ఒక్క నిమిషం: ఈ వ్యాసం కొన్ని నెలల క్రితం తెలుగు విద్యార్ధి అనే బ్లాగులో ఉంచబడినది. ప్రస్తుతం ఆ బ్లాగు నిరుపయోగంగా ఉండటం మూలాన, ఆ బ్లాగులో ఉన్న ఈ ఒక్కగానొక్క వ్యాసాన్ని ఇక్కడికి తరలించి, దానిని నిర్మూలించేసాను. అప్పటి వ్యాసానికి ఎటువంటి మార్పులు చేయలేదు, తేదీ మరియు సమయములతో సహా. ఇంక చదవండి...
మొదలు పెట్టిన చాలా రోజులకు ఒక పోస్టు రాస్తున్నాను. దానికి క్షమించాలి. అయితే ఇందులో ఏమి రాయాలని రెండు, మూడు రోజుల నుండి అందరితోటి మాట్లాడాను. కొంతమంది హాస్టలు గురించి రాద్దామన్నారు. మరికొంతమంది మెస్సు గురించి రాద్దామన్నారు. ఇంకొంతమంది, ఇదంతా అవసరమా అని నవ్వారు.
మరి బ్లాగు మొదలు పెట్టాక ఏదో ఒకటి చదవటానికి ఉండాలి కద, అందుకనే నిన్నటి సంఘటన తోనే మొదలు పెట్టాను. అసలే పరీక్షల సమయము, అందరూ తీరికలేకుండా చదివేస్తున్నారు. ఇంకో పది రోజులలో అవి కూడా అయిపోతాయి. అప్పుడు ఇంక చెప్పలేనంత తీరిక దొరుకుతుంది.
ఇది మొదటి బ్లాగు కాబట్టి మేము చదివే కాలేజీ గురించి చెబితే బాగుంటుందని తోచింది. NITKని అంతకుముందు KREC అని పిలిచేవారు. రెండు సంవత్సరముల క్రింద దీనిని NITKగా మార్చి deemed University హోదా కల్పించారు. KRECగా ఉన్నప్పుడు ఇతర రాస్ట్ర విధ్యార్ధులకు కోటా ఉండేది. ఆ కోటా ప్రకారం ఆంద్రప్రదేశ్ విధ్యార్ధులకు PGలో ఇద్దరికి మాత్రమే ప్రవేశము ఉండేది. ఇప్పుడు NITK అవటము వలన కోటా పద్దతికి స్వస్థి పలికారు. ఫలితముగా ఇప్పుడు కాలేజిలో ఎటు చూసినా తెలుగు విధ్యార్ధులే.
NITKకు ప్రక్కనే ఉన్న సముద్రము ఒక ప్రత్యేకత. పైగా ఈ కాలేజీ ఉన్న ప్రాంతము కర్ణాటకలో మంచి పర్యాటక కేంద్రము. ఒక పక్క udipi, Manipal. ఇంకో పక్క Manglore ఉంటయి. ఈ చుట్టు పక్కలలోనే చాలా గుళ్ళు, గొపురాలు ఉంటాయి. ఇక్కడ మేము గమనించిన ఒక విషయము, వీళ్ళు ప్రతీ పండుగను ఎంతో శ్రధ్ధగా జరుపుకుంటారు. సాంప్రదాయ నృత్యాలు వగైరాలయితే తప్పని సరిగా ఉండవలసిందే. ఇంకా పచ్చదనానికయితే అసలు లోటేలేదు.
దాదాపుగా సంవత్సరం పొడుగునా ఇక్కడ ఏదో ఒక function జరుగుతూనే ఉంటుంది. Crresendo అని, Incident అని, Techfest అని, ఇలా ఇక్కడ ఉన్న ప్రతీ క్లబ్బు సభ్యులు ఏదో ఒక function జరుపుతూనే ఉంటారు. అంటే దీని బట్టి student activities బాగానే ఉంటాయని మీరు అర్ధం చేసుకోవచ్చు.
కేంద్రంలో అధికారం మార్పు వలన ఈ మధ్యనే మా కాలేజి directorగారిని పదవి నుండి తప్పించారు. కొత్త directorని నియమించేవరకు తాత్కాలికంగా Prof H V Sudhaker Nayakగారు directorగా వ్యవహరిస్తున్నారు.
వచే పోస్టులో మా హాస్టలు గురించి మాట్లాడుకుందాం.
Sunday, April 17, 2005
Friday, April 15, 2005
సీ - {{వికిపిడియా}}
నేను వికిపిడియాకు 'సి' భాష మీద ఒక వ్యాసాన్ని మొదలు పెటాను. త్వరలో దానికి మరిన్ని మెరుగులు దిద్దితాను.
సీ - {{వికిపిడియా}}
సీ - {{వికిపిడియా}}
Sunday, April 10, 2005
GMail invite spooler
మీరు ఇంకా GMail ఇన్విటేషన్ కోసం ఎవరినీ అడగనవసరం లేదు. మీ GMail accountని ఇప్పుడే ఈ క్రింది సైట్లొ నుండి సంపాదించండి.
GMail invite spooler
GMail invite spooler
Thursday, April 07, 2005
Second Class
ఇది నా రెండో తరగతి ఫోటో. మొదటి తరగతి ఫొటో లేదు. ఈ క్లాసు గురించి నాకు అంతగా ఏమీ గుర్తుకులేదు. కానీ మంచి కంటే చెడు బాగా గుర్తుంటుంది. మాకు poetry అనే ఒక subject ఉండేది. మేడంగారు ఒక poemని అప్పచెప్పమన్నారు. ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకుని గబగబ అప్పచెప్పేస్తున్నాను. ఇంతలో ఎందుకో తల ఎత్తాను. ఎవరో నవ్వుతున్నట్లనిపించింది. అంతే మొత్తం poem అంతా మరచి పోయాను. అది అలా మొదలయిన "stage fear" నాకు BTech వరకు వదలలేదు. తరువాత చాలా కష్టం మీద ఆ భయాన్ని వదులు కున్ననులెండి. లేకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం కదా మరి.
Friday, April 01, 2005
Subscribe to:
Posts (Atom)