోవాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి. అప్పుడప్పుడు ఇంగీషులో రాస్తూ అప్పుడప్పుడూ తెలుగులో రాస్తూ, ఈ మధ్యనే రెండు భాషలలో రాయటం మొదలు పెట్టాను మరి. పైన ఉన్న View in English - Beta చూడండి. ఇలా రెండు భాషలలో రాయటం ఎన్నిరోజులు కొనసాగుతుందో చూద్దాం మరి.
In English: Today, I felt like scanning through the photos I have taken with my camera. That is when I came across this photo. I shot this photo when we were waiting for a train in erode junction. You might have already observed that there is some kind of fog taking the shape of a man. I assure you that there arent any editings in photoshop or similar software. Then how did the weird shape come into the picture. You might be thinking that there might be some ghost in that railway station. And some how it appeared in this photo.

No, you should listen to the complete story before coming to a conclusion. If I forgot how I took this photo then I would have come to a similar conclusion like you people. But luckily I did not forget that. While I was taking this photo there is a bad light in the station and I have to adjust the camera to a slower shutter speed and then set the timer to take the photo, meanwhile, one of my friend started wakling in between. Thats how the strange, wierd figure in the photo formed. So, no ghosts.
OH! I just forget to tell, this is my 50th post. Started this blog some 20 months ago. Though I thought to remind you all in my 100th post, I feared that it might take another couple of years. Till recently this blog featured posts in english and some times in Telugu language. Recently I started posting in both the languages simultaneously. You might have already noticed that, so you are reading this post in english. Any way once again see తెలుగులో చదవండి - నిర్మాణంలో ఉన్నది at the top. Lets see how long I will be posting in two languages.

Subscribe to:
Posts (Atom)