Thursday, May 22, 2008

In the name of God


ఈ సినిమా అసలు పేరు "ఖుదా కే లియే". ఇది నేను చూసిన మొట్టమొదటి పాకిస్తానీ సినిమా. అంతేకాదు, ఈ సినిమా భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి పాకిస్థానీ సినిమా అంట... గతకొని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రకరకాల పరిణామాల కారణంగా పాకిస్థానీయులు ఎదుర్కొంటున మానసిక సంఘర్షణను తెలియజేయడమే ఈ సినిమా కధాంశం ముఖ్యోద్దేశం. దాదాపు మూడు గంటల నిడివి వున్న ఈ సినిమాలో 5-6 గంటలకు సరిపడా కదాంశంతో, దర్శకుడు షోయబ్ మన్సూర్ సినిమాను చాలా ఆసక్తికరంగా మలిచాడు.

సినిమా ఒక మెంటల్ రీహాబిలిటేషన్ సెంటర్లో మొదలవుతుంది. ఆ తరువాత పాకిస్తానులో 2000 సంవత్సరానికి స్వాగతం పలకటానికి సనద్దమవుతున యువకుల గుంపునొకదాన్ని చూపిస్తారు, ఇంతలో కొంతమంది బైకుల మీద కర్రలూపుకుంటూ వచ్చి, వారి సన్నాహాలన్నిటినీ పాడు చేసేసి వెళ్ళిపోతారు. ఆ తరువాత సీను లండనులో, షాపులో ఉన్న ఒక పాకిస్తానీయుడి వద్దకు అతని స్నేహితుడు వచ్చి, నీ కూతురు ఎవరో తెల్లోడితో తిరుగుతుంది, దానివలన నా కూతురు కూడా చెడిపోతుంది, ఆమెను అదుపులోపెట్టుకోవడం కూడా చేతకాదని తిడుతుంటాడు. ఇలా ఈ మూడు సనివేశాలలో దర్శకుడు మనకు సినిమాలోని ముఖ్యపాత్రలను పరిచయం చేస్తాడు.

ఈ సినిమా ఇద్దరు అన్నతమ్ముల చుట్టూ తిరుగుతుంది. వాళ్లలో ఒకడు తీవ్రవాదంవైపు ఆకర్షితుడైతే, ఇంకొకడు తాను చేయని తప్పుకు (తీవ్రవాదం) బలిపశువైపోతాడు. ఇవే కాక తాలీబన్ల కాలంలో మహిళల పరిస్థితి, ఇస్లాంమతాచారాలను ఒక్కొక్కరూ ఒక్కోరకంగా ఎలా చూస్తారు అనేవాటిని కూడా ఈ సినిమాలో బాగా చూపించాడు. అలాగే తమకొచ్చిన సందేహాలను నివృత్తి చేసుకునే ప్రక్రియలో కొంతమంది పాకిస్తానీయులు మత చాందసవాదుల మాటలకు ఎలా లొంగిపోతారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు. చివరిలో మౌలానా వలీగా ప్రత్యక్షమయ్యే నాసీరుద్దీన్ షా నటన గురించయితే ఇంక ఎంత చెప్పినా తక్కువే...

సినిమా కథా కథనం ఒకెత్తయితే, ఇందులో పాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేంత బాగుంటాయి. అసలు నాకు ఈ పాటలు విన్న తరువాతే సినిమాను చూడాలనిపించింది. ఈ సినిమా 2007 కెయిరో చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది. అంతే కాదు 2009 ఆస్కారు రేసులో కూడా ఉందిప్పుడు.

4 comments:

 1. బాగుంది.

  మొన్నామధ్య కంత్రీ సినిమాకెళ్ళి టికెట్లు దొరక్క తిరుగుతుంటే, ఈ సినిమా పోస్టరు చూసినట్టు గుర్తు ఐనోక్స్ లో. ఏదో టీచింగ్ సినిమా అనుకున్నా..ఈ వారం కాంపు పెట్టాలి.

  ReplyDelete
 2. బాగుంది. ఈ సినిమాని మేమూ చూసేసాం. నేను ఈ సినిమా గురించి రాసిన సమీక్ష ఈ క్రింది లంకెలో చూడగలరు http://navatarangam.com/?p=406

  ReplyDelete
 3. avunu ee cinema chala bagundi,pakistan lo mata chandasavaadaniki naitika viluvalaki yela bali avutayyo,pakistan vaasulani baita prapancham lo ela chustaro,pakistani yuvatha yerakamaina ibbandulanu yedurukuntondo vivaranga chupinchadu.pakistan prasthutam thatastha sthithi lo vundi. matam ani madi kattuku kuchovala ,leka matachandasavadula noru adupucheyyala ani.

  ReplyDelete