Sunday, June 05, 2005

eMessenger

మీరు గనక Yahoo! Messenger అందుబాటులో లేని పరిస్తితిలో ఉనారా. అయితే మీకు eMessenger చాలా ఉపయోగపడుతుంది. మీరు దీనికోసం ఏ softwareని గానీ, appletని గానీ install చేయనవసరం లేదు. ఈ ప్రోగ్రాము కేవలం java script మాత్రమే వాడుతుంది. కాబట్టి మీరు firewall వెనక ఉన్నా పరవాలేదు, ఈ ప్రోగ్రాము వాడుకుని మీ మిత్రులతో సంభాషించవచ్చు.

ఈ విషయాన్ని నేను మొదట http://sixfaces.blogspot.com లో చూసాను.

Friday, June 03, 2005

"చిరునవ్వుతో" సినిమా గురించి

మొన్న సెలవలలో హైదరాబాదు కోఠీకి వెళ్ళాను. అక్కడ ఉన్న "Supreme House"లో original vcdలు 60/- రూపాయలకే అమ్మి నాతోటి కూడా మూడు vcdలను కొనిపించేసారు. అలా నేను కొన్నవాటిలో "చిరునవ్వుతో" ఒకటి. మొదటిసారి హాళ్ళో చూసినప్పుడు సినిమా బాగానే అనిపించింది కానీ, మరీ నిన్న చూసినంత లోతుగా చూడలేదు. సినిమాలో సంభాషనల మధ్యలో చాలా జీవితసత్యాలు దొర్లుతూవుంటాయి. మచ్చుకు కొన్ని ఇవిగోండి:

1. బాయ్ ఫ్రెండ్సు ఆడపిల్లల అందానికి కాంప్లిమెంట్సు - కధానాయిక షహీన్ తన కాబోయే భర్త ప్రకాష్ రాజుతో తన మగ స్నేహితులను పరిచయం చేస్తునప్పుడు చెబుతుంది. అప్పుడు వెంటనే నాకు ఒక సందేహం వచ్చింది. మరి గార్ల్ ఫ్రెండ్సు మగపిల్లలకు ఏమిటబ్బా ...

2. ఒక అమ్మాయి-అబ్బాయి ప్రేమించుకోడానికి ఎంత టయిం కావాలి, గంట కావాలా, వారం, నెల, సంవత్సరం చాలా. - ఈ విషయంలో మటుకు ప్రేమకు మాత్రమే సంబందించినది కాదు అనుకుంటా, ఒక వ్యక్తి మీద అభిప్రాయం ఏర్పరుచు కోవటం, అనే conceptకి generalize చేయొచ్చేమో. అందుకనేనేమో ఆంగ్లములో "first impression is the best impression" అనే నానుడి పుట్టుకొచ్చిందనుకొంటా.

3. చూడు పరిచయం అయిన వాళ్ళంతా స్నేహితులు కాలేరు, స్నేహితులందరూ ప్రేమికులు కాలేరు. నా స్నేహం నీకు ప్రేమగా అనిపించి ఉండొచ్చు, కానీ నీ పరిచయం మాత్రం నా వరకు స్నేహం దగ్గరే ఆగిపోయింది.

Thursday, June 02, 2005

Yahoo! MindSet

యాహూ ఈ మధ్యనే మైండ్ సెట్ అనే కొత్త సెర్చ్ కనిపెట్టింది. దీని వలన మనము వెతుకులాడుతున్న విషయము విజ్ణానమునకు సంభందించినదా లేక వ్యాపారమునకు సంబందించినదా అనే దాని మీద ఆధారపడి చూసుకోవచ్చు. ఈ కొత్త సెర్చ్ ఎలా వుంటుందో చూడాలని అనుకుంటుంటే మటుకు http://mindset.research.yahoo.com/కు వెళ్ళి చూడవలసిందేనండి. ఉదాహరణకు "Internet" అనే పదముతో సెర్చ్ చేసి చూడండి.
ఈ దెబ్బతో యాహూ మళ్ళీ తన సెర్చ్ ఇంజిన్ సామ్రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకుంటుందేమో. మరి గూగుల్ ఏమి చేస్తుందో చూడాలి.