
ఇంతకు మునుపు ఇక్కడ వాచ్‌మ్యాన్ ఉన్నా కూడా అతను వచ్చి మా హాస్టలుబ్లాకు వరండాలో పొడుకునేవాడు, కానీ మొన్నటి బెంగులూరులో తీవ్రవాద దాడి తరువాత ఇదిగో ఇలా రాత్రంతా మేల్కొని ఉండవలసి వస్తుంది పాపం. ఇదొక్కటే ఎంటి కాలేజీలో ఇంకా చాలా ఆంక్షలు విధించేసారు. రాత్రి 10 తరువాత (అమ్మాయిలయితే తొమ్మిదికే) ఎవరూ కాలేజి లోపలినుండి బయటకు గానీ బయటనుండి లోపలికి గానీ వెళ్ళనివ్వటంలేదు. ఇంతకుమునుపు రాత్రంతా కాలేజీలో ఎవరో ఒకరు అలా తిరుగుతుండేవారు, ఎంతయినా ఇక్కడ సగంమంది నిశాచరులే. చీకటిపడిన తరువాత వాళ్ళకు ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. నేనూ వాళ్ళలో ఒకడిని. మరి మాలాంటి వాళ్ళగతేంగాను. "Night Canteen" కూడా 10 గంటలకే మూసేస్తున్నారు. అయినా ఇక్కడ ఏ కొత్తరూలు వచ్చినా వారం కంటే ఎక్కువ రోజులు అమలుచేయలేరు కదా.
No comments:
Post a Comment